Herm Island: రద్దీలేని ద్వీపం రమ్మని పిలుస్తోంది..! కార్లు, ఫోన్లు, గడియారం లేని ప్రశాంత ప్రదేశంలో బిందాస్‌ లైఫ్‌.. ఎక్కడంటే..

ఈ ప్రత్యేకమైన ద్వీపంలో టీవీ, ఫోన్ కనీసం గడియారం కూడా లేని హోటల్ ఒకటి ఉంది. 1.35-మైళ్ల పొడవైన ఈ ద్వీపంలో వెకేషన్ కాటేజీలు, క్యాంపింగ్ స్పాట్‌లు ఉన్నాయి. ఇక్కడి అందమైన ప్రకృతి, అద్భుతమైన జలాలతో పాటు మరెన్నో ఆస్వాదించవచ్చు. ఆ తర్వాత మొత్తం సమయాన్ని బీచ్‌లో హాయిగా ఎంజాయ్‌ చేయొచ్చు. ఇక్కడ వైన్ రుచి చూడవచ్చు. ఇంకా ఆపై కావాల్సినంత సేపు బీచ్‌లో

Herm Island: రద్దీలేని ద్వీపం రమ్మని పిలుస్తోంది..! కార్లు, ఫోన్లు, గడియారం లేని ప్రశాంత ప్రదేశంలో బిందాస్‌ లైఫ్‌.. ఎక్కడంటే..
Herm Island
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 13, 2024 | 1:01 PM

చాలా మంది విశ్రాంతి కోసం టూర్స్‌ వెళ్తుంటారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపేందుకు సముద్ర తీరాలను సందర్శిస్తారు. అక్కడి బీచ్‌లో సహజమైన జలాలు, తక్కువ రద్దీ, ఎక్కువ ప్రశాంత లభిస్తుంది. ద్వీపాలు అలాంటి వారికి ప్రశాంతమైన మంచి సెలవులను అందిస్తాయి. అందువల్ల చాలా మంది ద్వీపాలను బెస్ట్‌ హాలీడే స్పాట్‌గా ఎంచుకుంటారు. అలాంటి ప్రదేశం కోసం స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్ లేదా గ్రీస్‌ వంటి దేశాలకు వెళ్తుంటారు.. అయితే, విదేశీ యాత్రలు చేసే వారు.. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఈ ద్వీపానికి కూడా విహారయాత్ర కోసం వెళ్లవచ్చు. అక్కడ మీరు ఈ బిజీ ప్రపంచం నుండి డిస్‌కనెక్ట్ అయిపోవచ్చు. UKలోని ఈ ద్వీపంలో కార్లు వంటి ఏ ఇతర వాహనాలు ఉండవు. రద్దీ లేని ద్వీపం ఇది.. టీవీ, ఫోన్, గడియారం కూడా లేని హోటల్ ఒకటి ఉంది. ఇంతకీ ఈ ద్వీపం ఏమిటి? ఇక్కడికి ఎలా వెళ్లాలి..? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హెర్మ్ ద్వీపంలో కార్లు లేవు, గుంపులు గుంపులుగా ఉండే జన సమూహం కనిపించదు. ఒత్తిడి అన్న మాట కూడా వినిపించదు. మీరు ఈ బ్రిటీష్ ద్వీపంలో మీ కుటుంబంతో లేదంటే, ప్రియమైనవారితో విశ్రాంతి, ఆహ్లాదకరమైన అనుభవం కోసం ఈ ఉత్కంఠభరితమైన తీర ప్రాంతాన్ని సందర్శించవచ్చు.. ఇక్కడి అందమైన ప్రకృతి, అద్భుతమైన జలాలతో పాటు మరెన్నో ఆస్వాదించవచ్చు. అయితే, ఈ హెర్మ్ ద్వీపానికి కార్లు వెళ్లలేవు. ఈ ప్రత్యేకమైన ద్వీపంలో టీవీ, ఫోన్ కనీసం గడియారం కూడా లేని హోటల్ ఒకటి ఉంది. 1.35-మైళ్ల పొడవైన ఈ ద్వీపంలో వెకేషన్ కాటేజీలు, క్యాంపింగ్ స్పాట్‌లు ఉన్నాయి. అక్కడికి చేరుకోవడానికి 15 నిమిషాల ప్రయాణం అయిన గ్వెర్న్సీ నుండి ఫెర్రీలో ప్రయాణించాలి.. లేదా లండన్ గాట్విక్ నుండి 90 నిమిషాల విమానాన్ని బుక్ చేసుకోవాలి.

హెర్మ్ ద్వీపంలో కేవలం 65 మంది జనాభా మాత్రమే నివసిస్తోంది. దాని పరిసరాలను దాదాపుగా ఇతరులేవరూ తాకలేదు. ఇది ప్రధాన ఆకర్షణగా తెల్లటి ఇసుక బీచ్‌లను కలిగి ఉంటుంది. అక్కడ విరివిగా తిరిగే డాల్ఫిన్‌లను చూడవచ్చు. ముందుగా మీ దృష్టిని ఆకర్షించేది మణి నీలిరంగు నీరు, అరుదైన తెల్లటి ఇసుక. ఒక హోటల్ కాకుండా, ఈ చిన్న ద్వీపంలోని ఇతర భవనాలు రెండు పబ్బులు, ఒక అగ్నిమాపక కేంద్రం, ఒక పోలీసు స్టేషన్ మరియు నలుగురు విద్యార్థులతో కూడిన ప్రాథమిక పాఠశాల కూడా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మీరు హెర్మ్ ద్వీపాన్ని నిమిషాల వ్యవధిలోనే చుట్టేయవచ్చు. ఆ తర్వాత మొత్తం సమయాన్ని బీచ్‌లో హాయిగా ఎంజాయ్‌ చేయొచ్చు. ఇక్కడ వైన్ రుచి చూడవచ్చు. ఇంకా ఆపై కావాల్సినంత సేపు బీచ్‌లో వాకింగ్‌ కూడా చేసుకోవచ్చు. ద్వీపంలో కార్లు అనుమతించబడనప్పటికీ, ఇది వివిధ రకాల ఆహార పదార్థాలను అందిస్తుంది. అక్కడ వంటకాలతో తన అతిథులను ఆశ్చర్యపరుస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే