Andhra Pradesh: గురుకుల పాఠశాల స్టూడెంట్స్ బ్యాండ్.. విశిష్ట గుర్తింపు.. ఎన్నో అవార్డులు, రివార్డులు వీరి సొంతం..

ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గురుకుల పాఠశాల విద్యార్థులు బ్యాండ్ టీం చూపిన ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది. దీంతో వీరికి జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రతిభతో గుర్తింపు లభించింది. విద్యార్థులను జడ్పీ చైర్ పర్సన్ గంట పద్మశ్రీ అభినందించారు. అలాగే వారి బ్యాండ్ టీంకు యూనిఫామ్ అందజేశారు.

Andhra Pradesh: గురుకుల పాఠశాల స్టూడెంట్స్ బ్యాండ్.. విశిష్ట గుర్తింపు.. ఎన్నో అవార్డులు, రివార్డులు వీరి సొంతం..
Gurukula Students Band
Follow us
B Ravi Kumar

| Edited By: Surya Kala

Updated on: Feb 10, 2024 | 11:24 AM

ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. దాంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇప్పటికే విశిష్ట పతకాలను సాధించడంతో పాటు అంతర్జాతీయంగా భారతదేశానికి గుర్తింపు తెస్తున్నారు.  ప్రైవేటు పాఠశాలలను తలదన్నేలా వాటికి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలపై, వాటిని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్లో పేద మధ్యతరగతి విద్యార్థులు సాధిస్తున్న ఘనతను దేశవ్యాప్తంగా పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లా గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో మరో విశిష్ట గుర్తింపు పొందారు. గత నెల 26న ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి కి చెందిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు ఓ విభాగంలో అత్యంత ప్రతిభ చూపి జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించారు.

ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గురుకుల పాఠశాల విద్యార్థులు బ్యాండ్ టీం చూపిన ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది. దీంతో వీరికి జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రతిభతో గుర్తింపు లభించింది. విద్యార్థులను జడ్పీ చైర్ పర్సన్ గంట పద్మశ్రీ అభినందించారు. అలాగే వారి బ్యాండ్ టీంకు యూనిఫామ్ అందజేశారు.

గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయిలో అనేక బహుమతులు పొందారు. ఎంతో వైవిధ్యంగా ఉండే కళ. ముఖ్యంగా ఈ బ్యాండ్ టీం లో 25 మంది ఉంటారు. అందులో 12 మంది బైపాస్ వాయిస్తుంటే మరో 12 మంది డ్రమ్స్ వాయిస్తారు. బ్యాండ్ ను లీడర్ ఆపరేట్ చేస్తాడు. గురుకుల పాఠశాల విద్యార్థులు 2018లో రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచారు. 2019లో స్టేట్ ఫస్ట్, జోనల్ లెవెల్ లో ఫస్ట్ ప్లేస్, నేషనల్ లెవెల్ లో థర్డ్ ప్లేస్ సాధించారు. అలాగే 2021లో స్టేట్ ఫస్ట్ ప్లేస్ సాధించారు. అదే విధంగా 2023-24 లో స్టేట్ ఫస్ట్ ప్లేస్, నేషనల్ లెవెల్లో సెకండ్ ప్లేస్ సాధించారు.

ఇవి కూడా చదవండి

అంతేకాదు రాష్ట్రంలో జరిగిన స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా రెండుసార్లు ట్రోఫీని, అదేవిధంగా గవర్నర్ చేతుల మీదగా రెండుసార్లు ట్రోఫీని అందుకున్నారు. ఈ టీంకు రిటైర్డ్ పోలీస్ అధికారి సిహెచ్ సుబ్రమణ్యం ట్రైనింగ్ ఇచ్చారు. స్టూడెంట్స్  సాధిస్తున్న ఘనతకు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహమే కారణమని విద్యార్థులతో పాటు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..