Glowing Skin Tips: ఇవి పాటిస్తే మీ ముఖం తళుక్కుమని మెరవాల్సిందే!

అందంగా కనిపించాలనే కోరిక యంగ్ వారి నుంచి ముసలి వారికి కూడా ఉంటుంది. ముఖ్యంగా యూత్ ఎక్కువగా ఆశ పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే మార్కెట్లో లభ్యమయ్యే కాస్మెటిక్స్ కొని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కొన్నింటిని వాడటం వల్ల ముఖం డల్‌గా మారడేమే కాకుండా ముఖంపై మచ్చలు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. దీంతో ఏం చేయాలా అని ఆలోచనలో పడతారు. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే..

Glowing Skin Tips: ఇవి పాటిస్తే మీ ముఖం తళుక్కుమని మెరవాల్సిందే!
Glowing Skin
Follow us
Chinni Enni

|

Updated on: Jun 15, 2024 | 5:39 PM

అందంగా కనిపించాలనే కోరిక యంగ్ వారి నుంచి ముసలి వారికి కూడా ఉంటుంది. ముఖ్యంగా యూత్ ఎక్కువగా ఆశ పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే మార్కెట్లో లభ్యమయ్యే కాస్మెటిక్స్ కొని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కొన్నింటిని వాడటం వల్ల ముఖం డల్‌గా మారడేమే కాకుండా ముఖంపై మచ్చలు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. దీంతో ఏం చేయాలా అని ఆలోచనలో పడతారు. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వస్తువలతోనే మీరు మీ ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

నిమ్మకాయ – పుదీనా:

సమ్మర్‌లో ఎక్కువగా నిమ్మకాయ, పుదీనా నీళ్లు తాగుతూ ఉంటారు. వీటిని తాగడం వల్ల హాయిగా అనిపిస్తుంది. ఎండా కాలం వేడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. బాడీని కూడా చల్లబరుస్తుంది. అంతే కాకుండా నిమ్మకాయ, పుదీనా మీ చర్మానికి మంచి పోషణ కూడా ఇస్తాయి. చర్మం కూడా హైడ్రేట్ అవుతుంది.

చియా సీడ్స్:

అంతే కాకుండా చియా సీడ్స్‌ తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్య పరంగానే కాకుండా చర్మ పరంగా కూడా పోషణ అందిస్తాయి. చియా సీడ్స్‌లో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి. ప్రతి రోజూ మీ డైట్‌లో చియా సీడ్స్ ఉండేలా చూసుకోండి.

ఇవి కూడా చదవండి

మజ్జిగ:

మజ్జిగ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజులో రెండు సార్లు మజ్జిగ తీసుకోవచ్చు. వీటిల్లో పుదీనా పేస్ట్, కొత్తిమీర రసం కూడా కలుపుని తాగితే చాలా మంచిది. శరీరాన్ని కూల్ చేయడమే కాకుండా.. చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చర్మాన్ని హైడ్రేట్ చేసి కాంతివంతంగా ఉంచుతుంది.

బీట్ రూట్ – క్యారెట్ జ్యూస్:

ప్రతి రోజూ మీ డైట్‌లో బీట్ రూట్ క్యారెట్ జ్యూస్ చిన్న గ్లాసు అయినా తాగడం అలవాటు చేసుకోండి. ఇవి చర్మంలో ఉండే మలినాలను శుభ్ర పరిచి.. నేచురల్ గ్లోయింగ్‌ని అందిస్తాయి.

ఆరెంజ్ జ్యూస్:

గ్లోయింగ్ స్కిన్ కావాలి అనుకునేవారు ప్రతి రోజూ ఉదయం బత్తాయి జ్యూస్ తాగడం వల్ల.. మీ చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. ఆరెంజ్ జ్యూస్‌లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని హైడ్రేట్ చేసి.. క్లియర్ స్కిన్‌గా మారుస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..