Cancer Symptoms: ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు..! ఈ చిన్న విషయం క్యాన్సర్ వంటి ప్రాణాంతకం కావొచ్చు..

ఇలా మందులు తీసుకోవడం ద్వారా ఈ నొప్పి కొంత సమయం పాటు ఉపశమనం లభిస్తుంది. కానీ, తిరిగి మళ్లీ మళ్లీ నొప్పి రావడం ప్రారంభిస్తే, అది క్యాన్సర్ కు దారితీసే ప్రమాదం ఉంటుంది. కొన్ని రకాల క్యాన్సర్లు రావడం వల్ల శరీరంలో రంగు మారుతూ ఉంటుంది. ముఖ్యంగా శరీరం, కళ్ళు పసుపు పచ్చగా మారడం. చర్మం ఎర్రగా మారి దురద రావడం. శరీర రంగు నల్లగా మారిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా..

Cancer Symptoms: ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు..! ఈ చిన్న విషయం క్యాన్సర్ వంటి ప్రాణాంతకం కావొచ్చు..
Cancer Symptoms
Follow us

|

Updated on: Feb 10, 2024 | 10:34 AM

క్యాన్సర్ అనేది ఎవరికైనా ఎప్పుడైనా వచ్చే వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన వారి శరీరంలో అనేక రకాల ప్రమాదాలు తలెత్తుతాయి. ఈ వ్యాధి ప్రాణాంతకం కూడా కావచ్చు. ఈ వ్యాధికి చికిత్స చేయలేమని కాదు. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే, ఈ వ్యాధి తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ లక్షణాలను సకాలంలో గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చు. పొరపాటున కూడా క్యాన్సర్ ఈ 5 లక్షణాలను విస్మరించకూడదు. ఒక చిన్న విషయమే ప్రాణాంతకం కావొచ్చు. క్యాన్సర్‌ ప్రారంభ సంకేతాలను నిపుణుల నుండి తెలుసుకోండి. శరీరంలో క్యాన్సర్ లక్షణాలు కనిపించిన వెంటనే, మీరు కంగారు పడకుండా నేరుగా వైద్యుడిని సంప్రదించండి.

క్యాన్సర్ వ్యాధిలో కణాలు అనియంత్రితంగా పెరుగుతాయి. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ కణాలు చాలా శక్తివంతమైనవి, అవి శరీర కణాలలోకి ప్రవేశించి వాటిని నాశనం చేస్తాయి. నాసిరకం ఆహారపుటలవాట్లు, దిగజారుతున్న జీవనశైలి కారణంగా అభివృద్ధి చెందుతున్న ఈ వ్యాధి బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు రెండవ అతిపెద్ద కారణం క్యాన్సర్. ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, కడుపు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి ఆరు రకాల క్యాన్సర్లు భారతదేశంలో ప్రబలంగా ఉన్నాయి.

నిపుణుల ప్రకారం, శరీరంలో క్యాన్సర్ లక్షణాలు చాలా ఆలస్యంగా గుర్తించబడతాయి. లక్షణాలు గుర్తించే సమయానికి ప్రమాద తీవ్రత పెరుగుతుంది. శరీరంలో క్యాన్సర్ లక్షణాలు కనిపించిన వెంటనే, మీరు ఆందోళన చెందకుండా నేరుగా వైద్యుడిని సంప్రదించాలి. శరీరంలో క్యాన్సర్ ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో నిపుణుల ద్వారా తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

మీ బరువు ఏ విధమైన వ్యాధి లేదా సమస్య లేకుండా వేగంగా తగ్గిపోతుంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. అయితే, బరువు తగ్గడం క్యాన్సర్ లక్షణం అని భయపడాల్సిన అవసరం లేదు. అనేక వ్యాధుల కారణంగా, బరువు వేగంగా తగ్గుతారు. TB, మధుమేహం, శరీరంలో పోషకాల కొరత, థైరాయిడ్ లేదా పెరిగిన పని భారం వంటి కొన్ని వ్యాధులు కూడా మీ బరువు తగ్గడానికి కారణం కావచ్చు. క్యాన్సర్ కారణంగా బరువు చాలా వేగంగా తగ్గుతుంది. శరీరంలో ఈ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవటం మంచిది. అలాగే, క్యాన్సర్ శరీరంలోకి వచ్చినపుడు,  అది ఒక అవయవం నుండి శరీర భాగాలకు వ్యాప్తి చెందేటప్పుడు జ్వరం వస్తుంది. లుకేమియా లేదంటే లింకుమ వంటి వాటికి జ్వరం సాధారణ లక్షణం.

శరీరంలో వేగంగా అలసట, బలహీనత కూడా క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. శరీరంలో క్యాన్సర్ కణాలు పెరిగినప్పుడు, వాటికి ఎక్కువ పోషకాహారం అవసరం. ఈ క్యాన్సర్ కణాలు రోగి తినే అన్ని పోషకాలను గ్రహిస్తాయి. దీని కారణంగా శరీరంలోని మిగిలిన అవయవాలకు తగినంత ఆహారం అందకుండా పోతుంది. దీంతో అన్ని అవయవాలు బలహీన పడుతుంటాయి. క్రమంగా శరీరం పూర్తిగా బలహీనంగా మారుతుంది. అలాగే, క్యాన్సర్ కాకుండా, అనేక ఇతర కారణాల వల్ల కూడా శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. ఇది ఎక్కువగా ఊపిరితిత్తులు, అన్నవాహిక క్యాన్సర్ లక్షణం.

శరీరంలో పెరుగుతున్న వ్యాధి గురించి చెప్పే ప్రధాన లక్షణం నొప్పి. ఏదైనా శరీర భాగం గట్టిగా మారి నొప్పి లేకపోవడం కూడా క్యాన్సర్ కి కారకమే. క్యాన్సర్ ముఖ్యంగా రొమ్ములు, వృషణాలు, గ్రందుల్లో కణజాలంలో ఏర్పడుతూ ఉంటాయి. ఒళ్లు నొప్పి వంటి సమస్యలకు ఏదో ఒక పెయిన్‌ కిల్లర్‌ వేసుకుంటాం.. ఇలా మందులు తీసుకోవడం ద్వారా ఈ నొప్పి కొంత సమయం పాటు ఉపశమనం లభిస్తుంది. కానీ, తిరిగి మళ్లీ మళ్లీ నొప్పి రావడం ప్రారంభిస్తే, అది క్యాన్సర్ కు దారితీసే ప్రమాదం ఉంటుంది. కొన్ని రకాల క్యాన్సర్లు రావడం వల్ల శరీరంలో రంగు మారుతూ ఉంటుంది. ముఖ్యంగా శరీరం, కళ్ళు పసుపు పచ్చగా మారడం. చర్మం ఎర్రగా మారి దురద రావడం. శరీర రంగు నల్లగా మారిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.

క్యాన్సర్ బారిన పడితే శరీరంపై అయిన గాయాలు వారాలు గడిచిన మానకపోవడం.  చర్మంపై పుట్టుమచ్చ, మొటిమ పరిమాణం పెరగడం, దాని చుట్టూ ఉన్న ప్రాంతం గరుకుగా మారడం క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. తరచుగా మూత్ర విసర్జన కావడం ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణం. మలం విసర్జనలో ఇబ్బంది, మలబద్ధకం, తరచుగా మోషన్స్‌, కడుపులో నొప్పి వంటివి కూడా క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. ఈ లక్షణాలన్నీ క్యాన్సర్‌ హెచ్చరిక సంకేతాలుగా నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు తరచూ మీలో గమనించినట్టయితే, వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపు కావచ్చు. క్యాన్సర్ కారణంగా బరువు చాలా వేగంగా తగ్గుతుంది. శరీరంలో ఈ లక్షణాలు కనిపించిన వెంణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి