AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్న శ్రీశైలం.. భక్తుల సౌకర్యాల కల్పనపై అధికారుల ప్రత్యేక దృష్టి

బ్రహ్మోత్సవాల సమయంలో భారీ వాహనాలను అటవీ మార్గంలో అనుమతించకుండా డ్రైవర్డ్ చేసేవిధంగా ప్రకాశం, నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రచారం చేయాలని ట్రాఫిక్ డిఎస్పీలను ఆదేశించారు. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు దాదాపు రోజుకు లక్ష పదివేల మంది చొప్పున పది లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనవేశారు. ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పాటు అతనంగా మరో 75 కెమెరాల ఏర్పాటుతో పాటు, డ్రోన్ కెమెరాలతో ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. 

Srisailam: మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్న శ్రీశైలం.. భక్తుల సౌకర్యాల కల్పనపై అధికారుల ప్రత్యేక దృష్టి
Srisailam Maha Shivaratri
J Y Nagi Reddy
| Edited By: Surya Kala|

Updated on: Feb 10, 2024 | 9:28 AM

Share

నంద్యాల జిల్లా శ్రీశైలంలో మార్చి 1 నుంచి 11 వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్ల పై నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు మొదటి సమన్వయ సమేవేశాన్ని నిర్వహించారు. దేవస్థానం సీసీ కంట్రోల్ రూమ్ లో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆలయ చైర్మన్, ఈవో పెద్దిరాజు  4 జిల్లాల జిల్లా అధికారులు, పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాలలో ట్రాఫిక్, పార్కింగ్, పారిశుదద్యం, త్రాగునీరు, వైద్యం సదుపాయాలను కల్పించాలని.. అప్పగించిన విధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిర్వర్తించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పాతాళగంగలో తాత్కాలిక టాయిలెట్లు, డ్రస్సింగ్ గదుల ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

మహాశివరాత్రి ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఏపీ నుంచి 500 బస్సులు, తెలంగాణా నుంచి 450 బస్సులను, కర్ణాటక నుంచి 170 ఏర్పాటు చేస్తామన్నారు .ఆత్మకూరు నుంచి శ్రీశైలం వరకు రోడ్డుకు ప్యాచింగ్, మరమ్మత్తు పనులు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో భారీ వాహనాలను అటవీ మార్గంలో అనుమతించకుండా డ్రైవర్డ్ చేసేవిధంగా ప్రకాశం, నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రచారం చేయాలని ట్రాఫిక్ డిఎస్పీలను ఆదేశించారు. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు దాదాపు రోజుకు లక్ష పదివేల మంది చొప్పున పది లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనవేశారు. ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పాటు అతనంగా మరో 75 కెమెరాల ఏర్పాటుతో పాటు, డ్రోన్ కెమెరాలతో ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

ఆలయ ఈవో మాట్లాడుతూ భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనం సులభంగా దర్శించుకునేందుకు నాలుగు రకాల ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశామన్నారు. మార్చి 1వ తేదీన శ్రీకాళహస్తి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు.  3న శ్రీదుర్గామల్లేశ్వరి దేవస్థానం 4న కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం, టిడిపి దేవస్థానం, 5 న రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. 8 న మహాశివరాత్రి పర్వదినం రోజున సాయంత్రం ప్రభోత్సవం నిర్వహించి, రాత్రి 10 గంటలకు పాగాలంకరణ, లిగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ మహారుద్రాభిషేకం అర్ధరాత్రి 12 గంటలకు శ్రీస్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 9వ తేదీ సాయంత్రం రధోత్సవం, తెప్పోత్సవం నిర్వహించనున్నామని ఈవో పెద్దిరాజు వివరించారు.

ఇవి కూడా చదవండి

అనంతరం జిల్లా ఎస్సీ రఘువీర్రెరెడ్డి మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతిభద్రతల రక్షణకు పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  క్షేత్ర పరిధిలోని పార్కింగ్ ప్రదేశాలలో దాదాపు 5వేల వాహనాలను నిలువుదల చేసేందుకు అవకాశం ఉందన్నారు. కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తామని, పోలీస్ యంత్రాంగానికి అన్నిశాఖల అధికారులు సహకరించాలని కోరారు. పాగాలంకరణ ముగిసిన వెంటనే రావాణా సౌకర్యం కల్పిస్తామని ఎస్పీ తెలిపారు సమావేశాంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలసి క్షేత్ర ఔటర్ రింగ్ రోడ్డు, టోల్ గేట్, శౌచాలయలు, సాక్షిగణపతి ఆలయం పరిసరాలను పరిశీలించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..