Nose Picking Habit: జాగ్రత్త..! పదే పదే ముక్కులో వేలు పెట్టుకుంటున్నారా..? పరిశోధనలో భయానక విషయాలు..
అసలే ఈ అలవాటు చాలా చెడ్డది. అలా చేసే వారు ఈ అలవాటును అంత త్వరగా వదులుకోలేరు, అయితే ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంత హాని కలుగుతుందో తెలుసా.? పదే పదే ముక్కులో వేళ్లు పెట్టుకునే అలవాటు కారణంగా కొన్ని సూక్ష్మక్రిములు నాసికా కుహరంలోకి ప్రవేశిస్తాయని, ఇది భయంకరమైన వ్యాధికి దారితీసే ప్రమాదం ఉందని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ముక్కులో వేలు పెట్టుకోవడం మీలో చాలా మందికి అలవాటు కావచ్చు, కానీ మీ ఈ అలవాటు మిమ్మల్ని తీవ్రమైన వ్యాధులకు గురి చేస్తుందని మీకు తెలియదు. ముక్కులో వేలు పెట్టుకునే ఈ అలవాటు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మందిలో కనిపిస్తుంది. కొందరు బహిరంగంగానూ, కొందరు రహస్యంగానూ చేస్తారు. చాలా సార్లు ఇలా జరుగుతుంది. ఎవరైనా ఇలా చేయడం మనం చూస్తే, ఆ వ్యక్తి సిగ్గు పడుతుండటం కూడా మనం చూస్తుంటాం..అసలే ఈ అలవాటు చాలా చెడ్డది. అలా చేసే వారు ఈ అలవాటును అంత త్వరగా వదులుకోలేరు, అయితే ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంత హాని కలుగుతుందో తెలుసా.? పదే పదే ముక్కులో వేళ్లు పెట్టుకునే అలవాటు కారణంగా కొన్ని సూక్ష్మక్రిములు నాసికా కుహరంలోకి ప్రవేశిస్తాయని, ఇది అల్జీమర్స్ వ్యాధికి దారితీసే ప్రమాదం ఉందని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
తరచుగా ముక్కులో వేలు పెట్టుకునే వారికి అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ముక్కులో వేళ్లు పెట్టుకోవడం ద్వారా వ్యాధికారకాలు మెదడులో బీటా అమిలాయిడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. బీటా అమిలాయిడ్ అనే ప్రోటీన్ అల్జీమర్స్ పురోగతిలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీని కారణంగా అల్జీమర్స్ వంటి న్యూరో-ఇన్‌ఫ్లమేటరీ సమస్యలను కలిగిస్తుందని చెప్పారు.
మాటి మాటికి ముక్కులో వేలుపెట్టుకునే కారణంగా వ్యాధి కారక సూక్ష్మజీవులు ముక్కు ద్వారా మెదడుకు సులభంగా చేరుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యాధికారక, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా నాసికా కణాలకు సోకుతుంది. అలా అది చివరకు మెదడుకు చేరుతుంది. కాబట్టి వెంటనే ఈ అలవాటు మానేయండి. లేదంటే, ప్రమాదం తీవ్రత చాలా ఎక్కువగానే ఉంటుంది. అందుకు సిద్దంగా ఉండండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..