Viral News: డైయిర్‌ మిల్క్‌ చాక్లెట్‌లో పురుగు.. స్పందించిన క్యాడ్‌బెరీ యాజమాన్యం

అందులోనూ సదరు పురుగు బతికే ఉండడం మరింత ఆందోలన కలిగించింది. దీంతో ఆ పురుగుకు సంబంధించిన వీడియోను రికార్డ్‌ చేసిన వ్యక్తి, వీడియోను నెట్టింట పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటనకు సంబంధించి వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు...

Viral News: డైయిర్‌ మిల్క్‌ చాక్లెట్‌లో పురుగు.. స్పందించిన క్యాడ్‌బెరీ యాజమాన్యం
Worm In Dairy Milk
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 13, 2024 | 11:08 AM

పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఇష్టపడి తినే డైయిరీ మిల్క్‌ చాక్లెట్‌లో పురుగు కనిపించిన సంఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో చాక్లెట్ కొన్న ఓ వ్యక్తి ప్యాకెట్ ఓపెన్‌ చేసి చూడగా.. పురుగు దర్శనం ఇచ్చింది.

అందులోనూ సదరు పురుగు బతికే ఉండడం మరింత ఆందోలన కలిగించింది. దీంతో ఆ పురుగుకు సంబంధించిన వీడియోను రికార్డ్‌ చేసిన వ్యక్తి, వీడియోను నెట్టింట పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటనకు సంబంధించి వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ప్రోడక్ట్స్ క్వాలిటీ, ఎక్స్పైరీ విషయంలో తనిఖీ చేస్తున్నారా అని ప్రశ్నించాడు. దీంతో ఈ విషయమై స్పందించిన అధికారులు.. దీనిని ఫుడ్ సేఫ్టీ టీమ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులు సమాధానం ఇచ్చారు.

చాక్లెట్ లో పురుగు వీడియో..

అయితే తాజాగా సంఘటనపై క్యాడ్‌బరీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ స్పందించింది. ఈ వీడియోకు బదులిస్తూ ఓ వివరణ పోస్ట్ చేసింది. ఈ విషయమై క్యాడ్‌రబీ ట్వీట్ చేస్తూ.. ‘మోండెలెజ్‌ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (అంతకు ముందు క్యాడ్‌బరీ ఇండియా లిమిటెడ్) అత్యధిక నాణ్యతా ప్రమాణాలను నిర్వహించడానికి ప్రయత్నిస్తోంది. మీకు ఇలాంటి ఇబ్బందికర అనుభవం ఎదురుకావడం పట్ల మేము చింతిస్తున్నాము. మీ ఆందోళనను పరిష్కరించడానికి, దయచేసి మీ పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, కొనుగోలు వివరాలను Suggestions@mdlzindia.comకి పంపించండి. మీ ఫిర్యాదుపై చర్య తీసుకోవడానికి, మేము ఈ వివరాలను కోరుతున్నాయి. ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు. మరి క్యాడ్‌బరీ దీనిపై బాధితుడికి ఎలాంటి న్యాయం చేస్తుందో చూడాలి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..