Miss World Pageant: భారత్‌లోనే మిస్ వరల్డ్ పోటీలు.. 28 ఏళ్ల తర్వాత.. ఏ నగరంలోనంటే..
భారతదేశం చివరిగా 1996లో మిస్ వరల్డ్ పోటీకి ఆతిథ్యం ఇచ్చిన మూడు దశబ్దాల తర్వాత ఈ పోటీని భారతదేశంలో నిర్వహిస్తున్నారు. ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఐటీడీసీ) ఆధ్వర్యంలో ఈ నెల 20న ఢిల్లీలో ది ఓపెనింగ్ సెర్మనీ, ఇండియా వెల్‌కమ్స్ ది వరల్డ్ గాలా కార్యక్రమాలతో ఈ ప్రదర్శన మొదలవనుంది.
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రపంచ సుందరి పోటీలు ఈ సారి భారత్ వేదికగా జరగనున్నాయి. అంతర్జాతీయ అందాల పోటీల 71వ ఎడిషన్‌ను ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు భారతదేశంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భారతదేశం చివరిగా 1996లో మిస్ వరల్డ్ పోటీకి ఆతిథ్యం ఇచ్చిన మూడు దశబ్దాల తర్వాత ఈ పోటీని భారతదేశంలో నిర్వహిస్తున్నారు. ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఐటీడీసీ) ఆధ్వర్యంలో ఈ నెల 20న ఢిల్లీలో ది ఓపెనింగ్ సెర్మనీ, ఇండియా వెల్‌కమ్స్ ది వరల్డ్ గాలా కార్యక్రమాలతో ఈ ప్రదర్శన మొదలవనుంది.
మార్చి 9న ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఫైనల్స్ జరగనున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి 120 మంది సుందరీమణులు ఈ పోటీలో పాల్గొన్నున్నారు. ప్రస్తుత ప్రపంచ సుందరి పోలెండ్‌కు చెందిన కరోలినా బిలాస్కాతో పాటు మాజీ విజేతలు ఆన్‌సింగ్(జమైంకా), వనెస్సా పోన్సీ డీ లియోన్(మెక్సికో), మానుషీ చిల్లర్(భారత్), స్టీఫెనీ డెట్ వాలీ (ఫ్యూర్టో రికో)లు హాజరైన విలేకరుల సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారు.
Chairman of Miss World, Julia Morley CBE stated "Excitement fills the air as we proudly announce India as the host country for Miss World. A celebration of beauty, diversity, and empowerment awaits. Get ready for a spectacular journey! 🇮🇳 #MissWorldIndia #BeautyWithAPurpose
— Miss World (@MissWorldLtd) January 19, 2024
1951లో స్థాపించబడిన, మిస్ వరల్డ్ పోటీ సంప్రదాయ అందాల పోటీలను అధిగమించి, తెలివితేటలు, మానవతా సేవ ద్వారా సానుకూల మార్పును సృష్టించగల సామర్థ్యాన్ని తెలియజేస్తుంది.. రాబోయే ఈవెంట్‌లో, పోలాండ్‌కు చెందిన కరోలినా బిలావ్స్కా, ప్రస్తుత ప్రపంచ సుందరి, ఈ గౌరవప్రదమైన పోటీల చరిత్రలో మరో అధ్యాయాన్ని గుర్తుచేస్తూ కిరీటాన్ని అందజేయనున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..