రామయ్య భక్తులకు తీపి కబురు.. అయోధ్య వెళ్లాలనుకునేవారికి గొప్ప అవకాశం.. అందుబాటులోకి మరో స్పెషల్‌ ట్రైన్‌.. ఎక్కడి నుంచంటే..

వాస్తవానికి గుంటూరు ట్రైన్ గోదావరి జిల్లాలోకి ప్రవేశించగానే గోదావరి స్టేషన్లు రామనామంతో మార్మోగుతూ ఉండేవి. ఎక్కువ మంది గోదావరి జిల్లాల నుంచి వెళ్తుండడం తో అక్కడనుంచే ఒక ట్రైన్ ను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ను ఇండియన్ రైల్వే చేసింది. దీంతో మరో రైలు కూడా రేపటినుంచి ప్రారంభం కానుంది. గతంలో ఆంధ్ర ప్రదేశ్ నుంచి నేరుగా అయోధ్యకు ట్రైన్స్ ఉండేవి కావు. మధ్యలో స్టేషన్లు మారాల్సి వచ్చేది. ఇకపై అలాంటి అవసరం లేకుండా పోవటంతో తెలుగు భక్తులు తెగ సంబరపడుతున్నారు.

రామయ్య భక్తులకు తీపి కబురు.. అయోధ్య వెళ్లాలనుకునేవారికి గొప్ప అవకాశం.. అందుబాటులోకి మరో స్పెషల్‌ ట్రైన్‌.. ఎక్కడి నుంచంటే..
Special Trains To Ayodhya
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Feb 10, 2024 | 12:01 PM

విశాఖపట్నం, ఫిబ్రవరి 10; అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ట ముహూర్తం చాలా బలమైనదన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆ ముహూర్త బలం నేపథ్యమో ఏమో కానీ బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న అందరి చూపు రామ జన్మ భూమిపైనే ఉంది. వీలైతే ఒక్కసారి అయోధ్యకు వెళ్లి బాలరాముడిని దర్శించుకోవాలని దేశవ్యాప్తంగా కోరుకుంటున్న వారిలో ఆంధ్రా వాసులు కూడా ఎక్కువగానే ఉన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆలయ విశేషాలను ప్రత్యక్షంగా చూడాలని తహతహలాడుతూ ఉన్నారు. అందుకే ప్రయాణ మార్గాలను అన్వేషించే వారి సంఖ్య ఎక్కువైంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న విమానం, రైలు మార్గాల ను అన్వేషిస్తున్న ఆంధ్రా వాసులకు ఇదో గుడ్ న్యూస్. ఆంధ్రా వాసులను ఆ రామయ్య చెంతకు చేర్చేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక సర్వీసులు ప్రారంభించింది. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు రైలు సర్వీసులు నడుపుతోన్న ఇండియన్ రైల్వే ఇప్పుడు ఏపీ నుంచి కూడా రెండు ప్రత్యేక సర్వీసులను ప్రారంభించింది.

గుంటూరు నుంచి వయా వైజాగ్…. ఒక ట్రైన్

తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్ళాలనుకునే వారికి మొన్నటివరకు సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు ఓ రైలు సర్వీస్ మాత్రమే నడిచేది. తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. గుంటూరు నుంచి అయోధ్యకు ఇటీవలే ఒక ప్రత్యేక రైలు ను ప్రారంభించింది సౌత్ సెంట్రల్ రైల్వే. ఏపీ నుంచి అయోధ్యకు వెళ్తున్న తొలి రైలు సర్వీసు కూడా ఇదే. గుంటూరు నుంచి బయల్దేరే ఈ స్పెషల్ ట్రైన్.. విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, వైజాగ్ మీదుగా అయోధ్యకు చేరుకుంటుంది.

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి 11 నుంచి సామర్ల కోట నుంచి వయా వైజాగ్ … రెండో ట్రైన్

ప్రస్తుతం గుంటూరు నుంచి నడిచే రైలుకు అదనంగా మరో స్పెషల్ ట్రైన్‌ను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 11వ తేదీన ఈ రైలు తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. సామర్లకోటలో ప్రారంభమయ్యే ఈ రైలు.. పిఠాపురం, తుని, అనకాపల్లి, విశాఖపట్నం మీదుగా అయోధ్యకు చేరుకోనుంది. ఇది అయోధ్యకు రెండో ట్రైన్ కావడం తో ఇక అయోధ్య కు వెళ్ళాలని అనుకునే వారికి మరో ప్రత్యామ్నాయం కూడా దొరికినట్టైంది.

వాస్తవానికి గుంటూరు ట్రైన్ గోదావరి జిల్లాలోకి ప్రవేశించగానే గోదావరి స్టేషన్లు రామనామంతో మార్మోగుతూ ఉండేవి. ఎక్కువ మంది గోదావరి జిల్లాల నుంచి వెళ్తుండడం తో అక్కడనుంచే ఒక ట్రైన్ ను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ను ఇండియన్ రైల్వే చేసింది. దీంతో మరో రైలు కూడా రేపటినుంచి ప్రారంభం కానుంది. మొత్తానికి ఏపీ నుంచి రెండు రైలు సర్వీసులు అయోధ్యకు నడుపుతూ ఉండటంతో రామభక్తులు, ముఖ్యంగా గోదావరి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆంధ్ర ప్రదేశ్ నుంచి నేరుగా అయోధ్యకు ట్రైన్స్ ఉండేవి కావు. మధ్యలో స్టేషన్లు మారాల్సి వచ్చేది. ఇకపై అలాంటి అవసరం లేకుండా పోవటంతో తెలుగు భక్తులు తెగ సంబరపడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..