AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagoba Jatara: గంగాజలాభిషేకంతో నాగోబా జాతర ప్రారంభం.. నేడు కొత్త కోడళ్ల పరిచయ కార్యక్రమం.. వేడుకలో ప్రతీ ఘట్టం ఎంతో అద్వితీయం

పుష్యమాస అమవాస్య ..అర్ధరాత్రి వేళ  నాగోబా ఆలయంలో  ఆనవాయితీ ప్రకారం భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు  మెస్రం వంశ పూజారులు. ఏడు కావిడిలతో నెయ్యి, పుట్ట తేనే , బెల్లం , గానుగ నూనే.. 125 గ్రామాలు తిరిగి కాలినడకన గోదావరి నుండి తెచ్చిన పవిత్ర గంగాజలంతో ఆరాద్య దైవం నాగోబాకు అభిషేకం నిర్వహించారు. నాగోబా నిజరూప దర్శనాన్ని కళ్లరా చూసి తన్మయత్వం చెందారు. ప్రత్యేక పూజలకు‌  ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆసిపాబాద్ జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ , ఎస్పీ గౌసం ఆలం తదితరులు హాజరయ్యారు. 

Nagoba Jatara: గంగాజలాభిషేకంతో నాగోబా జాతర ప్రారంభం.. నేడు కొత్త కోడళ్ల పరిచయ కార్యక్రమం.. వేడుకలో ప్రతీ ఘట్టం ఎంతో అద్వితీయం
Nagoba Jatara 2024
Surya Kala
|

Updated on: Feb 10, 2024 | 7:40 AM

Share

అడవి బిడ్డల అపురూపమైన వేడుకలు మేడారం జాతరకు ఓ వైపు సన్నాహాలు జరుగుతుండగా.. మరోవైపు అడవుల జిల్లా ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా  క్షేత్రం వెలుగుపూల వనమైంది. నాగోబా జాతర కనులపండువగా ప్రారంభమైంది. నాగ శేషుడుని పూజించే ఈ నాగోబా జాతర గంగాజలాభిషేకంతో శ్రీకారం చుట్టుకుంది. మేస్రం వంశీయులు ఆలయ గర్బగుడిలో‌ నవదాన్యాలు, పాలు ఉంచి ప్రత్యేక పూజలు చేయగా నవదాన్యాలు , పాల కలశం పై కప్పిన తెల్లని వస్త్రం కదలడంతో నాగ శేషుడు ఆశీర్వాదం లభించిందని ప్రధాన పూజను‌ ప్రారంభించారు నాగోబా ఆలయ మేస్రం పూజరులు.

నాగోబా వేడుకలో ప్రతీ ఘట్టం ఎంతో అద్వితీయం..

పుష్యమాస అమవాస్య ..అర్ధరాత్రి వేళ  నాగోబా ఆలయంలో  ఆనవాయితీ ప్రకారం భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు  మెస్రం వంశ పూజారులు. ఏడు కావిడిలతో నెయ్యి, పుట్ట తేనే , బెల్లం , గానుగ నూనే.. 125 గ్రామాలు తిరిగి కాలినడకన గోదావరి నుండి తెచ్చిన పవిత్ర గంగాజలంతో ఆరాద్య దైవం నాగోబాకు అభిషేకం నిర్వహించారు. నాగోబా నిజరూప దర్శనాన్ని కళ్లరా చూసి తన్మయత్వం చెందారు. ప్రత్యేక పూజలకు‌  ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆసిపాబాద్ జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ , ఎస్పీ గౌసం ఆలం తదితరులు హాజరయ్యారు.

జాతర ప్రారంభానికి కొన్ని ఒక రాగి చెంబులో పాలను పోసి… నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నిటికీ ఒక కొత్త రుమాలును కప్పి గర్బగుడిలోని పుట్టపైన ఉంచుతారు. పుట్టమీది రుమాలు  కదిలితే ..జాతరకు నాగోబా అనుమతి ఇచ్చారని అర్ధం.  నాగోబా జాతరలో పూజ విధానాలే కాదు ఆచార‌వ్యవహారాలు‌ నడవడిక.. నియమ నిష్టాలు అన్నీ ప్రత్యేకమే. పూర్వీకుల్ని స్మరిస్తూ నిర్వహించే పెర్సపాన్‌ పూజ, కొత్త కోడళ్లను పరిచయం చేసే  బేటింగ్‌ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక ఆదీవాసీల సంస్కృతి సంప్రదాయాలను చాటిచెప్పే ఆటా  పాటాలతో  అడవి తల్లి మురిసిపోతుంది.

ఇవి కూడా చదవండి

నాగోబా జాతర‌  ఈ నెల 15వ వరకు కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలు సహా  ఒడిషా, చత్తీస్‌ఘడ్‌, మహారాష్ర్ట ల  నుంచి భక్తులు తరలి వస్తారిక్కడకు. ఈ నెల 12వ తేదీన నాగోబా దర్బార్‌ హాల్ లో అధికారుల సమక్షంలో గిరిజన దర్బార్ నిర్వహిస్తారు. ఆనవాయితీ ప్రకారం అధికారులు, మంత్రులు  గిరిజన దర్బార్‌కు హాజరవుతారు. ఈ వేదికగా ఆదివాసీల సమస్యలు-పరిష్కారంపై చర్చిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..