ఉగ్రదాడిలో ముఖం ఛిద్రం.. 28 ఆపరేషన్లు.. దేశ రక్షణ కోసం మళ్ళీ తుపాకీ పట్టిన కల్నల్ రిషి గురించి మీకు తెలుసా..
దేశాన్ని దుర్మార్గుల నుంచి కాపాడేందుకు.. ప్రాణాలను పణంగా పెట్టి.. అవయవాలు కోల్పోయి జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారు. అలా మాటలకు అందని బాధని భరించి.. అనేక ఆపరేషన్లు చేసిన తర్వాత బతికిన ఒక జవాన్.. మళ్ళీ దేశ రక్షణ కోసం తాను సైతం అంటున్నారు. మళ్ళీ తుపాకీ పట్టుకుని బోర్డర్ వద్ద నిలబడిన రియల్ హీరో లెఫ్టినెంట్ కల్నల్ రిషి రాజలక్ష్మి గురించి మీకు తెలుసా..

దేశ స్వాతంత్యం కోసం బ్రిటిష్ వారితో పోరాటం.. స్వాతంత్యం వచ్చిన తర్వాత.. పొరుగుదేశాలైన పాక్, చైనా వంటి దురాశ కలిగిన దేశాల నుంచి భద్రత కోసం సరిహద్దు దగ్గర మన జవాన్లు నిరంతరం కాపలా కాస్తున్నారు. అవును కుటుంబాలను విడిచి.. ఎండలో ఎండుతూ.. వానలో తడుస్తూ.. చలికి వణుకుతూ రేపటి మనకోసం.. నేటి రోజును త్యాగం చేసే త్యాగధనులు జవాన్లు.. దేశ రక్షణ కోసం తన తోటి భారతీయుల రక్షణ కోసం సంతోషంగా భారతమాత ఒడిలో తుది శ్వాస విడిచే ధన్య జీవులు. దేశాన్ని దుర్మార్గుల నుంచి కాపాడేందుకు.. ప్రాణాలను పణంగా పెట్టి.. అవయవాలు కోల్పోయి జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారు. అలా మాటలకు అందని బాధని భరించి.. అనేక ఆపరేషన్లు చేసిన తర్వాత బతికిన ఒక జవాన్.. మళ్ళీ దేశ రక్షణ కోసం తాను సైతం అంటున్నారు. మళ్ళీ తుపాకీ పట్టుకుని బోర్డర్ వద్ద నిలబడిన రియల్ హీరో లెఫ్టినెంట్ కల్నల్ రిషి రాజలక్ష్మి గురించి మీకు తెలుసా..
కేరళ లోని అలప్పుజలోని ముత్తుకులంకు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ రిషి రాజలక్ష్మి గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఎందుకంటే దేశ రక్షణ కోసం రిషి చేసిన పోరాటం నమ్మ శక్యం కాని ఒక సత్యం. అవును 2017లో భూతల స్వర్గం కాశ్మీర్ లోయను రక్తపుటేరుగా మార్చిన పుల్వామా ఉగ్రదాడిలో గాయపడి.. ప్రాణాలతో యముడి కోసం పోరాడి జీవించి మళ్ళీ దేశ సేవ కోసం జీవితాన్ని అంకితం చేసిన ఒక వీరుని గాథ ఇది.
మార్చి 4, 2017న దక్షిణ కాశ్మీర్ లోని పుల్వామాలోని ఒక గ్రామస్తుడి ఇంట్లో ఉగ్రవాదులు దాక్కున్నారని నిఘా సమాచారం అందడంతో రిషి తన బృందంతో అక్కడ మొహరించారు. అక్కడ జరిగిన ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ లో రిషి తీవ్రంగా గాయపడ్డాడు. మొదటి బుల్లెట్ హెల్మెట్‌లోకి దూసుకెళ్లగా.. రెండవ బుల్లెట్ ముక్కుని చీల్చింది. దవడను ఛిద్రం చేసింది మూడవ బుల్లెట్.. అయినా సరే రిషి పోరాటం ఆపలేదు. గాయాలతో రక్తం కారుతున్నా.. స్పృహ కోల్పోకుండా శత్రువుపై ఎదురుదాడి చేశాడు. దాదాపు 30 కి.మీ దూరంలో ఉన్న ఆర్మీ హాస్పటల్ కి చేరుకునే వరకు కళ్లు మూయలేదు.
వైద్యులు సైతం అని ముఖం చూసి భయపడ్డారు.. అయినా సరే రిషి డాక్టర్స్ కి ఒక్క బొటనవేలితో నేను బాగున్నాను.. మీరు పని మీరు చెయ్యండని చెప్పాడు. అంతేకాదు తనని చూసేందుకు వచ్చిన బంధు, మిత్రులకు కూడా నేను తిరిగి వస్తా భయపడకండి అంటూ చేతితో సైగ చేసి దైర్యం చెప్పాడు. రిషి ని బతికించడానికి 28 శస్త్రచికిత్సలు చేశారు. అయితే చిద్రమైన ముఖాన్ని తిరిగి సరి చేయ లేకపోయారు. దీంతో ముఖానికి ముసుగు ధరించడం మొదలు పెట్టాడు. ఇంత జరిగిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలని భావించలేదు. మళ్ళీ ఆయుధాన్ని చేత బూని మళ్లీ సరిహద్దుల వద్ద కావాలా మొదలు పెట్టాడు. రిషి ప్రస్తుతం పాంగోడ్ మిలిటరీ క్యాంప్‌కు ప్రధాన ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నారు.
ఇంజనీరింగ్ డిగ్రీని వదిలి మాతృభూమి రక్షణ కోసం యుద్ధభూమిని ఎంచుకున్న ఓ యోధుడు..ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ రిషిని కలిసినప్పుడు నా జీవితంలో నేను చూసిన అత్యంత నిర్భయమైన వ్యక్తి రిషి అని అభివర్ణించారు. భారత దేశ చరిత్రలో అత్యంత ఫియర్ లెస్ మ్యాన్ గా ఖ్యతిగాంచాడు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








