AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Student Deaths in US: అమెరికాలో మరో భారత సంతతి విద్యార్థి అనుమానాస్పద మృతి.. నెల రోజుల్లో ఐదో ఘటన! ఏం జరుగుతోందక్కడ..?

అగ్రరాజ్యం అమెరికాలో మరో భారత సంతతి విద్యార్ధి మృతి చెందాడు. గత నెల రోజులుగా అక్కడ చదువుకుంటున్న భారత సంతతి విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతుండటం కలకలం రేపుతోంది. తాజాగా మరో ఘటన చోటుచేసుకోవడంతో చర్చణీయాంశంగా మారింది. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చదువుతున్న సమీర్‌ కామత్‌ (23) అనే భారత సంతతి విద్యార్ధి అనుమానాస్పద రీతిలో..

Indian Student Deaths in US: అమెరికాలో మరో భారత సంతతి విద్యార్థి అనుమానాస్పద మృతి.. నెల రోజుల్లో ఐదో ఘటన! ఏం జరుగుతోందక్కడ..?
Another Indian-origin student found dead in US
Srilakshmi C
|

Updated on: Feb 07, 2024 | 3:16 PM

Share

అగ్రరాజ్యం అమెరికాలో మరో భారత సంతతి విద్యార్ధి మృతి చెందాడు. గత నెల రోజులుగా అక్కడ చదువుకుంటున్న భారత సంతతి విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతుండటం కలకలం రేపుతోంది. తాజాగా మరో ఘటన చోటుచేసుకోవడంతో చర్చణీయాంశంగా మారింది. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చదువుతున్న సమీర్‌ కామత్‌ (23) అనే భారత సంతతి విద్యార్ధి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. విలియమ్స్‌పోర్ట్‌లోని 3300 నార్త్ వారెన్ కౌంటీ రోడ్ 50 వెస్ట్‌లోని క్రోస్ గ్రోవ్ నేచర్ ప్రిజర్వ్‌ వద్ద సోమవారం సాయంత్రం అతని మృతదేహం లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు.

సమీర్‌కు అమెరికా పౌరసత్వం ఉంది. గతేడాది ఆగస్టులో అతను మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశాడు. ఈ ఏడాది పర్డ్యూ యూనివర్సిటీలోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో డాక్టరల్ డిగ్రీని అభ్యసిస్తున్నాడు. అతడి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మంగళవారం సమీర్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్‌ పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి భారత సంతతికి చెందిన విద్యార్ధులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. సమీర్‌తో కలిపి ఈ ఏడాదిలో మొత్తం ఐదుగురు ఐదో ఘటన కావడం గమనార్హం.

కాగా.. పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న మరో భారత సంతతి విద్యార్థి నీల్‌ ఆచార్య కూడా ఇటీవల ఇదే విధంగా అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కంప్యూటర్ సైన్స్ మరియు డేటా సైన్స్ చదువుతున్న నీల్‌ ఆచార్య కొన్ని గంటల పాటు కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత అదే క్యాంపస్‌లో శవమై కనిపించాడు. దీంతో పోలీసులు అతని మృతదేహం స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గతవారం ఒహియోలో భారత-అమెరికన్‌ విద్యార్థి శ్రేయాస్‌రెడ్డి బెనిగేరి మరణించాడు. సిన్సినాటిలోని లిండ్నర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో విద్యార్థిగా ఉన్నాడు. అలాగే జనవరి 16న అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని లిథోనియాలో 25 ఏళ్ల భారతీయ విద్యార్థి వివేక్‌ సైనీ ఓ వ్యక్తి చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. జనవరి 20న అకుల్ ధావన్ అనే 18 ఏళ్ల భారతీయ-అమెరికన్ విద్యార్థి ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం సమీపంలోని భవనం వెనుక వరండాలో శవమై కనిపించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.