మూత్రం నురగలుగా వస్తుందా? అయితే కారణం తెలుసుకోండి? నిర్లక్ష్యం ఖరీదుగా మారే ప్రమాదం ఉంది..

గుడ్డు, చేప, గింజలు, ధాన్యం, ఆకుపచ్చ కూరగాయలు, పండు, పాలు మరియు పెరుగు, జున్ను మొదలైనవి విరివిగా తింటూ ఉండటం మంచిది. ధూమపానం చేయవద్దు, ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించండి. నూనె, మసాలాలు ఎక్కువగా తీసుకోవద్దు. పుష్కలంగా నీరు త్రాగాలి. మూత్రం ఎక్కువ సమయం ఆపుకోవటం కూడా మంచిది కాదు.

మూత్రం నురగలుగా వస్తుందా? అయితే కారణం తెలుసుకోండి? నిర్లక్ష్యం ఖరీదుగా మారే ప్రమాదం ఉంది..
Foamy Urine
Follow us

|

Updated on: Feb 13, 2024 | 2:51 PM

Foamy Urine Causes: మీ మూత్రంలో నురుగు వస్తుందా..? కొన్నిసార్లు మూత్ర విసర్జన చేసేటప్పుడు నురుగు బయటకు వస్తున్నట్లు అనిపిస్తుందా..? కూల్‌డ్రింక్స్‌ బాటిల్‌ ఓపెన్ చేసినప్పుడు ఒక్కసారిగా నురగ రావడం గమనించారా..? అలాగే, మూత్రంలో ఇలాంటి నురుగు కనిపిస్తుందా..? అయితే, పొరపాటున కూడా ఈ విషయాన్ని విస్మరించకూడదని వైద్య ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టయితే, ఈ సమస్య కిడ్నీకి సంబంధించినది కావచ్చు, నిర్లక్ష్యం చేయడం వల్ల ఇది మీకు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే, కిడ్నీలో ఏదైనా సమస్య వస్తే దాని ప్రభావంతో అనేక రకాల సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది.

మూత్రవిసర్జన సమయంలో నురుగు ఎక్కువగా ఉంటే, మూత్రం రంగులో మార్పు, వాసన మొదలైనవి మీ మూత్రపిండాల సమస్యకు సంకేతాలు. మూత్రం నురుగు రావడానికి ఒత్తిడి కూడా ప్రధాన కారణం. మూత్రం నురుగుతో వస్తే.. ఎక్కువగా ఒత్తిడికి గురికావద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగే అలవాటు మీ కిడ్నీలను దెబ్బతీస్తుంది. కాబట్టి దాహం వేయకపోయినా రోజుకు రెండు మూడు లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోండి. శరీరంలో నీటిశాతం తగ్గితే మూత్రం నురగ, మూత్రం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

దాంతో పాటు మీ కిడ్నీలు దెబ్బతినడం, సరిగ్గా పనిచేయకపోవడం ప్రారంభించినప్పుడు మూత్రంలో ప్రోటీన్ కనిపించడం ప్రారంభమవుతుంది. కిడ్నీ సమస్య వల్ల కొందరిలో నురుగుతో కూడిన మూత్రం వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో నీటిశాతం తక్కువగా ఉన్నవారిలో కిడ్నీలో రాళ్ల సమస్య పెరుగుతుంది. ఫలితంగా మూత్రంలో నురగ వస్తుంది. మూత్రంలో నురుగు ఎందుకు ఏర్పడుతుంది.? దాని లక్షణాలు ఎలా కనిపిస్తాయో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు ..

– ఆకలి లేకపోవటం

– తలనొప్పి తరచూ వేధించటం

– ఉన్నట్టుండి బరువు తగ్గిపోవటం

– వికారం

– తరచూగా అలసిపోతున్నట్టుగా అనిపించటం

– పాదాలు, ముఖంలో వాపు

– అతిగా దాహం వేయటం

– వాంతులు అవుతున్నట్లు అనిపిస్తుంది

– – నిద్రలేమి సమస్యతో బాదపడటం

మూత్రంలో నురుగు వల్ల వచ్చే ప్రమాదం ఏమిటి?

– గుండె వ్యాధి

– శరీరంలో ప్రోటీన్ లోపం

– పెరుగుతున్న మధుమేహ సమస్య

– మూత్రపిండ వైఫల్యం

మూత్రంలో నురుగు వస్తే ఏం తినాలి..? ఏం తినకూడదు.!

* గుడ్డు, చేప, గింజలు, ధాన్యం, ఆకుపచ్చ కూరగాయలు, పండు, పాలు మరియు పెరుగు, జున్ను మొదలైనవి విరివిగా తింటూ ఉండటం మంచిది.

* ధూమపానం చేయవద్దు, ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించండి. నూనె, మసాలాలు ఎక్కువగా తీసుకోవద్దు. పుష్కలంగా నీరు త్రాగాలి. మూత్రం ఎక్కువ సమయం ఆపుకోవటం కూడా మంచిది కాదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..