AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morning Walk Mistakes: వాకింగ్ చేసేటప్పుడు జాగ్రత్త..! ఇలాంటి తప్పుల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ..?

మార్నింగ్ వాక్ అనేది శారీరక దృఢత్వానికి మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం. మార్నింగ్ వాక్ చేయడం వల్ల శరీరం రోజంతా చురుగ్గా, శక్తివంతంగా ఉంటుంది. అయితే, మార్నింగ్‌ వాక్‌లో మనం చేసే కొన్ని పొరపాట్లు మన ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. అలాంటి తప్పులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...

Morning Walk Mistakes: వాకింగ్ చేసేటప్పుడు జాగ్రత్త..! ఇలాంటి తప్పుల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ..?
Morning Walk
Jyothi Gadda
|

Updated on: Feb 12, 2024 | 12:55 PM

Share

మార్నింగ్ వాక్: మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాకింగ్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మార్నింగ్ వాక్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మార్నింగ్ వాకింగ్ వల్ల వృద్ధాప్య వ్యాధులను సులభంగా నయం చేసుకోవచ్చు. వాక్ చేయడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడం నుండి రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం వరకు మార్నింగ్‌ వాక్‌ మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, మార్నింగ్‌ వాక్‌లో మనం చేసే కొన్ని పొరపాట్లు మన ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. అలాంటి తప్పులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

మార్నింగ్ వాక్: మార్నింగ్ వాక్ చేస్తూ.. మనం చేతులు ముడుచుకుని నడవకూడదు. చాలా మంది ఈ తప్పులు చేస్తుంటారు. నడుస్తున్నప్పుడు మన చేతులను చాలా తేలికగా కదిలించాలి.

శరీర భంగిమ: వాకింగ్‌లో మనం ఎప్పుడూ నెమ్మదిగా నడవకూడదు. అంతేకాదు.. ఎలాంటి జిగ్‌జాగ్ పద్ధతిలో కూడా కదలకూడదని గుర్తుంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మన శరీర భంగిమ పాడైపోతుంది. అందుకే వాకింగ్ చేస్తున్నప్పుడు, మన నడక వేగాన్ని పెంచుతూ కదలాలి. అంతే కాదు, నిటారైన శరీర భంగిమ ఈ సందర్భంలో సహాయపడుతుందని కూడా గుర్తుంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

హైడ్రేషన్: సాధారణంగా మనలో చాలామంది తగినంత నీరు తాగరు. అయితే, నడిచేటప్పుడు ప్రతి 15 నిమిషాలకు దాహం వేస్తుంది. కాబట్టి మనం తగినంత మొత్తంలో నీరు తాగాలి. మీ శరీరం ఎంత హైడ్రేట్ గా ఉంటే మీ ఆరోగ్యం అంత మెరుగ్గా ఉంటుంది.

షూస్ ఎంపిక: ముందే చెప్పినట్లుగా, మార్నింగ్ వాక్ వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోజువారీ వాకింగ్‌ మీ శరీరాన్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది. అయితే, మీరు నడుస్తున్నప్పుడు సరైన షూస్‌ ధరించకపోతే అది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.

గాలి నాణ్యత: ఆస్తమా రోగులు చల్లని వాతావరణంలో లేదా కలుషితమైన గాలి వాతావరణంలో మార్నింగ్ వాక్ చేయకూడదు. ఇది మీ ఆరోగ్యానికి మంచి కంటే ఎక్కువ హాని కలిగిస్తుంది.

మార్నింగ్ వాక్ అనేది శారీరక దృఢత్వానికి మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం. మార్నింగ్ వాక్ చేయడం వల్ల శరీరం రోజంతా చురుగ్గా, శక్తివంతంగా ఉంటుంది.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!