Andhra Pradesh: పట్టపగలు రెచ్చిపోయిన దొంగలు.. మత్తు మందిచ్చి బంగారు గొలుసు అపహరణ
ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ మహిళకు మాయమాటలు చెప్పి ఆమెకు మత్తుమందు ఇచ్చి మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు చైన్ ఎత్తుకెళ్లిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో లక్ష్మీపేట లో నివాసం ఉంటున్నా ఉమాదేవి ఇంటికి ఇద్దరు వ్యక్తులు ఇంటి ముందు ఉన్న టైల్స్ ను ఓ లిక్విడ్ తో శుభ్రం చేస్తామని నమ్మబాలికారు..
కర్నూలు, ఫిబ్రవరి 9: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ మహిళకు మాయమాటలు చెప్పి ఆమెకు మత్తుమందు ఇచ్చి మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు చైన్ ఎత్తుకెళ్లిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో లక్ష్మీపేట లో నివాసం ఉంటున్నా ఉమాదేవి ఇంటికి ఇద్దరు వ్యక్తులు ఇంటి ముందు ఉన్న టైల్స్ ను ఓ లిక్విడ్ తో శుభ్రం చేస్తామని నమ్మబాలికారు.
అనంతరం ఇంట్లో ఉన్న బంగారు కూడా ఇలా క్లిన్ చేస్తామని ఉమాదేవిని నమ్మించి, తెలుపు రంగులో ఉన్న ఓ పౌడర్ ను ఉమాదేవి చేతికి అందించారు. అది చేతిలోకి తీసుకున్న వెంటనే ఉమాదేవి మత్తులోకి జరిపోయింది. వెంటనే ఇద్దరు దొంగలు మహిళా మేడలో ఉన్న నాలుగు తులాల మంగళసూత్రం చైన్ తో పాటు, మరో తులం ఉన్న చిన్న చైన్ ను కట్ చేసి ఎత్తుకొని వెళ్లారు. ఉమాదేవికి మెలుకువ వచ్చే సరికి ఆమె మేడాలో ఉన్న బంగారం కనబడ లేదు. దీంతో ఆమె వెంటనే భర్త ఇరన్న తో కలిసి పట్టణ పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.