AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కోర్టు విచారణలో లేడీ జడ్జికి లవ్ ప్రపోజ్ చేసిన దొంగ..! ఆ తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూడాల్సిందే..

ఒక కోర్టులో దీనికి విరుద్ధంగా ఓ వింత ఘటన చోటుచేసుకుంది. చోరీకి పాల్పడి జైలుకెళ్లిన ఒక దొంగ కటకటాల్లో శిక్ష అనుభవిస్తున్నా.. తన నేరాన్ని మర్చిపోయాడు... కోర్టులో జడ్జి తీర్పు చెప్పే సమయంలో ఏకంగా జడ్జికి లైన్ వేసి మరో తప్పు చేశాడు. అవును, చోరీకి పాల్పడ్డ ఓ దొంగ కోర్టులో జడ్జి తీర్పు చెప్పే సమయంలో ఆ మహిళ జడ్జ్‌కే ఐ లవ్ యూ చెప్పేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.

Viral Video: కోర్టు విచారణలో లేడీ జడ్జికి లవ్ ప్రపోజ్ చేసిన దొంగ..! ఆ తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూడాల్సిందే..
Court Hearing
Jyothi Gadda
|

Updated on: Feb 10, 2024 | 9:14 AM

Share

ఏదైనా నేరం చేసి పట్టుబడిన వారిని అరెస్ట్‌ చేసిన తరువాత, కోర్టులో ప్రవేశపెడతారు.. ఆ క్రమంలో నిందితులు తమకు ఎలాంటి శిక్ష పడుతుందోననే ఆందోళనలో ఉంటారు.. కొందరు ఇకపై మారిపోయి సరైన జీవితం గడపాలని భావిస్తారు.. మరికొందరు పదే పదే జైలుకు వెళ్లటం, తిరిగి విడుదలైన తర్వాత కూడా మళ్లీ అదే పాత బుద్ధిని ప్రదర్శిస్తుంటారు.. కానీ, ఒక కోర్టులో దీనికి విరుద్ధంగా ఓ వింత ఘటన చోటుచేసుకుంది. చోరీకి పాల్పడి జైలుకెళ్లిన ఒక దొంగ కటకటాల్లో శిక్ష అనుభవిస్తున్నా.. తన నేరాన్ని మర్చిపోయాడు… కోర్టులో జడ్జి తీర్పు చెప్పే సమయంలో ఏకంగా జడ్జికి లైన్ వేసి మరో తప్పు చేశాడు. అవును, చోరీకి పాల్పడ్డ ఓ దొంగ కోర్టులో జడ్జి తీర్పు చెప్పే సమయంలో ఆ మహిళ జడ్జ్‌కే ఐ లవ్ యూ చెప్పేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇలాంటి విచిత్రమైన, ఊహించని సంఘటన ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ కోర్టు ఈ వింత ఘటనకు సాక్షిగా నిలిచింది.

వీడియోలో ఒకవైపు దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న డెమెట్రియస్ లూయిస్, మరోవైపు విచారణను నిర్వహించడానికి మహిళా న్యాయమూర్తి తబితా బ్లాక్‌మన్ ఉన్నారు. న్యాయమూర్తి వర్చువల్ కోర్టు ద్వారా తీర్పును చదవడం ప్రారంభించినప్పుడు, చూస్తూ ఊరుకోని నిందితుడు వింతగా ప్రవర్తించడం ప్రారంభించాడు. మీరు చాలా అందంగా ఉన్నారు ఐ లవ్ యూ అంటూ లవ్ ప్రపోజల్ చేశాడు. ఇలా తాను చేసిన నేరానికి శిక్షను ప్రకటిస్తున్నది కోర్టు న్యాయమూర్తితో నిందితుడు అనుచితంగా ప్రవర్తించడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు ఇలా అనడంతో కాస్త కలవరపడిన మహిళా న్యాయమూర్తి.. అనంతరం నవ్వుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే వీడియోని మిలియన్ల మంది వీక్షించారు.

ఇవి కూడా చదవండి

లూయిస్ చోరీకి గల కారణాలను, కోర్టులో అతని ప్రవర్తనకు గల కారణాలను తెలుసుకున్న న్యాయమూర్తి తబిత.. 5 వేల డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, లూయిస్ ఇప్పటికే 4 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. జడ్జితో దురుసుగా ప్రవర్తించినందుకు శిక్షించనప్పటికీ, అతను తన ప్రవర్తనతో ట్రోల్స్‌కు గురి అయ్యాడు. మొత్తానికి ఈ ఫన్నీ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి సందడి చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా