కూల్ డ్రింక్ తాగడం వల్ల ఇన్ని సమస్యలా.. తెలుసుకుంటే షాక్ అవుతారు..

స్నేహితులతో టైం పాస్ కోసం.. తిన్నది అరిగించుకోవడం కోసమో చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. కొందరికి సందర్భం ఏదైనా మెల్లగా కూల్ డ్రింక్ కడుపులో పడితే ఆ హాయే వేరు. కానీ శీతలపానీయమే కదా అని అదే పనిగా ఎక్కువగా తాగితే కొంప ముంచుతుంది. వీటిని ఎక్కువగా తాగటం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.

కూల్ డ్రింక్ తాగడం వల్ల ఇన్ని సమస్యలా.. తెలుసుకుంటే షాక్ అవుతారు..
Cool Drinks Side Effect
Follow us

| Edited By: Srikar T

Updated on: Feb 12, 2024 | 11:21 AM

స్నేహితులతో టైం పాస్ కోసం.. తిన్నది అరిగించుకోవడం కోసమో చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. కొందరికి సందర్భం ఏదైనా మెల్లగా కూల్ డ్రింక్ కడుపులో పడితే ఆ హాయే వేరు. కానీ శీతలపానీయమే కదా అని అదే పనిగా ఎక్కువగా తాగితే కొంప ముంచుతుంది. వీటిని ఎక్కువగా తాగటం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.

చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు కూల్ డ్రింక్స్ చాలా ఎక్కువగా తాగుతూ ఉంటారు. దాహం తీరుతుందని చల్లగా ఉండే శీతల పానీయాన్ని గటగట తాగేస్తారు. ఇంటికి అతిధులు వచ్చిన.. టూర్లకు వెళ్లిన.. కూల్ డ్రింక్స్ కచ్చితంగా ఉండాల్సిందే. చూడటానికి రకరకాల రంగుల్లో చల్లగా ఉంటాయి కూల్ డ్రింక్స్. ఇటీవల రోజుల్లో వీటిని తాగే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వేసవి వస్తే చాలు శీతలపానీయాలు ఇంకా ఎక్కువగా త్రాగుతున్నారు. కానీ కూల్ డ్రింక్స్‎ను అదే పనిగా తాగటం వలన లేనిపోని రోగాన్ని కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు డాక్టర్లు.

అతిగా కూల్ డ్రింక్స్ తాగటం వలన దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. శీతల పానీయాలు లేదా సోడా డ్రింక్స్ వంటి స్వీట్ టేస్ట్ పానీయాలు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు. కూల్ డ్రింక్స్ తాగి సంతృప్తి చెందినప్పటికీ ఈ పానీయాలు ప్రాణాంతక వ్యాధులను పెంచుతాయి. ఇటువంటి పానీయాలను సేవిస్తే మహిళలకు మరింత ప్రమాదం అంటున్నారు నిపుణులు. శీతల పానీయాలు సేవిస్తే బరుగు పెరుగుతామని చాలామంది మహిళలు భావిస్తారు. బరువు మాత్రమే కాదు సోడా పానీయాలు కాలేయం, క్యాన్సర్‎తో పాటు అనేక అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. కొన్నిసార్లు పిజ్జా, బిర్యానీ, బర్గర్లతో శీతల పానీయాలు విచ్చలవిడిగా తాగేస్తూ ఉంటాం. ఇవి కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

కూల్ డ్రింక్ పురుషులు, స్త్రీలకు అసలు ప్రయోజకరమైతే కాదు. వీటిలో పోషకాలు ఉండవు. ఈ పానీయాలను కృత్రిమ చక్కెరతో తయారుచేశారు. ఇలాంటి పానీయాలను క్రమం తప్పకుండా తాగటం వలన ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్, కాలేయం దెబ్బ తినడం, జీర్ణ సమస్యలు వస్తాయి. కూల్ డ్రింక్స్ తాగడం వలన పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువ శాతం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లివర్ క్యాన్సర్‎తో పాటు ప్రెగ్నెన్సీ , గుండెపోటు ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఈ శీతల పానీయాలు తాగడం వలన మహిళల్లో ఫ్రై బ్రోస్ , ఫిరోసిస్ వంటి కాలేయంలో మంట వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి ప్రమాదానికి దారితీస్తుంది. కాలేయ క్యాన్సర్ తో పాటు రొమ్ము మరికొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..