Viral: ఎయిర్‌పోర్ట్‌లో చెకింగ్ చేస్తుండగా బిత్తర చూపులు.. అనుమానంతో బ్యాగ్ చెక్ చేయగా..!

ఈ మధ్యకాలంలో కేటుగాళ్లు తెలివి మీరిపోయారు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. స్మగ్లింగ్, డ్రగ్స్, అక్రమాయుధాల రవాణా, హైటెక్ వ్యభిచారం ఇలా ఎన్నో రకాల అక్రమ దందాలకు పాల్పడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో..

Viral: ఎయిర్‌పోర్ట్‌లో చెకింగ్ చేస్తుండగా బిత్తర చూపులు.. అనుమానంతో బ్యాగ్ చెక్ చేయగా..!
Airport
Follow us

|

Updated on: Feb 10, 2024 | 8:32 AM

ఈ మధ్యకాలంలో కేటుగాళ్లు తెలివి మీరిపోయారు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. స్మగ్లింగ్, డ్రగ్స్, అక్రమాయుధాల రవాణా, హైటెక్ వ్యభిచారం ఇలా ఎన్నో రకాల అక్రమ దందాలకు పాల్పడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇదిలా ఉంటే.. విదేశాల నుంచి అక్రమంగా డబ్బు, బంగారం, వజ్రాలను స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరుకుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వాటికి పోలీసులు ఎన్నిరకాలుగా అడ్డుకట్టలు వేస్తున్నా.. ఏదొక రకంగా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కోట్ల విలువచేసే వజ్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకెళ్తే.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో డీఆర్ఐ అధికారులు వజ్రాల స్మగ్లింగ్‌ చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రెండున్నర కోట్ల విలువైన వజ్రాలను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. విమానంలో బ్యాంకాక్‌ వెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తిని చెన్నై ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తనిఖీ చేయగా.. అక్రమ వజ్రాల గుట్టురట్టు అయింది. అతని బ్యాగ్‌ను చెక్‌ చేయడంతో భారీగా వజ్రాలు బయటపడ్డాయి. 1003.99 క్యారెట్ల డైమండ్స్‌గా గుర్తించి.. వాటి విలువ సుమారు రెండు కోట్ల 33లక్షలు ఉంటుందని చెన్నై ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అంచనా వేశారు. తనిఖీ సమయంలో ప్రయాణికుడు చెకింగ్‌ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. డీఆర్‌ఐ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి.. వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక.. అక్రమ వజ్రాలతో పట్టుబడ్డ వ్యక్తిని చెన్నై డీఆర్ఐ అధికారులు విచారిస్తున్నారు. వజ్రాల స్మగ్లింగ్‌లో అతని వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు చేస్తున్నారు. చట్ట విరుద్ధమైన లావాదేవీల విషయంలో సహించేదిలేదని హెచ్చరించారు డీఆర్ఐ అధికారులు.

Illegal Diamonds

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్