ముస్లిం దేశంలో వెయ్యేళ్ల పాటు చెక్కు చెదరని ఆలయం ఇదే !!
అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభం అట్టహాసంగా జరిగి బాలరాముడు ప్రతిరోజూ వేలాదిమంది భక్తుల పూజలందుకుంటున్నాడు. ఇప్పుడు మరో వేడుకకు హిందూ సమాజం సిద్ధమవుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి నగరంలో బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయన్ పేరుతో నిర్మితమవుతున్న అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఆలయం ఫిబ్రవరి 14, 2024న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది.
అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభం అట్టహాసంగా జరిగి బాలరాముడు ప్రతిరోజూ వేలాదిమంది భక్తుల పూజలందుకుంటున్నాడు. ఇప్పుడు మరో వేడుకకు హిందూ సమాజం సిద్ధమవుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి నగరంలో బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయన్ పేరుతో నిర్మితమవుతున్న అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఆలయం ఫిబ్రవరి 14, 2024న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఈ ఆలయ నిర్మాణానికి 2015లో భూమిని కేటాయించారు. 2019లో UAE టాలరెన్స్ అండ్ కో-ఎగ్జిటెన్స్ మంత్రి షేక్ నహాయన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ ఆలయం వెయ్యేండ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా దీనిని పింక్ శాండ్ స్టోన్‌తో సంప్రదాయ, ఆధునిక వాస్తు కళల మిశ్రమంగా నిర్మించారు. యూఏఈలోని వేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి, ఇసుకరాయిని తీసుకెళ్లి నిర్మాణంలో ఉపయోగించారు. అత్యాధునిక టెక్నాలజీ, ఫీచర్లు, సెన్సార్లు ఏర్పాటు చేశారు. యూఏఈలోని ఏడు ఎమిరేట్స్‌కు ప్రతీకగా ఈ ఆలయంలో ఏడు గోపురాలను ఏర్పాటు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేసేది భిక్షాటన.. ఏడాదికి రూ.20 లక్షలకు పైగా సంపాదన
పాకిస్తాన్ రాజకీయ సంక్షోభం కొలిక్కొస్తుందా ??
మారథాన్ ప్రపంచ రికార్డు విజేత దుర్మరణం