Tirupati: శ్రీవారి సొమ్ము డిపాజిట్లపై మరో వివాదం.. తిరుపతి టౌన్ బ్యాంక్‌లో టీటీడీ రూ.10 కోట్ల డిపాజిట్ పై దుమారం

టీటీడీ ట్రస్టు అనుమతితో అధిక వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్న టీటీడీ ఇప్పటివరకు ఎస్బీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, విజయ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టు స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో రూ.10 కోట్లను తిరుపతి టౌన్ బ్యాంకులో 8.5 శాతం వడ్డీ రేటుతో డిపాజిట్ చేయడంతో టీటీడీ బ్యాంకుల్లో శ్రీవారి నిధులు డిపాజిట్ చేయడం చర్చకు దారితీసింది.

Tirupati: శ్రీవారి సొమ్ము డిపాజిట్లపై మరో వివాదం.. తిరుపతి టౌన్ బ్యాంక్‌లో టీటీడీ రూ.10 కోట్ల డిపాజిట్ పై దుమారం
Tirumala Tirupati
Follow us

| Edited By: Surya Kala

Updated on: Feb 10, 2024 | 7:56 AM

తిరుమల తిరుపతి క్షేత్రం నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య సగటున రోజుకు 65 వేల నుంచి 70వేల మందికి పైగానే ఉంటుంది. రోజువారీ హుండీ ఆదాయం సగటున మూడున్నర కోట్ల నుండి రూ. 4 కోట్లు వరకు ఉంటుంది. స్వామివారిని ఏడాదికి దర్శించుకునే భక్తుల సంఖ్య దాదాపు 2.56 కోట్ల మందికి పైగా ఉంటుండగా టీటీడీ ఈమధ్య విడుదల చేసిన శ్వేత పత్రంలో రూ.15938 కోట్ల నగదు డిపాజిట్లు. 10258 కిలో బంగారు డిపాజిట్లు తిరుమల వెంకన్న ఆస్తుల లెక్క చెప్పింది. ప్రతినెల శ్రీవారి హుండీ ఆదాయం కూడా రూ.100 కోట్లకు పైగానే ఉంటుండగా శ్రీవారి సొమ్ము డిపాజిట్ ల వ్యవహారం ఇప్పుడు చర్చగా మారింది.

శ్రీవారి నిధుల వినియోగంలో టీటీడీ ఇష్టారాజ్యం కొనసాగుతోందన్న విమర్శల నేపథ్యంలో డిపాజిట్ల అంశం మరో వివాదానికి తెర తీసింది. తిరుపతి కో ఆపరేటివ్ టౌన్ బ్యాంకులో రూ.10 కోట్లను గుట్టుచప్పుడు కాకుండా టీటీడీ డిపాజిట్ చేసిందన్న విషయం దుమారం రేపింది. తిరుపతి టౌన్ బ్యాంకులో వెంకన్న ఖజానా నుంచి రూ.10 కోట్లు నిధులను డిపాజిట్ చేసింది. దీనికి సంబంధించిన డిపాజిట్ బాండ్లను కూడా టీటీడీకి టౌన్ బ్యాంక్ అందజేసింది.

టీటీడీ నిబంధనల మేరకు వడ్డీ కాసుల వాడి సొమ్ము అధిక వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్ చేయాలన్న నిబంధన టీటీడీలో ఉంది. మరోవైపు ప్రభుత్వం ఆమోదించిన ప్రైవేట్ రంగ బ్యాంక్ లు కొటేషన్లు సమర్పించే అర్హత పొందడానికి అత్యధిక క్రెడిట్ రేటింగ్ కలిగి వుండాలన్న షరతు కూడా ఉంది. డిపాజిట్ల అంశం పై టీటీడీ పాలకమండలి తీర్మానించిన నిబంధనలను కూడా పాటించాల్సి ఉంది. ఈ మేరకు వివిధ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో వెంకన్న సొమ్ము డిపాజిబ్ చేసేందుకు టీటీడీ జాతీయ బ్యాంకులు ఎంత వడ్డీ ఇస్తుందో తెలియజేస్తూ సీల్డు కవర్స్ లో కొటేషన్ లను పొందాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

టీటీడీ ట్రస్టు అనుమతితో అధిక వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్న టీటీడీ ఇప్పటివరకు ఎస్బీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, విజయ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టు స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో రూ.10 కోట్లను తిరుపతి టౌన్ బ్యాంకులో 8.5 శాతం వడ్డీ రేటుతో డిపాజిట్ చేయడంతో టీటీడీ బ్యాంకుల్లో శ్రీవారి నిధులు డిపాజిట్ చేయడం చర్చకు దారితీసింది.

అయితే టీటీడీ నిధులను టౌన్ బ్యాంక్, సహకార బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంపై విమర్శలు రావడాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోని టీటీడీ ఆర్బీఐ నిబంధనలు సడలించినట్లు చెబుతోంది. అయితే టౌన్ బ్యాంక్ లో టీటీడీ డిపాజిట్ విషయంలో గోప్యత పాటించడం, ఎన్నికల సమయంలో తిరుపతి టౌన్ బ్యాంకులో డిపాజిట్ల మొత్తం పెంచడం పట్ల ఆరోపణలు రాగా రాజకీయ రంగు కూడా పులుముకుంది.

తిరుమల శ్రీవారి ఆలయం తోపాటు టీటీడీ అనుబంధ ఆలయాలు, ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయాన్ని జాతీయ బ్యాంకుల్లో ఇప్పటి దాకా డిపాజిట్ చేస్తున్న టీటీడీ శ్రీవారి నిధులను సహకార బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు యత్నించడంపై గతంలోనూ భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఇప్పుడు సప్తగిరి గ్రామీణ బ్యాంకు, తిరుపతి సహకార టౌన్ బ్యాంకుల్లో టీటీడీ రూ.50 కోట్ల వరకు డిపాజిట్లు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రూ.10 కోట్లను గత వారం తిరుపతి టౌన్ బ్యాంక్ లో డిపాజిట్ చేసి బాండ్లను పొందడంపై విమర్శలను టీటీడీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆర్డీఐ నిబంధనల మేరకే అధిక వడ్డీలను ఇచ్చే స్థానిక సహకార, టౌన్ బ్యాంకుల్లోనూ డిపాజిట్లు చేస్తున్నామని చెబుతున్నటీటీడీ..  తిరుపతి టౌన్ బ్యాంక్ కు వంద ఏళ్ల చరిత్ర ఉందంటోంది. ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న తిరుపతి టౌన్ బ్యాంకులో డిపాజిట్లను చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది.

అయితే శ్రీవారి కానుకల ఆదాయాన్ని టౌన్ బ్యాంక్, సహకార బ్యాంకుల్లో ఏవైనా ఆర్ధిక అవకతవకలు జరిగితే టీటీడీ డిపాజిట్ల సొమ్ముకు ఎంతవరకు రక్షణ ఉంటుందన్నదే ఇప్పుడు భక్తుల్లో వినిపిస్తున్న చర్చ. టీటీడీ వంటి సంస్థలు చేసే కోట్ల రూపాయల డిపాజిట్లకు బీమా పరిధి ఎంతవరకు ఉందనే విషయం వెల్లడి కావాల్సి ఉంది. ఒక వేళ పలు కారణాలతో టీటీడీ డిపాజిట్ చేసిన స్థానిక బ్యాంకులు దివాళా తీస్తే టీటీడీ కి వచ్చే ఆపార నష్టం పైనా దృష్టి సారించాల్సి అవసరం ఉందన్న అభిప్రాయం భక్తుల్లో ఉంది. ఆర్ధికంగా పరిపుష్టి కలిగి ఉండే  జాతీయ బ్యాంకులు, ఏ ఇతర కారణాలతో నష్టాలతో సమస్యలు ఉత్పన్నం కాకుండా నగదు రక్షణకు తీసుకుంటున్న చర్యల పట్ల టీటీడీ ముందస్తు సమాచారం భక్తులకు ఇవ్వాలన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్