Watch Video: ఈ కోతి మహా తెలివైనదిరో.. కిటికీలోంచి కారులోకి చొరబడిన వానరం ఏం చేసిందో తెలిస్తే అవాక్కే..!

రోడ్డుపక్కన ఉన్న రెయిలింగ్‌పై నడుస్తున్న ఒక పెద్ద కోతి అకస్మాత్తుగా పైకి ఎగిరి కారు కిటికీలోంచి లోపలికి దూకింది. దాంతో కారులో ఉన్నవారు వెంటనే దానికి కావాల్సిన తినే పదార్థాలన్ని ఇచ్చేశారు. అవి తీసుకున్న తర్వాత కూడా ఆ కోతి అక్కడ్నుంచి వెళ్లిపోలేదు.. కారు డ్యాష్‌బోర్డ్‌ను ఓపెన్ చేసి స్నాక్స్‌ కోసం వెతికింది.. అందులో దొరికినవన్నీ మడతపెట్టింది..

Watch Video: ఈ కోతి మహా తెలివైనదిరో.. కిటికీలోంచి కారులోకి చొరబడిన వానరం ఏం చేసిందో తెలిస్తే అవాక్కే..!
Wild Monkey
Follow us

|

Updated on: Feb 13, 2024 | 11:51 AM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ లక్షలాది వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ జంతువుల వీడియోలు నెటిజన్లను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఈ కోతి వీడియోలు ప్రజలను నవ్విస్తాయి. కోతులు తెలివైన జంతువులు, కానీ వాటి చేష్టలు చాలా మందికి ఇబ్బంది కలిగిస్తాయి. కోతులు అకస్మాత్తుగా దాడి చేసి ప్రజల బ్యాగులు, పర్సులు, మొబైల్ ఫోన్లు, కెమెరాలను ఎత్తుకెళ్లిన వీడియోలు ఇంటర్నెట్‌లో చాలానే ఉన్నాయి. కోతులు చేసే చిలిపి పనులు కొన్ని కొన్ని సార్లు నవ్వుతెపిస్తాయి. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి. వానరాలు చేసిన అల్లరికి సంబంధించిన మరో వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

dunia.hewan అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా కోతి ఫన్నీ వీడియోను షేర్ చేశారు. వీడియోలో కొందరు అడవి మార్గం గుండా కారులో వెళ్తున్నారు. ఈ సమయంలో ఒక తల్లి కోతి దాని పిల్లతో కలిసి అటుగా వచ్చాయి. ఈ కోతులను చూసిన వాహనంలో ఉన్నవారు వాటికి బిస్కెట్లు వేయాలని చూశారు. అంతలోనే వారికి ఊహించని సంఘటన ఎదురైంది. దాంతో వారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. రోడ్డుపక్కన ఉన్న రెయిలింగ్‌పై నడుస్తున్న ఒక పెద్ద కోతి అకస్మాత్తుగా పైకి ఎగిరి కారు కిటికీలోంచి లోపలికి దూకింది.

ఇవి కూడా చదవండి

దాంతో కారులో ఉన్నవారు వెంటనే దానికి కావాల్సిన తినే పదార్థాలన్ని ఇచ్చేశారు. అవి తీసుకున్న తర్వాత కూడా ఆ కోతి అక్కడ్నుంచి వెళ్లిపోలేదు.. కారు డ్యాష్‌బోర్డ్‌ను ఓపెన్ చేసి స్నాక్స్‌ కోసం వెతికింది.. అందులో దొరికినవన్నీ మడతపెట్టింది.. బిస్కెట్‌ ప్యాకెట్లతో సహా చాలా ఫుడ్ ప్యాక్‌లను తీసుకుని వెళ్లిపోయింది. కోతి ఈ చిలిపి చేష్టకు కారులో ఉన్నవారు పడిపడి నవ్వుకున్నారు. కోతి ఫన్నీ ఎపిసోడ్‌ని తన మొబైల్‌లో చిత్రీకరించారు.

View this post on Instagram

A post shared by Dunia hewan (@duniah.hewan)

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఈ కోతి తెలివికి వావ్ అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..