Digital Dementia: పిల్లల్లో డిజిటల్ డైమెన్షియా.. ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకండి!
నేటి డిజిటల్ యుగంలో మొబైల్ స్క్రీన్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్.. వంటి డిజిటల్ గాడ్జెట్స్‌తో మనం ఎక్కువ సమయం గడుపుతున్నాం. ఇంట్లో పిల్లలు కూడా స్క్రీన్ల ముందు గంటల తరబడి గడుపుతున్నారు. దీంతో పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్ చూడటం వల్ల డిజిటల్ డిమెన్షియా ప్రమాదం పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు...
నేటి డిజిటల్ యుగంలో మొబైల్ స్క్రీన్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్.. వంటి డిజిటల్ గాడ్జెట్స్‌తో మనం ఎక్కువ సమయం గడుపుతున్నాం. ఇంట్లో పిల్లలు కూడా స్క్రీన్ల ముందు గంటల తరబడి గడుపుతున్నారు. దీంతో పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్ చూడటం వల్ల డిజిటల్ డిమెన్షియా ప్రమాదం పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డిజిటల్ డిమెన్షియా అంటే ఏమిటి?
కంప్యూటర్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్ వినియోగం వంటి డిజిటల్ టెక్నాలజీని అధికంగా ఉపయోగించడం వల్ల మెదడు పనితీరు క్షీణించడాన్ని డిజిటల్ డిమెన్షియా అంటారని ఢిల్లీ సీనియర్ సర్జన్ డాక్టర్ మనీష్ కుమార్ పేర్కొన్నారు. అంటే.. స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడిపినప్పుడు, వివిధ చిత్రాలు, వీడియోలు, యాప్‌లు మీ మెదడుపై ఏకకాలంలో దాడి చేస్తాయి. దీని కారణంగా మెదడుకు ప్రతిదీ గుర్తుంచుకోవడం సాధ్యం కాదు. ఈ గందరగోళం కారణంగా మెదడుపై ప్రభావం పడుతుంది.
డిజిటల్ డిమెన్షియా లక్షణాలు
ఎక్కువ సమయం స్క్రీన్ చూడటం వల్ల పిల్లలలో డిజిటల్ డిమెన్షియా లక్షణాలు కనిపిస్తాయి. ఏయే లక్షణాలు కనిపిస్తాయంటే..
- అల్జీమర్స్
- ఏకాగ్రత అసమర్థత
- విషయాలను గుర్తుంచుకోలేకపోవడం
- ఏకాగ్రత సామర్థ్యం తగ్గడం
- పనితీరు తగ్గడం.. వంటివి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి.
డిజిటల్ డిమెన్షియా నివారణ మార్గాలు
ఈ తీవ్రమైన వ్యాధి నుండి పిల్లలను రక్షించడానికి ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి..
- స్క్రీన్ సమయాన్ని పరిమితంగా వినియోగించాలి. పిల్లలను రెండు గంటల కంటే ఎక్కువ సమయం స్క్రీన్‌ని చూడటానికి అనుమతించకూడదు. స్క్రీన్ నుంచి దూరంగా ఉండగలిగేలా పిల్లలకు గేమ్‌లను ఏర్పాటు చేయాలి.
- డిజిటల్ పరికరాలపై ఆధారపడే బదులు మెదడును ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. పని కోసం కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌ని ఉపయోగించకుండా రాయడానికి ప్రయత్నించాలి.
- కొత్త విషయాలు నేర్చుకోవడం, పిల్లలను బిజీగా ఉంచడానికి ప్రయత్నించాలి. వారికి కొత్త విషయాలు నేర్పించడానికి ప్రయత్నించాలి. పిల్లలను కొత్త భాష, నృత్యం, సంగీతం, కరాటే వంటి తరగతుల్లో చేర్పించాలి.
- పిల్లల శారీరక శ్రమను పెంచాలి. స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడపడం వల్ల పిల్లల్లో ఊబకాయం సమస్య తలెత్తుతుంది. దీన్ని తొలగించడానికి పిల్లలను బహిరంగ ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి.
- పుస్తకాలు చదివించాలి. పిల్లలు ప్రతిదీ వారి తల్లిదండ్రులను చూసి మాత్రమే నేర్చుకుంటారు. అందువల్ల పిల్లలలో పుస్తకాలు చదివే అలవాటును పెంపొందించాలి. ఇది వారి జ్ఞానాన్ని పెంచుతుంది. వారి మనస్సుకు పదును పెడుతుంది.
- పజిల్ గేమ్‌లను నేర్పించాలి. పిల్లలకు పజిల్స్ నేర్పించడం, మెదడు ఉపయోగించే నంబర్ గేమ్‌లు ఆడించాలి. దీనివల్ల మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. పిల్లల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.