Sleeping Tips: నిద్ర సరిగ్గా పట్టడం లేదా.. ఈ పండ్లు తింటే చాలు!
నిద్ర అనేది శరీరానికి, మనసుకు చాలా ముఖ్యం. ఒక్క రాత్రి సరిగ్గా నిద్ర పోకపోయినా.. దాని ఎఫెక్ట్ ఉదయం చాలా పడుతుంది. నిద్ర సరిగ్గా లేకపోతే.. నీరసంగా, అలసి పోయినట్టు ఉంటుంది. కళ్లు కూడా సరిగ్గా కబడవు. దేనిమీద కూడా ధ్యాస పెట్టలేరు. ఏ పనీ చేయలేకపోతారు. ఒత్తిడి, ఆందోళన ఎక్కువ అవుతుంది. అందుకే నిద్ర అనేది కేవలం శరీరానికే కాకుండా.. మీ మనసుకు కూడా చాలా ఇంపార్టెంట్. కొంత మందికి సాధారణంగా నిద్ర పట్టక.. నిద్రపోరు. కానీ ఇంకొంత మంది మాత్రం..
నిద్ర అనేది శరీరానికి, మనసుకు చాలా ముఖ్యం. ఒక్క రాత్రి సరిగ్గా నిద్ర పోకపోయినా.. దాని ఎఫెక్ట్ ఉదయం చాలా పడుతుంది. నిద్ర సరిగ్గా లేకపోతే.. నీరసంగా, అలసి పోయినట్టు ఉంటుంది. కళ్లు కూడా సరిగ్గా కబడవు. దేనిమీద కూడా ధ్యాస పెట్టలేరు. ఏ పనీ చేయలేకపోతారు. ఒత్తిడి, ఆందోళన ఎక్కువ అవుతుంది. అందుకే నిద్ర అనేది కేవలం శరీరానికే కాకుండా.. మీ మనసుకు కూడా చాలా ఇంపార్టెంట్. కొంత మందికి సాధారణంగా నిద్ర పట్టక.. నిద్రపోరు. కానీ ఇంకొంత మంది మాత్రం నిద్ర వచ్చినా ఆపుకుని మరీ టీవీలు, సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారు. ఇలా నిద్రను ఆపుకోవడం వల్ల చాలా దీర్ఘకాలిక సమస్యలు కూడా వస్తాయి. డయాబెటీస్, బీపీ, బరువు పెరగడం, గుండె జబ్బులు, క్యాన్సర్లు ఇలా చాలా రకాల వ్యాధులు రావచ్చు. కాబట్టి సరైన నిద్ర అనేది ఖచ్చితంగా అవసరం. కనీసం 7 గంటలు నిద్ర అయినా మనిషికి అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిద్ర సరిగ్గా పట్టని వారు రాత్రి పూట కొన్ని రకాల పండ్లను తింటే పడుతుందని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూడండి.
యాపిల్:
యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ యాపిల్ తింటే వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. రాత్రి పూట తినడానికి యాపిల్ అనేది బెస్ట్ స్నాక్‌గా చెప్పొచ్చు. రాత్రి ఆకలి వేస్తే ఎలాంటి సందేహం లేకుండా యాపిల్ తినండి. ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. నిద్ర అనేది బాగా పడుతుంది.
బొప్పాయి:
బొప్పాయిలో విటమిన్ సి, ఇ, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు కూడా సానుకూలంగా నిద్ర పోయేలా చేస్తాయి. నిద్ర లేమి సమస్యలతో ఇబ్బంది పడేవారు రాత్రి పూట బొప్పాయి తింటే మంచి ఫలితం ఉంటుంది.
విటమిన్ సి పండ్లు:
రాత్రి పూట నిద్ర చక్కగా పట్టాలంటే.. విటమిన్ సి ఉండే పండ్లు తినాలి. ఇవి తినడం వల్ల ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా హాయిగా నిద్ర పడుతుంది.
పైనాపిల్:
పైనాపిల్ లో విటమిన్ సి, ఫైబర్, మెగ్నీషియం, మెలటోనిన్ వంటి పోషకాలు ఉంటాయి. పైనాపిల్‌ను రాత్రి పూట తినడం వల్ల.. ప్రశాంతంగా నిద్ర పోవచ్చు. ఇది నిద్రను ప్రత్యక్షంగా, పరోక్షంగా సానుకూలంగా ప్రభావింతం చేస్తాయి. అలాగే అరటి పండు తిన్నా నిద్ర చక్కగా పడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.