Health: భుజం నొప్పిని లైట్‌ తీసుకోకండి.. క్యాన్సర్‌కి సంకేంతం కావొచ్చు..

ఇంతకీ ఊపిరితిత్తులకు, భుజం నొప్పికి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా.? పాన్‌కోస్ట్ ట్యూమర్ అనేది ఊపిరితిత్తుల క్యాన్సర్. ఇది ఊపిరితిత్తుల ఎగువ భాగంలో పెరుగుతుంది. అలాగే భుజాల సమీపంలోని కణజాలంపై దాడి చేస్తుంది. దీని కారణంగా, భుజాలలో నొప్పి మొదలవుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో, చాలా సార్లు...

Health: భుజం నొప్పిని లైట్‌ తీసుకోకండి.. క్యాన్సర్‌కి సంకేంతం కావొచ్చు..
Schoulder Pain
Follow us

|

Updated on: Feb 13, 2024 | 3:38 PM

మనలో చాలా మంది చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకుండా వదిలేస్తుంటాము. అయితే ఈ సమస్యలున సాధారణమని వదిలేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిలో భుజం నొప్పి ఒకటని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది భుజం నొప్పిని పట్టించుకోరు. అయితే భుజంలో నిరంతర నొప్పి క్యాన్సర్‌ వంటి ప్రమాదకరమైన వ్యాధికి సంకేతమని చెబుతున్నారు. దీర్ఘకాలంగా భుజం నొప్పితో బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. విపరీతమైన భుజం నొప్పి ఊపిరిత్తుల క్యాన్స్‌రకు సూచిక కావొచ్చని చెబుతున్నారు.

ఇంతకీ ఊపిరితిత్తులకు, భుజం నొప్పికి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా.? పాన్‌కోస్ట్ ట్యూమర్ అనేది ఊపిరితిత్తుల క్యాన్సర్. ఇది ఊపిరితిత్తుల ఎగువ భాగంలో పెరుగుతుంది. అలాగే భుజాల సమీపంలోని కణజాలంపై దాడి చేస్తుంది. దీని కారణంగా, భుజాలలో నొప్పి మొదలవుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో, చాలా సార్లు నొప్పి శరీరంలోని కొన్ని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. అందులో భుజం నొప్పి ఒకటని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో పని ఎక్కువైనా, కూర్చునే విధానం తప్పుగా ఉన్నా, భుజం నొప్పి వేధిస్తుంది.

ముఖ్యంగా కంప్యూటర్‌ ముందు కూర్చునే వాళ్లలో మెడ నొప్పి కారణంగా భుజం నొప్పి వస్తుంది. దీనిని స్పాండిలైటిస్‌గా చెబుతుంటారు. అయితే ఇలాంటి ఏ పని చేయకుండా కూడా భుజం నొప్పి వేధిస్తుంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపునులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కారణంగా చ్చే భుజం నొప్పి సాధారణ ఆర్థరైటిస్‌ నొప్పిలాగే ఉంటుంది. అయితే ఈ నొప్పిలో కొన్ని చిన్న చిన్న తేడాలు ఉంటాయి.

లంగ్‌ క్యాన్సర్‌ కారణంగా వచ్చే భుజం నొప్పి రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి వ్యాయామం చేయకపోయినా, భుజం నొప్పి ఇబ్బంది పెడితే వైద్యులను సంప్రదించాలి. అయితే ప్రతీసారీ భుజం నొప్పి క్యాన్సర్‌కు కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే దీర్ఘకాలంగా సమస్య ఉంటే మాత్రం అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..