- Telugu News Photo Gallery Spiritual photos Mysore Dasara 2024: Captain Abhimanyu will carry ambari for 5th time in Mysore dasara utsavalu
Mysore Dasara 2024: మైసూరు దసరా ఉత్సవాల సన్నాహాలు.. 5వసారి అంబారీని మోయనున్న కెప్టెన్ అభిమన్యు
హిందువుల ముఖ్యమైన పండగల్లో ఒకటి దసరా. ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రులుగా పదవ రోజు విజయ దశమి పండగను కలిసి దసరా మహోత్సవాలు అని అంటారు. శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే ఈ పండుగను శరన్నవరాత్రులు అని కూడా అంటారు. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఘనంగా జరుపుకుంటారు ఈ దసరా ఉత్సవాలను. ఇక మైసూర్ లో దసరా మహోత్సవం ప్రపంచ ప్రఖ్యాతి గాంచించాయి.
Updated on: Jul 24, 2024 | 2:43 PM

మైసూర్ దసరా ఉత్సవాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. మైసూరులో జరిగే దసరా ఉత్సవాలను, ఆయుధ పూజను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. మైసూరు జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ, అటవీ శాఖ దసరా పండుగకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.

దసరా ఉత్సవాల్లో ఏనుగుల అలంకరణా ప్రత్యేకం. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవాల కోసం ప్రస్తుతం 18 ఏనుగులను అటవీశాఖ గుర్తించింది. ఈసారి అదనంగా నాలుగు ఏనుగులను అటవీశాఖ గుర్తించడం ఆసక్తికరం.

దసరా ఉత్సవాలకు రెండు నెలల ముందు గజరాజులు మైసూరుకు చేరుకుంటాయి. మొత్తం 14 ఏనుగుల్లో ఆగస్ట్ 9 లేదా 11 గ తేదీల్లో తొలి దశలో 9 ఏనుగులు మైసూరు చేరుకోనున్నాయి. మిగిలిన 5 ఏనుగులు రెండో దశలో చేరుకోనున్నాయి. ఈ మేరకు అటవీశాఖ సన్నాహాలు చేస్తోంది.

మొదటి దశలో కెప్టెన్ అభిమన్యు, భీమా, కొత్త ఏనుగు ఏకలవ్య, వరలక్ష్మి, ధనంజయ, గోపి, రోహిత, వరలక్ష్మి, కంజన్ ఏనుగులు రానున్నాయి.

రెండో దశలో ప్రశాంత, సుగ్రీవ, మహేంద్ర, లక్ష్మి, హిరణ్య ఏనుగులు వస్తాయి.

మైసూరు మహారాజు పాలన కాలం నుంచి దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆ సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. మైసూర్ మహారాజ కులదైవం అయిన చాముండేశ్వరీ దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగింపుగా రావడం అలవాటు. ఈ ఉత్సవాల్లో ఏనుగుల అలంకరణా ప్రత్యేకమే. ఆయుధ పూజ కూడా ఘనంగా నిర్వహిస్తారు.





























