పెళ్లికాని ప్రసాద్‌లే టార్గెట్‌..! వధువును చూపించి నిలువునా ముంచేస్తారు జాగ్రత్త..!!

అవును.. పెళ్లికాని వారిని టార్గెట్ చేసి నకిలీ పెళ్లిళ్లు చేసి మోసం చేసే ముఠాలు కాచుకుని కూర్చున్నాయి.. వయసు దాటినా ఇంకా పెళ్లి కాలేదని రోదించే వారు ఇలాంటి కేటుగాళ్ల మాటలు సులభంగా నమ్మి మోసపోతున్నారు. ఈ ముఠా లక్ష్యం పెళ్లి కానీ వయస్సు పైబడిన పురుషులే. ముందుగా పెళ్లికూతుర్ని చూపిస్తాం అంటున్నారు. పెళ్లి చూపుల కోసం ముందుగానే మీ దగ్గర డబ్బులు అడుగుతారు. ఆ తర్వాత పెళ్లి చేస్తారు. ఇక ఆ తరువాతే అసలు కథ మొదలవుతుంది.

పెళ్లికాని ప్రసాద్‌లే టార్గెట్‌..! వధువును చూపించి నిలువునా ముంచేస్తారు జాగ్రత్త..!!
Wedding
Follow us

|

Updated on: Feb 10, 2024 | 8:27 AM

మీకు ఇంకా పెళ్లి కాలేదా..? అయితే, చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు అమ్మాయిలను చూపించే ముఠాలు చాలా చురుకుగ్గా ఉన్నాయి.. జాగ్రత్త! వారి మాటలు నమ్మితే మీ కథ ముగిసినట్లే..! అవును.. పెళ్లికాని వారిని టార్గెట్ చేసి నకిలీ పెళ్లిళ్లు చేసి మోసం చేసే ముఠాలు కాచుకుని కూర్చున్నాయి.. వయసు దాటినా ఇంకా పెళ్లి కాలేదని రోదించే వారు ఇలాంటి కేటుగాళ్ల మాటలు సులభంగా నమ్మి మోసపోతున్నారు. ఈ ముఠా లక్ష్యం పెళ్లి కానీ వయస్సు పైబడిన పురుషులే. ముందుగా పెళ్లికూతుర్ని చూపిస్తాం అంటున్నారు. పెళ్లి చూపుల కోసం ముందుగానే మీ దగ్గర డబ్బులు అడుగుతారు. ఆ తర్వాత పెళ్లి చేస్తారు. అయితే అది నిజమైన పెళ్లి కాకుండా నకిలీ పెళ్లి అవుతుంది. నకిలీ పెళ్లిళ్లు చేసి పెళ్లికాని వారిని మోసం చేస్తున్న ఖతర్నాక్ ముఠా సభ్యులను పూణె గ్రామీణ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి పేరుతో పెళ్లికాని వారికి కుచ్చు టోపీలు పెడుతున్న 8 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరినీ 4 రోజుల పాటు కస్టడీలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు.

మావల్‌కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి వడ్‌గావ్ మావల్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠా చేతిలో మోసపోయిన ఫిర్యాదుదారుడు చదువుకోని నిరుద్యోగి కావడంతో వధువు దొరకడం కష్టమైంది. దీంతో పెళ్లికూతురిని చూపిస్తానని చెప్పుకునే.. గ్యాంగ్ లీడర్ గా ఉన్న జ్యోతి పాటిల్ ను సంప్రదించాడు. అప్పుడు జ్యోతి, దివ్య ఖండేల్‌ అనే మహిళను సోనాలి జాదవ్‌గా పరిచయం చేసింది. పెళ్లి కోసం వారి నుంచి రూ.2.4 లక్షలు డిమాండ్ చేసింది. ఈ మేరకు డబ్బులు ముట్టజెప్పినట్టుగా పోలీసులు తెలిపారు.

తాను పెళ్లి చేసుకుంటున్న వధువు ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఫిర్యాదుదారుడి కుటుంబీకులు ఆరా తీశారు. తర్వాత, దివ్య ఖండేల్‌కు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని గుర్తించారు. దాంతో వెంటనే క్రైం బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జ్యోతి పాటిల్ గ్యాంగ్ పెళ్లికాని వారిని టార్గెట్ చేసి మోసం చేస్తున్నారనే షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయి.

ఇవి కూడా చదవండి

వయస్సు పైబడిన పెళ్లికాని పురుషులను లక్ష్యంగా చేసుకుని, పెళ్లికూతురును చూపించే డ్రామాతో వారికి పెళ్లి చేస్తారు. డబ్బులు ముట్టిన తర్వాత.. పెళ్లయిన ఆరు, ఏడు రోజులకే నగలు, డబ్బులు దోచుకుని నవ వధువు పారిపోయేవారు. ఈ ముఠా నెట్‌వర్క్‌లో చిక్కుకున్న చాలా మంది బాధితులు సమాజంలో తమ ముఖం చూపించడానికి భయపడి, లేదంటే పరువు పోతుందనే భయంతో ఈ ముఠా మోసంపై ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు.

ఇలా మోసపోయిన వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. అరెస్టు చేసిన 8 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పుణె క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ పద్మాకర్ ఘన్‌వత్ తెలిపారు .

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..