Viral Video: ఛీ.. మీ పిచ్చి పాడుగాను.. నిజంగానే వీళ్ల మెదడు మొకాళ్లలోకి వచ్చింది.. ఏకంగా ఆపరేషన్ థియేటర్‌లో..
విపత్కర సమయాల్లో జనం ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు... సరిహద్దులను కాపాడే సైనికుల వలె పగలు, రాత్రి అని తేడా లేకుండా అనునిత్యం శ్రమిస్తుంటారు. అందుకే.. వైద్యులను వైద్యో నారాయణో హరి.. అంటారు. దేవుడితో సమానంగా భావించే ఓ వైద్యుడు తన వృత్తిధర్మాన్ని మరచి ఏకంగా ఆసుపత్రిలోనే ప్రీవెడ్డింగ్ షూట్ చేశాడు.

విపత్కర సమయాల్లో జనం ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు… సరిహద్దులను కాపాడే సైనికుల వలె పగలు, రాత్రి అని తేడా లేకుండా అనునిత్యం శ్రమిస్తుంటారు. అందుకే.. వైద్యులను వైద్యో నారాయణో హరి.. అంటారు. దేవుడితో సమానంగా భావించే ఓ వైద్యుడు తన వృత్తిధర్మాన్ని మరచి ఏకంగా ఆసుపత్రిలోనే ప్రీవెడ్డింగ్ షూట్ చేశాడు. ఓ రోగికి ఆపరేషన్ చేస్తున్నట్లు యాక్ట్ చేసి.. జీవించాడు. చివరికి అందరితో చివాట్లు తిన్నాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ షాకింగ్ ఘటన కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో జరిగింది. వైద్యుడి ఫొటోషూట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కాగా.. ప్రస్తుత కాలంలో వివాహనికి ముందు ప్రీవెడ్డింగ్ షూట్ పేరిట కొత్త జంటలు ఫొటోలకు పోజులిస్తున్నాయి. ఈ కొత్త ట్రెండ్.. పలు విమర్శలకు తావిస్తోంది.. కొందరు రోడ్లపై, మరికొందరు కదులుతున్న వాహనాలు, గుంతల్లో.. ఇంకా బురదలో ఇలా ఫొటో షూట్ చేస్తూ.. అందరితో చివాట్లు తింటున్నారు. మరికొందరు ప్రమాదకర ప్రాంతాల్లో ఫొటోలు దిగుతూ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. ఈ ట్రెండ్ తో అందరినీ ఆకట్టుకోవాలని కర్ణాటకకు చెందిన ఓ యువ వైద్యుడు వినూత్నంగా ఆలోచించాడు.
భరంసాగర్ ఏరియాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వైద్యుడిగా పనిచేస్తున్న ఆ డాక్టర్.. ఆపరేషన్ థియేటర్ గదినే అందుకు ప్రీ వెడ్డింగ్ షూట్ కు వేదికగా ఉపయోగించుకున్నాడు. ఇంకేముంది తన భాగస్వామితో కలిసి ఓ రోగికి ఆపరేషన్ చేస్తున్నట్లు మస్త్ గా పోజులిస్తూ ఫొటోలు, వీడియోలు తీయించుకున్నాడు. ఈ విషయం కాస్త.. ఆసుపత్రిలో, వైద్యవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా.. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
వీడియో చూడండి..
A doctor’s pre-wedding photoshoot in a govt hospital’s operation theatre in #Bharamasagar of #Chitradurga. Dr. Abhishek, a contract physician, performed a ‘surgery’ with his fiancee.
DHO says it was unused OT & issues notice to the administrator.#Karnataka #PreWeddingShoot pic.twitter.com/Eve0g3K9p1
— Hate Detector 🔍 (@HateDetectors) February 9, 2024
ఈ ఘటనపై కర్ణాటక వైద్యారోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండురావ్.. దీనిపై సోషల్ మీడియా ప్లాట్ ఫాం.. ఎక్స్ వేదికగా స్పందించారు. ఆసుపత్రిలో ప్రీవెడ్డింగ్ షూట్ నిర్వహించిన వైద్యుడిని తక్షణమే సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వ ఆసుపత్రులను నెలకొల్పింది ప్రజలకు వైద్యాన్ని అందించడానికి మాత్రమేనని.. వాటిని వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి కాదంటూ మంత్రి పేర్కొన్నారు. వైద్యులు తమ వృత్తిని మరచి క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడితే సహించేది లేదంటూ హెచ్చరించారు.
కాగా.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారగా.. పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
