Viral video: బైక్‌పై ‘త్రీ ఇడియట్స్‌’ సీన్‌ రీ క్రియేట్‌ చేసిన యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

అయితే, అతడు ఆసుపత్రి నిబంధనలను ఉల్లంఘించి బిల్డింగ్ లోపలికి బైక్ తీసుకెళ్లాడు. గేటు వద్ద నిల్చున్న సెక్యూరిటీ గార్డు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా ఆసుపత్రిలోని అత్యవసర వార్డు వైద్యులు నీరజ్ గుప్తాను మందలించారు. భవిష్యత్తులో అలా చేయకూడదని కూడా హెచ్చరించారు.. వీడియోలో చిత్రీకరించిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ మొత్తం ఘటనను ఎవరో తన కెమెరాలో రికార్డ్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Viral video: బైక్‌పై ‘త్రీ ఇడియట్స్‌' సీన్‌ రీ క్రియేట్‌ చేసిన యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
3 Idiots Iconic Scooter Sce
Follow us

|

Updated on: Feb 12, 2024 | 4:20 PM

మధ్యప్రదేశ్‌లోని సత్నాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జిల్లా ఆసుపత్రిలో శనివారం ‘త్రీ ఇడియట్స్’ సినిమాలోని సన్నివేశాన్ని పోలిన దృశ్యం కనిపించింది. ఓ వ్యక్తి బైక్‌పై పేషెంట్‌ని ఎక్కించుకుని హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ వార్డులోకి ప్రవేశించాడు. ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఆస్పత్రి సిబ్బందిని బేఖతారు చేస్తూ లోపలికి ప్రవేశించాడు. ఇప్పుడు ఈ యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ వైరల్‌ వీడియోలో ఏముందంటే..

బాలీవుడ్ చిత్రం ‘త్రీ ఇడియట్స్’లో ఓ సన్నివేశం ఉంది. అందులో ఆ సినిమా హీరో అమీర్ ఖాన్ పేషెంట్‌ని స్కూటర్‌పై ఎక్కించుకుని ఎమర్జెన్సీ వార్డుకు చేరుకుంటాడు. ఈ సినిమా దృశ్యం సాత్నా జిల్లా ఆసుపత్రిలో రిపీట్‌ చేశాడు ఒక యువకుడు. అర్థరాత్రి నీరజ్ గుప్తా అనే వ్యక్తి ఆరోగ్యం క్షీణించింది. దాంతో అతని మనవడు టూవీలర్‌పై అతన్ని జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చాడు. నీరజ్ గుప్తా బైక్‌ను పార్కింగ్‌లో పార్క్ చేయలేదు. లేదా రోగిని స్ట్రెచర్‌పై కూడా తీసుకెళ్లలేదు. ఆ యువకుడు పేషెంట్‌ని బైక్‌పై ఎక్కించుకుని నేరుగా ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లి బెడ్‌పై పడేశాడు. ఆ తర్వాత బైక్‌ని తిప్పి పార్కింగ్‌కు తీసుకెళ్లాడు.

ఇవి కూడా చదవండి

హాస్పిటల్‌లో బైక్‌పై వెళుతున్న అతడిని చూసి అక్కడున్న వారు షాక్‌కు గురయ్యారు. ఆ యువకుడు అనారోగ్యంతో ఉన్న తన తాతయ్యను ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లి వెంటనే మంచం మీద పడుకోబెట్టాడు. అనంతరం బైక్‌ను పార్కింగ్‌ వద్దకు తీసుకెళ్లాడు. కాగా, ఈ చిత్రాన్ని చూసిన ఆసుపత్రిలో గందరగోళ వాతావరణం నెలకొంది.

నీరజ్ గుప్తా కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్ అని తెలిసంది. అయితే, అతడు ఆసుపత్రి నిబంధనలను ఉల్లంఘించి బిల్డింగ్ లోపలికి బైక్ తీసుకెళ్లాడు. గేటు వద్ద నిల్చున్న సెక్యూరిటీ గార్డు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా ఆసుపత్రిలోని అత్యవసర వార్డు వైద్యులు నీరజ్ గుప్తాను మందలించారు. భవిష్యత్తులో అలా చేయకూడదని కూడా హెచ్చరించారు.. వీడియోలో చిత్రీకరించిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ మొత్తం ఘటనను ఎవరో తన కెమెరాలో రికార్డ్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..