Relationship: మీ లవర్‌ను ఇలా ఇంప్రెస్ చేయండి.. జీవితంలో మిమ్మల్ని మర్చిపోలేరు..
valentines week 2024 - kiss day: ప్రేమికులు, పెళ్లైన వారు ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో వచ్చే వాలెంటైన్స్ వీక్ కోసం ఎంతో కాలంలో వేచి చూస్తుంటారు. అందుకే ఫిబ్రవరిని లవ్ మంత్ అని పేర్కొంటారు. వాలెంటైన్ వీక్ లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ వారంలో ప్రతి రోజు రిలేషన్‌షిప్‌కి భిన్నమైన ప్రాముఖ్యత ఉంటుంది.
Valentines week 2024 – kiss day: ప్రేమికులు, పెళ్లైన వారు ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో వచ్చే వాలెంటైన్స్ వీక్ కోసం ఎంతో కాలంలో వేచి చూస్తుంటారు. అందుకే ఫిబ్రవరిని లవ్ మంత్ అని పేర్కొంటారు. వాలెంటైన్ వీక్ లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ వారంలో ప్రతి రోజు రిలేషన్‌షిప్‌కి భిన్నమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ లవ్ వీక్ ఫిబ్రవరి 7న రోజ్ డేతో మొదలవుతుంది. ఆతర్వాత ప్రపోజ్ డే, చాక్లెట్, టెడ్డీ, ప్రామిస్, హగ్ అండ్ కిస్ డే.. చివరకు ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేతో ఈ వీక్ పూర్తవుతుంది. ఈ రోజు ఫిబ్రవరి 13న ఈ రోజు కిస్ డేగా జరుపుకుంటారు. మీ ప్రేమను వ్యక్తపరిచే ఈ విధానం కూడా ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది. జంటలు ముద్దులు పెట్టుకోవడం ద్వారా తమ సంబంధాన్ని బలోపేతం చేసుకుంటారు. అయితే ఇది ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, కిస్ డే రోజున మీరు మీ భాగస్వామికి ఏదో ఒక బహుమతి ఇవ్వడం లేదా వారిని ఆశ్చర్యపరిచి ఆకట్టుకోవచ్చు. కిస్ డే సందర్భంగా అలాంటి కొన్ని బెస్ట్ గిఫ్ట్ ఐడియాలను ఇప్పుడు తెలుసుకోండి..
వీ బడ్జెట్‌లో కిస్ డే గిఫ్ట్ ఐడియాలు..
లవ్ నోట్స్ – కూపన్లుః మీకు కావాలంటే, మీరు మీ భాగస్వామి లేదా లవర్ కోసం నోట్స్ లేదా కిస్ కూపన్‌లను ఏర్పాటు చేసుకుని వాటిని బహుమతిగా ఇవ్వవచ్చు. మీరు మీ పాత జ్ఞాపకాలను ఈ నోట్స్‌లో వ్రాసి మీ భాగస్వామికి ఇవ్వవచ్చు. ఈ విధంగా జ్ఞాపకాలను రాసి.. వాటిని మీతో ఎల్లప్పుడూ ఉంచుకోవచ్చు. ఇంకా మీకు కావాలంటే, మీరు మ్యాచింగ్ టాటూలను కూడా వేయించుకోవచ్చు. ఈ పద్ధతి ప్రేమను వ్యక్తీకరించడానికి చాలా భిన్నమైన.. ప్రత్యేకమైన మార్గం.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండిః మీ భాగస్వామి పట్ల ప్రేమతో వారికి స్మార్ట్ వాచ్ లేదా ఇతర వస్తువులను ఇవ్వడం ద్వారా అతని/ఆమె ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవచ్చు. మార్కెట్‌లో లభించే ఈ వాచ్‌ను బడ్జెట్‌లో కొనుగోలు చేయవచ్చు. అనేక ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. మీ భాగస్వామి స్టెప్ కౌంట్, హార్ట్ రేట్ లేదా బీట్ వంటి ఫీచర్‌ల ద్వారా వారి ఆరోగ్యాన్ని ట్రాక్ చేయవచ్చు. ఈ పద్ధతి ప్రత్యేకంగా, ఉపయోగకరంగా ఉంటుంది.. కావున మీరూ ట్రై చేయండి..
తినడానికి బయటకు తీసుకెళ్లండిః ఈ ప్రత్యేక సందర్భంలో, మీరు మీ భాగస్వామిని భోజనానికి తీసుకెళ్లవచ్చు. రెస్టారెంట్‌లో కూర్చొని మీకు ఇష్టమైన వాటిని తినడం వల్ల సంబంధంలో ప్రేమ రెట్టింపు అవుతుంది. అలాగే, ఈ విధంగా మీరిద్దరూ నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు. మీ భాగస్వామికి ఇష్టమైన ఆహారం, పానీయాలను ఆర్డర్ చేయండి. ఈ విధంగా మీరు ఆమెను తక్కువ బడ్జెట్‌లో ఆకట్టుకోవచ్చు.
తక్షణ బహుమతి ఆలోచనః మీరిద్దరూ బయటకు వెళ్తున్నట్లయితే, మీ భాగస్వామికి ఇష్టమైన వస్తువును మార్కెట్ నుండి కొనుగోలు చేయండి. ఇందులో గడియారాలు, దుస్తులు లేదా ఇతర వస్తువులను సెలక్ట్ చేసుకోండి.. అమ్మాయిలు షాపింగ్ చేయడానికి మంచిగా ఇష్టపడుతుంటారు.. కావున ఈ పద్ధతి బంధాన్ని మరింత పెంచుతుంది.
పువ్వులను బహుమతిగా ఇవ్వండిః రంగురంగుల పువ్వుల వాసన మీ సంబంధంలో సానుకూల మార్పును తెస్తుంది. అమ్మాయిలు ఎర్ర గులాబీలు లేదా ఇతర పువ్వులను ఇష్టపడతారు. బొకే లేదా పువ్వులు బహుమతిగా ఇవ్వడం వల్ల మీ భాగస్వామిని ఏ సమయంలోనైనా ఆకట్టుకోవచ్చు. బహుమతిగా ఇచ్చిన పుష్పగుచ్ఛం తక్షణమే ఆమె ముఖంలో చిరునవ్వును తీసుకురాగలదు. ఎందుకంటే అది ఆమెకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. మీరు డేటింగ్‌కు వెళుతున్నట్లయితే, బహుమతితో పాటు ఒక పువ్వును తీసుకెళ్లడం మర్చిపోవద్దు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..