AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: జుట్టు కత్తిరించుకోవాలని అధ్యాపకుడు మందలింపు.. భవనం పైనుంచి దూకేసిన విద్యార్ధి!

తరగతి గదిలో తోటి విద్యార్థుల ముందు జుట్టు కత్తిరించుకోవాలని అధ్యాపకుడు మందలించాడు. అవమానంగా భావించిన ఆ విద్యార్ధి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే భవనం మీద నుంచి కిందికి దూకేశాడు. సిద్దిపేట జిల్లాలో ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్‌ మండలం చంద్లాపూర్‌కు చెందిన నక్కిరెడ్డి జ్ఞానేశ్వర్‌ రెడ్డి (19) ఘట్‌కేసర్‌ మండలం వెంకటాపూర్‌లోని..

Hyderabad: జుట్టు కత్తిరించుకోవాలని అధ్యాపకుడు మందలింపు.. భవనం పైనుంచి దూకేసిన విద్యార్ధి!
Student Jumped From University Building
Srilakshmi C
|

Updated on: Feb 08, 2024 | 4:14 PM

Share

ఘట్‌కేసర్‌, ఫిబ్రవరి 8: తరగతి గదిలో తోటి విద్యార్థుల ముందు జుట్టు కత్తిరించుకోవాలని అధ్యాపకుడు మందలించాడు. అవమానంగా భావించిన ఆ విద్యార్ధి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే భవనం మీద నుంచి కిందికి దూకేశాడు. సిద్దిపేట జిల్లాలో ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్‌ మండలం చంద్లాపూర్‌కు చెందిన నక్కిరెడ్డి జ్ఞానేశ్వర్‌ రెడ్డి (19) ఘట్‌కేసర్‌ మండలం వెంకటాపూర్‌లోని అనురాగ్‌ యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ సీఎస్‌ఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. జ్ఞానేశ్వర్‌ రెడ్డి గత కొన్ని రోజులుగా తరగతులకు ఆలస్యంగా వస్తున్నాడు. అంతేకాకుండా మొదటి సెమిస్టర్‌ పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యాడు. నాలుగు రోజుల క్రితం సెమిస్టర్‌ ఫలితాలు విడుదలవగా ఈ విషయం వెల్లడైంది.

దీంతో గత మూడు రోజుల నుంచి అధ్యాపకుడు (డీన్‌) వీఎస్‌రావు విద్యార్థి జ్ఞానేశ్వర్‌ రెడ్డికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్ధిని కటింగ్‌ చేయించుకోవాలని సూచించారు. బుధవారం కూడా తరగతి గదిలో విద్యార్ధుల ముందు ఇదే విషయమై జ్ఞానేశ్వర్‌ రెడ్డిని అధ్యాపకుడు వీఎస్‌రావు మరోమారు మందలించారు. దీంతో తోటి విద్యార్థుల ముందు అధ్యాపకుడు మందలించాడని అవమానంగా భావించిన జ్ఞానేశ్వర్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం వర్సిటీ భవనం రెండో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. వెంటనే తోటి విద్యార్ధులు, అధ్యాపకులు యూనివర్సిటీలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు విద్యార్ధికి చికిత్స అందిస్తున్నారు. అధ్యాపకుడు అవమానించడం వల్లనే తాన సోదరుడు ఆత్మహత్యాయత్నం చేశానని విద్యార్థి జ్ఞానేశ్వర్‌ రెడ్డి సోదరుడు స్వాతిక్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటనపై అధ్యాపకుడు వీఎస్‌ రావు మీడియాతో మాట్లాడుతూ.. జ్ఞానేశ్వర్‌రెడ్డి తరగతులకు సరిగా హాజరు కావడం లేదనీ, మొదటి సెమ్‌లో అన్నింటా ఫెయిలయ్యాడని, జుట్టు పెరిగినందున కటింగ్‌ చేయించుకోవాలని కౌన్సెలింగ్‌ మాత్రమే ఇచ్చానని చెప్పారు. ఇదే విషయాన్ని విద్యార్థి తండ్రికి కూడా ఫోన్‌ చేసి చెప్పినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

యువకుడి దారుణ హత్య.. నిందితుడిని పట్టించిన ఇన్‌స్టా రీల్..!
యువకుడి దారుణ హత్య.. నిందితుడిని పట్టించిన ఇన్‌స్టా రీల్..!
పెళ్లి వార్తలపై స్పందించిన మృణాల్ టీమ్.. ?
పెళ్లి వార్తలపై స్పందించిన మృణాల్ టీమ్.. ?
నా ఉద్దేశం అది కాదు.. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు..
నా ఉద్దేశం అది కాదు.. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు..
ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?