చలికాలంలో రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి..? తెలియకపోతే ప్రమాదంలో పడినట్టే..!

నీళ్లు తక్కువగా తాగేవాళ్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా ఆ వ్యక్తి తరచుగా వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. చలికాలంలో, చల్లటి నీటితో పోలిస్తే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి మీరు ఎల్లప్పుడూ తగినంత మొత్తంలో నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

చలికాలంలో రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి..? తెలియకపోతే ప్రమాదంలో పడినట్టే..!
Drinking Water
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 12, 2024 | 1:20 PM

ప్రతి సీజన్‌లో మనం సరైన పరిమాణంలో నీటిని తాగాలి. ఎందుకంటే శరీర నిర్వహణకు నీరు మనకు చాలా అవసరం. నీరు మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. దీని వల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. అయితే, చలికాలంలో మనం ఎన్ని లీటర్ల నీరు తాగాలి..? అనే సందేహం కూడా ఉంటుంది. చలికాలంలో చలి కారణంగా తక్కువ నీరు తాగుతారు. కానీ శరీరంలో నీటి కొరత లేకుండా మనం రోజుకు 4-5 లీటర్లు అంటే 8-10 గ్లాసుల నీరు తాగాలి. తక్కువ నీరు తాగడం వల్ల మన శరీరానికి ఎలాంటి హాని జరుగుతుందో తెలుసుకుందాం.

శీతాకాలంలో చలి తీవ్రత కారణంగా చాలా మంది నీళ్లు తాగలంటే భయపడుతుంటారు.. దాంతో శరీరానికి కావాల్సిన అవసరం మేరకు నీటిని తీసుకోరు. శరీరంలో తగిన స్థాయిలో నీరు లేకపోతే చర్మం పొడిబారుతుంది. అలాగే, నీళ్లు తక్కువగా తాగడం వల్ల పెదాలు పొడిబారడం జరుగుతుంది. దీంతో పెదవులపై పగుళ్లు ఏర్పడుతుంటాయి. కొన్ని కొన్ని సార్లు పగిలిన పెదవుల నుంచి రక్తం కూడా వస్తుంది. తక్కువ నీరు తాగడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి బరువు అదుపులో ఉండేలా ఎప్పుడూ కావాల్సినంత నీటిని తాగాలి. అంతేకాదు.. నీళ్లు తక్కువగా తాగడం వల్ల ముఖంలో మెరుపు తగ్గడంతో పాటు ముఖంపై మచ్చలు, ముడతలు ఏర్పడతాయి. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే తగిన మోతాదులో నీరు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

తగినంత నీరు తాగకపోవడం వల్ల శరీరానికి కావాల్సినంతగా శక్తి అందదు. దీంతో మీకు చాలా బలహీనంగా అనిపిస్తుంది. తగినంత నీరు తాగకపోవటం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నీళ్లు తక్కువగా తాగేవాళ్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా ఆ వ్యక్తి తరచుగా వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. చలికాలంలో, చల్లటి నీటితో పోలిస్తే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి మీరు ఎల్లప్పుడూ తగినంత మొత్తంలో నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..