Andhra Pradesh: ఆక్రమిత స్థలంలో పబ్లిక్ లెట్రిన్స్.. కఠిన చర్యలు తీసుకోవాలంటూ పెద్దాయన వినూత్న నిరసన!
అది చూడటానికి ప్రభుత్వ కార్యాలయంలా ఉంది. అక్కడ ఎవరో తెల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి గాంధీ తీరులో నిరసన తెలియజేస్తున్నాడు. అంతటితో ఆగలేదు. ఒక వ్యక్తి అక్కడికి వేగంగా వచ్చాడు. వచ్చిన వెంటనే నిరసన వ్యక్తం చేస్తున్న అతనికి శిరో ముండనం చేశాడు. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా...? ఇది కూడా నిరసనలో భాగమే... ఇదంతా ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? ఇది జరిగింది పల్నాడు జిల్లా నర్సరావుపేట జిల్లా కేంద్రంలోని..
నర్సరావుపేట, ఫిబ్రవరి 9: అది చూడటానికి ప్రభుత్వ కార్యాలయంలా ఉంది. అక్కడ ఎవరో తెల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి గాంధీ తీరులో నిరసన తెలియజేస్తున్నాడు. అంతటితో ఆగలేదు. ఒక వ్యక్తి అక్కడికి వేగంగా వచ్చాడు. వచ్చిన వెంటనే నిరసన వ్యక్తం చేస్తున్న అతనికి శిరో ముండనం చేశాడు. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా…? ఇది కూడా నిరసనలో భాగమే… ఇదంతా ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? ఇది జరిగింది పల్నాడు జిల్లా నర్సరావుపేట జిల్లా కేంద్రంలోని మున్సిఫల్ కార్యాలయం ఎదుట అందరి ముందు నిరసన వ్యక్తం చేస్తూ శిరో ముండనం చేయించుకున్నాడు ఓ పెద్దాయన. వివరాల్లోకి వెళితే…
నర్సరావుపేటలోని 19వ వార్డులో మున్సిపాలిటికి చెందిన ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంలో వెంకటరెడ్డి అలియాస్ మిలటరీ రెడ్డి అనే వ్యక్తం పబ్లిక్ టాయిలెట్స్ కట్టడానికి సిద్దమయ్యాడు. దీంతో వివాదం మొదలైంది. ప్రభుత్వ స్థలాన్ని ప్రవేటు వ్యక్తులు ఆక్రమించి మరుగుదొడ్డి కట్టడంపై స్థానికుడైన బొగ్గరం మూర్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా కోర్టును కూడా ఆశ్రయించాడు. ప్రభుత్వ స్థలంలో మరుగుదొడ్డి నిర్మాణాన్ని కోర్టుకు కూడా వ్యతిరేకించింది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం మున్సిఫల్ సిబ్బంది టాయిలెట్స్ ను తొలగించే ప్రయత్నం చేశాడు. అదే క్రమంలో మిలటరీ రెడ్డి.. బొగ్గరం మూర్తిని బెదిరించాడు. అంతేకాకుండా కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. వెంటనే మూర్తి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిలటరీ రెడ్డిని అదుపులోకి తీసుకొని రాత్రి వదిలేశారు.
దీనిని తప్పు పడుతూ బొగ్గరం మూర్తి ఆందోళనకు దిగాడు. ఏకంగా మున్సిఫల్ కార్యాయలం ఎదుట ఒంటరిగా నిరసన వ్యక్తం చేశాడు. అనంతరం శిరోముండనం చేయించుకున్నాడు. ప్రభుత్వం, మున్సిఫల్ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని మరుగుదొడ్డిని తొలగించాలని డిమాండ్ చేశాడు. అధికారులు స్పందించకుంటే రేపటి నుండి అర్ధనగ్నంగా దీక్షకు దిగుతానని హెచ్చరించాడు. దీంతో పోలీసులు ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మున్సిఫల్ అధికారులు కూడా మరుగుదొడ్లను పడగొట్టేందుకు సిద్దమయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.