Bhoochakra Gadda Benefits: వనవాసంలో రాముడి ఆకలి తీర్చిన భూచక్ర గడ్డ.. ఆరోగ్య ప్రయోజనాలు గంపెడు..!
ఎత్తైన కొండల్లో భూమి లోపల నుంచి సేకరించినది కాబట్టి ఎలాంటి రసాయనలు వాడరు. ఈ భూచక్ర గడ్డ ఆకు, పువ్వు, కాండం తీపి రుచిని కలిగి ఉంటాయి. ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. శ్రీ రాముడు సీతమ్మతల్లి, లక్ష్మణుడు వనవాసంలో ఉన్నప్పుడు దీనిని తిన్నట్లు చెబుతారు. ఇది భారతదేశంలో వివిధ పేర్లతో పిలుస్తారు. ఇందులో ఎన్నో ఆయుర్వేద ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ దుంప, దాని ప్రయోజనాలను తెలుసుకుందాం.
భూచక్ర గడ్డ.. అంటే తెలియని వారు చాలా మంది ఉంటారు. ఇది ఒక అరుదైన దుంప. కొండల మధ్య దొరికే ఈ దుంపకు విపరీతమైన డిమాండ్ ఉంది. పెద్ద పరిమాణంలో ఉండే ఈ దుంప భూమిలో 10-15 మీటర్ల లోతులో పెరుగుతుంది. ఈ దుంప బెరడు లేతవర్ణంలో ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయాలే ఉంటుంది. ఎత్తైన కొండల్లో భూమి లోపల నుంచి సేకరించినది కాబట్టి ఎలాంటి రసాయనలు వాడరు. ఈ భూచక్ర గడ్డ ఆకు, పువ్వు, కాండం తీపి రుచిని కలిగి ఉంటాయి. ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. దీన్ని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి రక్తం శుద్ధి అవుతుంది. రాముడు వనవాసంలో ఉన్నప్పుడు భూచక్ర గడ్డను తిన్నాడని చెబుతుంటారు. అయితే ఈ భూచక్ర తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
భూచక్ర గడ్డ మూలం భారతదేశం అయినప్పటికీ, ఈ మొక్క పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఆఫ్రికన్ దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కర్నాటకలోని పశ్చిమ కనుమలతో సహా కేరళ, మహారాష్ట్రలోని కొండలలోని స్క్రబ్ అడవులలో పెరుగుతుంది. అప్పుడప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నల్లమల అడవుల్లోనూ దొరుకుతుంది. మహా కుంభమేళాలో ఈ భూచక్ర దుంపను రామకండ, రామ ఫల పేర్లతో విక్రయిస్తారు. పూర్వం ఋషులు ముణులు కందమూల ఆహారాన్ని తినేవారు. అటువంటి దుంపలలో ఈ భూచక్ర గడ్డ కూడా ఒకటి. 80వ దశకం వరకు ఈ భూచక్ర దుంపలను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొచ్చి పండుగలు, జాతరల్లో ఉపయోగించేవారు. ఈ దుంపకు ఆయుర్వేదంలో ఎంతో ముఖ్యమైనది. ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.
భూచక్ర గడ్డ ఆకు, పువ్వు, కాండం ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగించబడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి రక్తం శుద్ధి అవుతుంది. ఈ దుంపలో కాల్షియం, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇది కాకుండా ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు సందర్భాలలో కూడా తినవచ్చు. బరువు తగ్గడంలో భూచక్ర గడ్డ సహాయపడుతుంది. ఈ దుంపలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల చాలా సేపు పొట్ట నిండుగా ఉంటుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫైబర్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. కొవ్వును సులభంగా జీర్ణం చేస్తుంది. త్వరగా బరువును తగ్గిస్తుంది.
భూచక్ర గడ్డ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది విటమిన్ సి అదనపు ప్రయోజనాలను కలిగి ఉంది. అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. ఈ గడ్డ తినడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తగ్గుతుంది. అలాగే హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది. డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల, ఈ గడ్డ ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. ఇది పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తుంది. తక్కువ కొలెస్ట్రాల్, సంతృప్త కొవ్వులతో గుండెకు మంచిది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఈ దుంపలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్ ప్రేరిత నష్టం నుండి చర్మాన్ని రక్షిస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మం ఆరోగ్యకరమైన, యవ్వన రూపాన్ని నిర్వహించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ దుంపలో విటమిన్ సి ఉంటుంది. ఇకపోతే, భూచక్ర చెట్టు కాండం, ఆకు, పువ్వు, పండ్లను ఆయుర్వేద, సిద్ధ, సాంప్రదాయ చికిత్సలలో ఉపయోగిస్తారు. భుచక్ర గడ్డ దినుసు చెట్టు పెరగడానికి 10-12 సంవత్సరాలు పడుతుంది. భూమిపై ఉన్న ఈ దుంపను తొలగించాలంటే చెట్టును నరకాల్సి ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..