ANUEET 2024: ఏఎన్‌యూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి గానూ డాక్టర్‌ వైఎస్సార్‌ ఏఎన్‌యూ ఇంజినీరింగ్ అండ్‌ టెక్నాలజీ కాలేజీలో సెల్ఫ్‌ సపోర్ట్‌ విధానంలో బీటెక్+ఎంటెక్‌ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు ANUEET-2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..

ANUEET 2024: ఏఎన్‌యూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం
ANUEET 2024 Notification
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 06, 2024 | 9:35 PM

గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి గానూ డాక్టర్‌ వైఎస్సార్‌ ఏఎన్‌యూ ఇంజినీరింగ్ అండ్‌ టెక్నాలజీ కాలేజీలో సెల్ఫ్‌ సపోర్ట్‌ విధానంలో బీటెక్+ఎంటెక్‌ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు ANUEET-2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్‌ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ విభాగాలలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 510 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు కనీసం 45% మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 10+2లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అర్హులైన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.1200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ప్రవేశ పరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, కౌన్సెలింగ్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్ పరీక్ష కేంద్రాలు ఉంటాయి. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే.. రాత పరీక్ష కేవలం ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. ప్రశ్నాపత్రంలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. మ్యాథ్స్‌ సబ్జెక్ట్‌ నుంచి 40 ప్రశ్నలు, ఫిజిక్స్‌ సబ్జెక్ట్‌ నుంచి 30 ప్రశ్నలు, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. 90 నిమిషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 6, 2024.
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 10, 2024.
  • రూ.750 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 22, 2024.
  • రూ.1250 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 25, 2024.
  • హాల్-టికెట్ డౌన్‌లోడ్: ఏప్రిల్ 1, 2024.
  • ప్రవేశ పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 7, 2024.
  • ఫలితాల వెల్లడి తేదీ: ఏప్రిల్‌ 10, 2024.

మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.