AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అబ్బా.. ఈ డాల్ఫిన్‌ హెల్పింగ్‌ నేచర్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.

ఓ కుక్క అనుకోకుండా సముద్రంలో పడిపోయింది. సముద్ర మధ్యలో ఎటూ తోచని స్థితిలో కొట్టు మిట్టాడుతోందీ ఆ శునకం. కనుచూపు మేర ఒడ్డు లేదు, పోనీ ఈదుకుంటూ వెళ్దామా అంటే అలల తాకిడికి ఈదలేని పరిస్థితి. దీంతో ఎంతో కష్టపడుతూ ముందుకు సాగుతోంది. చివరికి ఓపిక నశించి మునిపోయే స్థితికి చేరుకుంది. అయితే...

Viral Video: అబ్బా.. ఈ డాల్ఫిన్‌ హెల్పింగ్‌ నేచర్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.
Viral Video
Narender Vaitla
|

Updated on: Feb 13, 2024 | 7:37 AM

Share

సాటి మనుషులు ఒకరి ఒకరు సాయం చేసుకోవడం సాధారణమైన విషయం. అయితే జీవితాలు గజిబిజీగా మారుతోన్న ఈ రోజుల్లో సాటి మనిషికి కూడా సహాయం చేసేంత సమయం ఎవరికీ ఉండడం లేదు. ఎవరి జీవితాల్లో వారు బిజీగా మారిపోతున్నారు. అలాంటిది జంతువులు ఒకటికి ఒకటి సహాయం చేసుకుంటే ఎలా ఉంటుంది.? మనుషులే పట్టించుకోని ఈ రోజుల్లో జంతువులు ఇలా ఎలా ఉంటాయని ఆలోచిస్తున్నారా.? తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది.

ఓ కుక్క అనుకోకుండా సముద్రంలో పడిపోయింది. సముద్ర మధ్యలో ఎటూ తోచని స్థితిలో కొట్టు మిట్టాడుతోందీ ఆ శునకం. కనుచూపు మేర ఒడ్డు లేదు, పోనీ ఈదుకుంటూ వెళ్దామా అంటే అలల తాకిడికి ఈదలేని పరిస్థితి. దీంతో ఎంతో కష్టపడుతూ ముందుకు సాగుతోంది. చివరికి ఓపిక నశించి మునిపోయే స్థితికి చేరుకుంది. అయితే అంతలోనే ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ డాల్ఫిన్‌ ప్రత్యక్షమైంది. సముద్రంలో మునిగిపోయే స్థితిలో ఉన్న ఆ శునకాన్ని రక్షించేందుకు రంగంలోకి దిగింది.

నీటిలో మునిగిపోతున్న శునకం దగ్గరికి వచ్చి దానిని తన వీపుపై ఎక్కించుకుంది. తనను కాపాడేందుకు వచ్చిందన్న విషయాన్ని అర్థం చేసుకున్న శునకం సైతం ఎంచక్కా డాల్ఫిన్‌పైకి ఎక్కి కూర్చుంది. దీంతో ఎంచక్కా శునకాన్ని ఒడ్డుకు చేర్చేందుకు డాల్ఫిల్‌ బయలు దేరింది. అంతలోనే అటుగా వస్తున్న ఓ పడవ దగ్గరికి తీసుకెళ్లి శునకాన్ని బోటులోకి ఎక్కించేసింది. దీంతో తనకు సహాయం చేసిన డాల్ఫిన్‌కు శునకం ధన్యవాదాలు తెలిపింది. జంతువులకు మాటలు రావుగా ఎలా చెప్పిందనేగా, వీడియో చూస్తే ఈ విషయం మీకే అర్థమవుతుంది. ఇక ఇదంతా అక్కడే ఉన్నవారు రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

వైరల్ వీడియో..

దీంతో ఈ వీడియో కాస్త తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నిజంగా మనుషులే ఒకరిని ఒకరు పట్టించుకోని ఈ రోజుల్లో ఒక మూగ జీవి, మరో మూగ జీవికి చేసిన సహాయం గ్రేట్ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ