మొక్కే కదా అని చీప్‌గా చూడకు.. అనారోగ్య సమస్యలకు బ్రహ్మాస్త్రం.. క్యాన్సర్ సహా 150 వ్యాధులకు దివ్యౌషధం.. !

ఈ ఔషధ మొక్క మిమ్మల్ని కిడ్నీ స్టోన్స్‌ నుండి రక్షించడమే కాకుండా అనేక రుగ్మతలతో పోరాడే గుణాలను కలిగి ఉంది. ఇది నొప్పి, వాపును తగ్గించే శక్తిని కలిగి ఉంది. ఈ ఆకులను మొత్తగా నూరి తలకు పట్టి వేసినట్టుగా పెట్టుకోవడం వల్ల తల నొప్పి తగ్గుతుంది. ఈ ఆకుల పసరు తీసుకుని రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవినొప్పి తగ్గుతుంది. రోజు ఈ ఆకుల్ని తినడం ద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది.

మొక్కే కదా అని చీప్‌గా చూడకు.. అనారోగ్య సమస్యలకు బ్రహ్మాస్త్రం.. క్యాన్సర్ సహా 150 వ్యాధులకు దివ్యౌషధం.. !
Ranapala Plant
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 12, 2024 | 12:53 PM

మన చుట్టూ ఉన్న ప్రకృతిలో లభించే ఎన్నో రకాల మొక్కలు, పూలు, కాయలు, బెరడు వంటివి అనారోగ్య సమస్యలకు సంజీవనిలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో అసంఖ్యాకమైన ఔషధ గుణాలు కలిగిన అనేక చెట్లు, మొక్కలు ఉన్నాయి. వాటి లక్షణాలను బట్టి ఆయా రోగాలకు అనేక మందులు, చికిత్సలో ఉపయోగిస్తారు. అలాంటి ఒక అద్భుత మొక్క రణపాల.. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొక్క పేరు ఎలా ఉంటుందో.. దాని పనితీరు కూడా అలాగే ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లను కరిగించేందుకు ఈ మొక్క సూపర్‌ బూస్టర్‌గా పనిచేస్తుంది.

రణపాల మొక్క ఎన్నో వ్యాధులను నయం చేసే గుణం కలిగివుంది. ఈ మొక్క ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్, యాంటీ హిస్టామైన్, అనాఫీలాక్టిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది యాంటీ బయోటిక్ లా పని చేస్తుంది. వ‌గ‌రు, పులుపుగా అనిపించే ఈ మొక్క ఆకులు చూడటానికి మందంగా ఉంటాయి. అనేక అనారోగ్య సమస్యలను పరిష్కరించటంలో బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మీరు కిడ్నీలో రాళ్ల సమస్యతో పోరాడుతున్నట్లయితే, మీరు రణపాల ఆకులను ఉపయోగించవచ్చు.

రణపాల మొక్కలో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్లు, గ్లైకోసైడ్‌లు, ట్రైటెర్‌పెనెస్, కార్డినోలైడ్‌లు, బుఫాడినోలైడ్‌లు, లిపిడ్‌లు, స్టెరాయిడ్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. క్యాన్సర్, బ్లడ్ షుగర్, ఫంగస్, వాపు, పొట్టలో పుండు, కాలేయ సమస్య, మూత్రపిండాల్లో రాళ్లు మొదలైన సమస్యలతో పోరాడే శక్తి దీనికి ఉంది. కిడ్నీలో రాళ్లను తొలగించడానికి కూడా రణపాల ఉపయోగపడుతుంది. కిడ్నీ స్టోన్స్ కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలతో తయారవుతాయి. స్టోన్‌క్రాప్ మొక్కలో సపోనిన్‌లు ఉంటాయి. ఇవి కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలను విచ్ఛిన్నం చేయగలవు. ఈ మొక్క ఆకులను తీసుకోవడం వల్ల మీ జీవితంలో రాళ్ల సమస్య ఉండదంటున్నారు. రణపాల మొక్క ఆకులను వేడిచేసి గాయాల పైన పెట్టడం వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి..

ఇవి కూడా చదవండి

ఈ ఔషధ మొక్క మిమ్మల్ని కిడ్నీ స్టోన్స్‌ నుండి రక్షించడమే కాకుండా అనేక రుగ్మతలతో పోరాడే గుణాలను కలిగి ఉంది. ఇది నొప్పి, వాపును తగ్గించే శక్తిని కలిగి ఉంది. ఈ ఆకులను మొత్తగా నూరి తలకు పట్టి వేసినట్టుగా పెట్టుకోవడం వల్ల తల నొప్పి తగ్గుతుంది. ఈ ఆకుల పసరు తీసుకుని రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవినొప్పి తగ్గుతుంది. రోజు ఈ ఆకుల్ని తినడం ద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది. మధుమేహ బాధితుల్లో రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. కడుపు పూతల నుండి ఉపశమనం అందిస్తుంది. అలాగే, క్యాన్సర్ నుండి కూడా రక్షిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..