- Telugu News Photo Gallery Spiritual photos Shani Dev luck of these zodiac signs will shine on September 7 Chandra Grahan day
Lord Shani: కుంభరాశిలో చంద్ర గ్రహణం.. ఈ రాశులపై శని అనుగ్రహం.. పరిహారాలు ఏమిటంటే
నవ గ్రహాల్లో శనీశ్వరుడు న్యాయాధిపతి. కర్మ ఫల దాత. మనిషి చేసే కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తాడు. సెప్టెంబర్ 7న శని దేవుడు అనేక రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వనున్నాడు. ముఖ్యంగా శనిశ్వర దయతో నాలుగు రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుంది. ఏపనులు చేపట్టినా విజయం వీరిని వరిస్తుంది. శని అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు చేయండి. ఆ అదృష్ట రాశులు ఏమిటంటే..
Updated on: Aug 29, 2025 | 12:21 PM

2025 సంవత్సరంలో సెప్టెంబర్ 7వ తేదీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున 2025 సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఏర్పడనుంది. అలాగే ఈ రోజు భాద్రపద మాస పౌర్ణమి తిథి. ప్రతి సంవత్సరం పితృ పక్షం భాద్రపద మాసంలోని పౌర్ణమి తిథి నుంచి ప్రారంభమవుతుంది.

న్యాయానికి అధిపతి అయిన శనీశ్వరుడు కుంభ రాశి అధిపతి. ఈ సంవత్సరం రెండవ చంద్రగ్రహణం శనీశ్వరుడి రాశి అయినా కుంభ రాశిలో ఏర్పడనుంది. శనీశ్వరుడు ప్రజలకు వారి కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తాడు. అందుకే ఆయనను కర్మ దేవుడిగా భావిస్తారు. ఈ రోజున శనీశ్వరుడు అనేక రాశుల వారిపై తన ఆశీస్సులను కురిపించనున్నాడు.

వృషభ రాశి వారికి ఈ రోజు చాలా బాగుంటుంది. సెప్టెంబర్ 7 ఒక ప్రత్యేకమైన రోజు. శనిదేవుడు వృషభ రాశి వారిని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఎటువంటి పెద్ద సమస్యలకైనా ఈరోజు పరిష్కారాలు దొరుకుతాయి. ఈ రోజు కష్టానికి ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో లాభం వస్తుంది. అయితే ఈ రోజున వృషభ రాశికి చెందిన వ్యక్తులు ఇనుము దానం చేయడం శుభప్రదం. శివుడిని పూజించండి. శివలింగానికి నీటిని సమర్పించండి.

ఈ రోజు మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. శనిదేవుని ఆశీస్సులతో ఈ రోజున లాభం పొందుతారు. వ్యాపారంలో కొత్త అవకాశాలను పొందవచ్చు. ఈ రోజున వివిధ వనరుల నుంచి లాభం పొందవచ్చు, అలాగే కొత్త ఒప్పందం కూడా చేసుకునే అవకాశం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఈ రోజున నల్ల నువ్వులు, మినప పప్పు దానం చేయండి.

తులా రాశి: కుంభ రాశిలో చంద్ర గ్రహణం ఏర్పడడం వలన తులా రాశి వారు ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు. ఈ రోజున తులా రాశి వారు కెరీర్‌లో పురోగతి, ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబం సంబంధాలు బలపడతాయి. మీ అసంపూర్ణమైన, నిలిచిపోయిన పనులు పూర్తి చేయబడతాయి. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం రోజున తులా రాశి వారు శని ఆలయంలోని శని దేవుడి విగ్రహానికి ఆవ నూనెను సమర్పించాలి.. ముఖ్యంగా ఆయన పాదాలకు నూనెను సమర్పించండి. అలాగే శని మంత్రాన్ని జపించాలి.

మకర రాశి : ఈ సంవత్సరంలో ఏర్పడే రెండవ చంద్రగ్రహణం మకర రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. శనీశ్వరుడు మకర రాశికి కూడా అధిపతి. శని దేవుడి ఆశీస్సులతో ఈ రోజు మకర రాశి వారికి గొప్పగా ఉంటుంది. కోర్టు కేసుల్లో వీరు విజయం సాధించవచ్చు. ఉద్యోగంలో పరిస్థితి ఉంటుంది. మనస్సు సంతోషంగా ఉంటుంది. ఈ రోజున రావి చెట్టును పూజించి నూనె దీపం వెలిగించండం మరి పలితాలను ఇస్తుంది.




