Eiffel Tower: వావ్ వండర్.. 7 మిలియన్ల అగ్గిపుల్లలతో ఈఫిల్ టవర్.. చిన్న తప్పుతో ఏనిమిదేళ్ల కష్టం వృధా..!
అగ్గిపుల్లలతో ఆకట్టుకునే ఈఫిల్ టవర్‌ను తయారు చేశాడు రిచర్డ్. కానీ, అతనికి చివరకు నిరాశే ఎదురైంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం దరఖాస్తు చేయగా.. అది తిరస్కరణకు గురైంది. దీనిపై ప్లాడ్ తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు. 8 ఏళ్లుగా తాను పడిన శ్రమంతా బూడిదలో పోసినట్టే అయ్యిందని ఆవేదన చెందుతున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈఫిల్ టవర్‌ను సందర్శించేందుకు వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ఈఫిల్ టవర్ 1887, 1889 మధ్య నిర్మించబడింది. ఈఫిల్ టవర్ పారిస్‌లోని ఎత్తైన టవర్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ టవర్ ఎత్తు 324 మీటర్లు. ప్రస్తుతం ఈఫిల్ టవర్‌కి సంబంధించిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్రెంచ్ నివాసి ఒకరు ఎనిమిది సంవత్సరాలు కష్టపడి అగ్గిపుల్లలతో ఈఫిల్ టవర్‌ను నిర్మించాడు. కానీ, అతను చేసిన ఒక్క తప్పు కారణంగా, అతను గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించలేకపోయాడు. అసలేం జరిగిందో వివరాల్లోకి వెళితే..
ఏడు మిలియన్ల అగ్గిపుల్లలతో ఈఫిల్ టవర్‌ను తయారు చేసిన ఫ్రెంచ్ వ్యక్తి పేరు రిచర్డ్ ప్లాడ్. అతడు తయారు చేసిన టవర్ ఎత్తు 23.6 అడుగులు. ఈఫిల్ టవర్ నిర్మాణానికి ఏడు లక్షలకు పైగా అగ్గిపుల్లలు, 23 కిలోల గమ్‌ని ఉపయోగించాడు. గతేడాది డిసెంబర్ 27న ఆయన ఈఫిల్ టవర్ పూర్తిగా నిర్మించాడు. ఏడు లక్షల అగ్గిపుల్లలతో తయారు చేసిన ఈఫిల్ టవర్ చూసేందుకు ఎంతో అద్భతంగా ఉంది.
Guinness World Records told Frenchman Richard Plaud that his 7.2-meter matchstick Eiffel Tower was a record height — a day after initially rejecting it for using the wrong matches, to Plaud's dismay https://t.co/kbkOR5B7M2 pic.twitter.com/YzVYbXBwhf
— Reuters (@Reuters) February 9, 2024
అగ్గిపుల్ల పైభాగంలో ఫాస్పరస్, సల్ఫర్, మెగ్నీషియం, క్లోరోఫిల్ మిశ్రమం ఉంటుంది. కానీ, 23.6 అడుగుల ఎత్తులో ఉండే ఈఫిల్ టవర్‌ను తయారుచేయడానికి ముందుజాగ్రత్తగా ఎలాంటి మండే మిశ్రమం లేకుండా ఈ టవర్‌కు కర్రలు ఉపయోగించాడు. అందుకోసం ప్రతి మ్యాచ్ స్టిక్ తల నుండి సల్ఫర్‌ను తొలగించటం అతనికి కష్టంగా మారింది. దాంతో అతడు ఒక తయారీదారుని సంప్రదించి, సల్ఫర్ లేకుండా అగ్గిపుల్లలను తయారు చేయమని కోరాడు. అతను అలాంటి అగ్గిపుల్లలను తయారు చేసాడు. ఇక ఈ అగ్గిపుల్లలతో ఆకట్టుకునే ఈఫిల్ టవర్‌ను తయారు చేశాడు రిచర్డ్. కానీ, అతనికి చివరకు నిరాశే ఎదురైంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం దరఖాస్తు చేయగా.. అది తిరస్కరణకు గురైంది. దీనిపై ప్లాడ్ తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు. 8 ఏళ్లుగా తాను పడిన శ్రమంతా బూడిదలో పోసినట్టే అయ్యిందని ఆవేదన చెందుతున్నాడు.
అయితే గిన్నిస్ రికార్డులకి ఎక్కడానికి ఎన్నో నిబంధనలు పాటించాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. అందులో భాగంగా ఈఫిల్ టవర్ నిర్మాణానికి మార్కెట్‌లో లభించే అగ్గిపుల్లలను మాత్రమే ఉపయోగించాలని చెప్పారు.. కాబట్టి రిచర్డ్ పేరిట ఈ రికార్డు నమోదు కాలేదు. రిచర్డ్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా దీనికి సంబంధించిన పోస్ట్‌ను కూడా షేర్ చేశాడు. కానీ, తన కల నెరవేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తూ క్యాప్షన్‌లో పేర్కొన్నాడు రిచర్డ్. ఈ పోస్ట్ @Richard Plaud Facebook ఖాతా నుండి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..