JEE Main 2024 Answer Key: జేఈఈ మెయిన్ సెషన్ -1 ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ విడుదల.. అభ్యంతరాల స్వీకరణకు అవకాశం
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు జనవరిలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ మంగళవారం (ఫిబ్రవరి 6) రాత్రి విడుదలైంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు ఈ పరీక్షలను జాతీయ పరీక్షల సంస్థ (NTA) నిర్వహించింది. ఈ పరీక్షకు దాదాపు 12,25,529 మంది హాజరయ్యారు. తాజాగా విడుదల చేసిన ఈ పరీక్షకు సంబంధించిన..
ఢిల్లీ, ఫిబ్రవరి 7: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు జనవరిలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ మంగళవారం (ఫిబ్రవరి 6) రాత్రి విడుదలైంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు ఈ పరీక్షలను జాతీయ పరీక్షల సంస్థ (NTA) నిర్వహించింది. ఈ పరీక్షకు దాదాపు 12,25,529 మంది హాజరయ్యారు. తాజాగా విడుదల చేసిన ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీలతో పాటు రెస్పాన్స్ షీట్‌లనూ కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
ఆన్సర్ కీ పై అభ్యంతరాలు ఫిబ్రవరి 8వ తేదీ వరకు స్వీకరించనుంది. ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్తాలంటే ప్రతి ప్రశ్నకు రూ.200 ఫీజు చెల్లించి, ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఫిబ్రవరి 8వ తేదీన రాత్రి 11:50 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యర్ధులు సమర్పించిన అభ్యంతరాలను స్వీకరించినట్లు లేదా స్వీకరించనట్లు ఎన్‌టీఏ ఎవరికీ ప్రత్యేకంగా తెలియజేయదు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం నిపుణులు సిద్ధం చేసే ఆన్సర్ కీని తుది ఆన్సర్ కీగా పరిగణిస్తారు.
అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలు సరైనవిగా భావిస్తే ప్రస్తుతం విడుదల చేసిన ఆన్సర్ కీని సవరించి తుది కీ విడుదల చేస్తారు. అనంతరం జేఈఈ మెయిన్ తుది ఫలితాలను ప్రకటిస్తారు. కాగా జేఈఈ మెయిన్ సెషన్ 1 (బీఈ/బీటెక్), పేపర్ 2A (బీఆర్క్), పేపర్ 2B (బీ ప్లానింగ్) పరీక్షలను జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు దేశ వ్యాప్తంగా దాదాపు 291 నగరాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇతర దేశాల్లో 21 సిటీల్లోనూ ఈ పరీక్షను నిర్వహించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.