AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Red Chilli Theft: కళ్లెంలో ఆరబెట్టిన మిర్చి.. ఎర్ర బంగారాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు.. లబోదిబోమంటున్న రైతు..

తెల్ల బంగారం స్థానంలోకి ఎర్ర బంగారం వచ్చి చేరింది. ఎర్ర బంగారం అంటే ఏంటో అనుకుంటున్నారా.. అదేనండి మిర్చి.. గుంటూరు మిర్చికి దేశ విదేశాల్లో పేరుంది. ఇక్కడ ఘాటైన మిర్చి సాగవుతోంది. గత మూడేళ్లుగా మిర్చి ధరలు పెరిగిపోయాయి. క్వింటా ఇరవై వేల రూపాయల నుండి ఇరవై ఏడు వేల రూపాలయ వరకూ చేరింది. దీంతో గ్రాము బంగారంతో క్వింటా మిరప కాయల ధర పోటీ పడుతుందన్న ప్రచారం జరిగింది.

Red Chilli Theft: కళ్లెంలో ఆరబెట్టిన మిర్చి.. ఎర్ర బంగారాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు.. లబోదిబోమంటున్న రైతు..
Red Chilli Theft
Follow us
T Nagaraju

| Edited By: Surya Kala

Updated on: Feb 09, 2024 | 6:56 PM

తెల్ల బంగారానికి గుంటూరు జిల్లా ఒకప్పుడు పెట్టింది పేరు.. తెల్ల బంగారం అంటే ఏంటనుకుంటున్నారా .. అదేనండీ ప్రత్తి.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రత్తిని అత్యధికంగా సాగు చేయడమే కాకుండా అధిక దిగుబడి కూడా ఇక్కడి రైతులు సాధించేవారు. ఎకరం సాగు చేస్తే భారీగా ఆదాయం వచ్చేంది. దీంతో ప్రత్తిని తెల్ల బంగారం అని పిలుస్తుంటారు. ఇప్పుడు తెల్ల బంగారం స్థానంలోకి ఎర్ర బంగారం వచ్చి చేరింది. ఎర్ర బంగారం అంటే ఏంటో అనుకుంటున్నారా.. అదేనండి మిర్చి.. గుంటూరు మిర్చికి దేశ విదేశాల్లో పేరుంది. ఇక్కడ ఘాటైన మిర్చి సాగవుతోంది. గత మూడేళ్లుగా మిర్చి ధరలు పెరిగిపోయాయి. క్వింటా ఇరవై వేల రూపాయల నుండి ఇరవై ఏడు వేల రూపాలయ వరకూ చేరింది. దీంతో గ్రాము బంగారంతో క్వింటా మిరప కాయల ధర పోటీ పడుతుందన్న ప్రచారం జరిగింది.

అయితే ఇప్పుడు ఆ ధరలే రైతుల పాలిట శాపంగా మారాయి. సాధారణంగా గుంటూరు జిల్లాలో మిర్చిని కోసిన తర్వాత కళ్లాల్లో ఆరబెడుతుంటారు. అలా ఆరబెట్టిన మిర్చి ఎండిన తర్వాత మిర్చి యార్డుకు తరలించి విక్రయించుకుంటారు. ఇదే క్రమంలో పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన రైతు గొట్టం శివారెడ్డి ఐదు ఎకరాలను కౌలుకి తీసుకొన్ని మిర్చి సాగు చేశాడు. ఈ పొలంలో పదిహేను క్వింటాళ్ళ మిర్చి పండింది. పంటను కోసిన శివారెడ్డి ఊరికి సమీపంలో ఉన్న కళ్లంలో ఆరబోశాడు.

రాత్రి పదకొండు గంటల వరకూ కళ్లం వద్దే ఉన్నాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయాడు. తెల్లవారి వెళ్లే చూసేసరికి కళ్లంలో ఉండాల్సిన పదిహేను క్వింటాళ్ల మిర్చి కనపడలేదు. దీంతో ఆదుర్థుగా అందరిని వాకబు చేశాడు. ఎవరూ తమకి తెలియదన్నారు. దీంతో మిర్చిని దొంగులు ఎత్తుకెళ్లారని నిర్ణయానికి వచ్చాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడు లక్షల రూపాయల విలువైన మిర్చి పోవటంతో ఆర్ధికంగా నష్టపోయానని రైతుల లబోదిబో మంటున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి తరహా దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే పోలీసులు కూడా దొంగలను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..