AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: బీజేపీతో టీడీపీ పొత్తులపై ఈ నియోజకవర్గాల్లో వ్యతిరేక పవనాలు.. అసలు కారణం ఇదే..

బీజేపీతో పొత్తును టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయా? ముస్లిం ఓటర్లు దూరమవుతారనే టెన్షన్‌ పట్టుకుందా? ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు ఏవి? ఎక్కడి నేతల్లో కలవరం నెలకొనిందో చూద్దాం. ఏపీలో రాజకీయం హీటెక్కింది. ఓవైపు ఎన్నికలు దగ్గరపడుతుంటే.. మరోవైపు పొత్తుల అంశం నేతల్లో టెన్షన్ పెడుతుంది.

AP News: బీజేపీతో టీడీపీ పొత్తులపై ఈ నియోజకవర్గాల్లో వ్యతిరేక పవనాలు.. అసలు కారణం ఇదే..
Bjp And Tdp
Srikar T
|

Updated on: Feb 10, 2024 | 9:00 AM

Share

బీజేపీతో పొత్తును టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయా? ముస్లిం ఓటర్లు దూరమవుతారనే టెన్షన్‌ పట్టుకుందా? ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు ఏవి? ఎక్కడి నేతల్లో కలవరం నెలకొనిందో చూద్దాం. ఏపీలో రాజకీయం హీటెక్కింది. ఓవైపు ఎన్నికలు దగ్గరపడుతుంటే.. మరోవైపు పొత్తుల అంశం నేతల్లో టెన్షన్ పెడుతుంది. బీజీపీతో.. టీడీపీ పొత్తు అనగానే ఆపార్టీ సీమనేతల్లో కలవరం మొదలైంది. ఐదేళ్లు కష్టపడి సమీకరించుకున్న ముస్లిం ఓట్లు.. దూరమవుతాయోనన్న భయం సీమ టీడీపీలో నెలకొంది. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో మైనారిటీలు దాదాపు నాలుగు నియోజకవర్గాలలో కీరోల్ పోషిస్తారు. అందులో మొదటిగా కడప అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ దాదాపు 50 శాతం ఓట్లు మైనారిటీలవే.

బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే కడప నియోజకవర్గంలోని 95వేలమంది ముస్లిం మైనారిటీల ఓట్లు వన్ సైడ్ ఓటింగ్ చేయడం పక్కాఅనే అభిప్రాయం స్థానికుల నుంచి వస్తుంది. ఇక రాయచోటి నియోజకవర్గంలో మైనారిటీలు ప్రధాన భూమిక పోషిస్తారు. దాదాపు 70 వేలమంది ముస్లిం మైనార్టీ ఓటర్లు ఉన్నారు. వీరూ కూడా అలయన్స్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే టాక్ వినిపిస్తుంది. అటు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోను దాదాపు 60 వేల ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఆ మూడు పార్టీల మధ్య పొత్తులు కుదిరితే వన్ సైడ్‎గా ఓట్ వేయనున్నారు. కమలాపురంలో ముస్లిం మైనారిటీలు దాదాపు 40 వేల ఓట్లు ఉన్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారనే టాక్ వినిపిస్తుంది.

బీజేపీతో టీడీపీ పొత్తును ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ నేతలు ఎవరు అంగీకరించడం లేదు. బీజేపీతో పొత్తును బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పోటీ చేయలేమని పార్టీ పెద్దలకు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్నూలు, ఆదోని, నంద్యాల, బనగానపల్లె, శ్రీశైలం, నందికొట్కూరు, ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండు పార్లమెంటు స్థానాలపై తీవ్ర ప్రభావం చూపుతుందనేది టిడిపి నేతల భయం. ఇక అనంతపురం జిల్లాలో కూడా బీజేపీతో పొత్తును టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం, మైనార్టీలు పార్టీకి దూరమవుతారంటూ ఆవేదన చెందున్నారు.

ఇవి కూడా చదవండి

ఎన్నికల టైం దగ్గర పడుతున్న వేళలో ఇలాంటి కొత్త చిక్కులేంటని చర్చించుకుంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీజేపీతో పొత్తు వల్ల టీడీపీపై ప్రభావం చూపే నియోజకవర్గాల విషయానికి వస్తే.. అనంతపురం, హిందూపురం, కదిరి, తాడిపత్రి, ధర్మవరం, గుంతకల్, పెనుకొండ తదితర నియోజకవర్గాలలో మెజారిటీ ఓటర్లు డిసైడెడ్ ఫ్యాక్టర్‌గా ఉన్నాయి. బీజేపీతో పొత్తు వల్ల ఈనియోజకవర్గాల్లో ముస్లింలు టీడీపీకి దూరమవుతారంటూ నేతలు ఆవేదన చెందుతున్నారు. అటు రాయలసీమ జిల్లాలోనే కాదు.. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలోను ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ గెలిచే అవకాశాలు చాలా తక్కువ అని ఆయా నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థులు భయపడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..