Telangana: రోడ్డుపై చేపల లారీ బోల్తా.. వాహనాల కిందపడి విలవిలలాడిన టన్నుల చేపలు! వీడియో

తెలంగాణ రాష్ట్రం వనపర్తిలో జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారు జామున 5:30 గంటల సమయంలో అదుపు తప్పి బోల్తా పడింది. లారీ లోడ్‌తో రేవు నుంచి పెబ్బైర్ రోడ్డు వైపు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మిడ్‌వే పాయింట్ వద్ద అదుపు తప్పడంతో ఒక్కసారిగా రోడ్డుపై లారీ బోల్తా పడింది. దీంతో లారీ ట్రక్కులో ఉన్న చేపలు రోడ్డుపై చల్లాచదురుగా పడిపోయాయి. ఇంకా పూర్తిగా తెల్లవారక ముందే ఈ సంఘటన జరగడంతో రోడ్డంతా చేపలు..

Telangana: రోడ్డుపై చేపల లారీ బోల్తా.. వాహనాల కిందపడి విలవిలలాడిన టన్నుల చేపలు! వీడియో
Tons Of Live Fish Crushed
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 06, 2024 | 6:12 PM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6: రోడ్డుపై జరిగిన ఓ ప్రమాదంలో టన్నుల కొద్దీ సజీవ చేపలు రోడ్లపై చిందరవందరగా పడ్డాయి. రాత్రి సమయం కావడంతో వాహనాలు కింద పడి చేపలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ షాకింగ్‌ ఘటన తెలంగాణ రాష్ట్రం వనపర్తిలో జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది.

తెలంగాణ రాష్ట్రం వనపర్తిలో జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారు జామున 5:30 గంటల సమయంలో అదుపు తప్పి బోల్తా పడింది. లారీ లోడ్‌తో రేవు నుంచి పెబ్బైర్ రోడ్డు వైపు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మిడ్‌వే పాయింట్ వద్ద అదుపు తప్పడంతో ఒక్కసారిగా రోడ్డుపై లారీ బోల్తా పడింది. దీంతో లారీ ట్రక్కులో ఉన్న చేపలు రోడ్డుపై చల్లాచదురుగా పడిపోయాయి. ఇంకా పూర్తిగా తెల్లవారక ముందే ఈ సంఘటన జరగడంతో రోడ్డంతా చేపలు ఎగురుతూ కనిపించాయి. రోడ్డుపై వచ్చే, పోయే వాహనాల కింద ఆ చేపలు పడి నలిగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా భీతావాహ దృశ్యం కనిపించింది. టన్నుల సజీవ చేపలు రోడ్డుపై వాహనాల కింద పడి చెల్లాచెదురుగా నలిగిపోయాయి. మరికొన్ని చేపలు రోడ్డుకి ఇరువైపులా కుప్పలుగా పడిపోయాయి.

ఇవి కూడా చదవండి

అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. బతికున్న చేపలు చేపలు రోడ్డుపై ఎగిరెగిరి పడుతుండటంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రమాద వార్త తెలియగానే స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని గోనె సంచుల్లో చేపలను నింపుకుని తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాలు నిర్దాక్షిణ్యంగా బతికున్న చేపలపై నుంచి వెళ్లడంతో వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.