Hyderabad: అడిగిన చోట బస్సు ఆపలేదని రెచ్చిపోయిన మహిళ.. కండక్టర్‌ని చెప్పుతో కొట్టిన ప్రయాణీకురాలు..
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలోనే డ్రైవర్లు, కండక్టర్లు కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్న సంఘటనలు తరచూ మనం వింటూనే ఉన్నాం. ఈ కోవలోకే వస్తుంది తాజాగా హైదరాబాద్ సిటీ బస్సులో జరిగిన ఘటన. మెహదీపట్నం నుండి ఉప్పల్ వెళ్లే 300 నెంబర్ బస్సు లో ఓ మహిళ ప్రయాణీకులు హల్ చల్ చేసింది.
జిల్లాలు, పట్టణాలు, పల్లెలను అనుసంధానము చేస్తూ ప్రజలను తమ గమ్య స్థానానికి చేరుస్తూ వస్తుంది ఆర్టీసీ సంస్థ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణ సదుపాయాన్ని అందిస్తోంది. దీంతో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలోనే డ్రైవర్లు, కండక్టర్లు కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్న సంఘటనలు తరచూ మనం వింటూనే ఉన్నాం. ఈ కోవలోకే వస్తుంది తాజాగా హైదరాబాద్ సిటీ బస్సులో జరిగిన ఘటన. మెహదీపట్నం నుండి ఉప్పల్ వెళ్లే 300 నెంబర్ బస్సు లో ఓ మహిళ ప్రయాణీకులు హల్ చల్ చేసింది. తాను అడిగిన చోట బస్సు ఆపలేదని కండక్టర్ పై దాడి చేసింది. వివరాల్లోకి వెళ్తే..
గత నెల(జనవరి) 25వ తేదీన ఆర్టీసీ కండక్టర్ ని బూతులు తిట్టిన మహిళ ఘటన మరవక ముందే.. తాజాగా రాజేంద్రనగర్ లో సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రసన్న అనే మహిళా ప్రయాణికురాలు రెచ్చిపోయింది. అంతేకాదు బస్సు కండక్టర్ నరసింహ పై దాడి చేసింది. చెప్పు తీసుకొని కండక్టర్ చెంపలు వాయించింది ప్రసన్న. తాను అడిగిన చోట బస్సుని నిలపలేదనే కోపంతో కండక్టర్ ని దుర్భాషలాడుతూ.. ప్రసన్న విచక్షణారహితంగా దాడి చేసి చెప్పు తో కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో బస్సు కండక్టర్ నరసింహ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ప్రయాణీకురాలు ప్రసన్నపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ మహిళా ప్రయాణీకురాలు ప్రసన్న శివరాంపల్లికి చెందిన ఆమెగా గుర్తించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..