Shark Attack Video Viral : సముద్రంలో షార్క్‌ దాడి.. ఒకే షాట్‌తో ఇద్దరు టార్గెట్‌..! కెమెరాలో చిక్కిన భయానక క్షణాలు..

ఇకపోతే, వైరల్‌ వీడియోపై చాలా మంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ షార్క్ తన స్నేహితులతో పందెం వేసి ఒకే రౌండ్‌లో ఎంత మందిపై దాడి చేయగలదో చూపించడానికి సరదాగా ప్రయత్నించిందని కొందరు వ్యాఖ్యానించారు.మరోవైపు, ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 షార్క్ దాడులు జరుగుతున్నాయి. సముద్రంలో ఉన్నప్పుడు అనేకమంది ఈతగాళ్ళు సొరచేపల దాడిలో చనిపోతున్నారని

Shark Attack Video Viral : సముద్రంలో షార్క్‌ దాడి.. ఒకే షాట్‌తో ఇద్దరు టార్గెట్‌..! కెమెరాలో చిక్కిన భయానక క్షణాలు..
Shark Attack
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 12, 2024 | 4:23 PM

లోతైన నీలి సముద్రం రహస్యాన్ని తెలుసుకోవడానికి నలుగురు డైవర్లు బయలుదేరారు. సముద్రపు అడుగుభాగానికి వెళుతున్నప్పుడు వారు నెమ్మదిగా మరింత లోతుకు చేరుకున్నారు. సూర్య కిరణాలు కూడా వారికి కనిపించనంత లోతుకి వెళ్లిపోయారు. అకస్మాత్తుగా ఆ చీకటి సముద్రంలో వారికి దూరంగా గర్జించే తుఫాను వంటి శబ్దం ప్రారంభమైంది. కొన్ని సెకన్లలో శబ్దం మరింత పెరిగింది. ప్రశాంతమైన సముద్రంలో అలజడి మొదలైంది. దాని గురించి ఆలోచించేలోపుగానే..ఆ డైవర్స్ వైపు ఒక పెద్ద షార్క్ దూసుకు రావడం కనిపించింది. ఇదంతా ఎవరో క్రియేట్‌ చేసి చెబుతున్న, రూపొందించిన కథ కాదు.. కానీ అలాంటి థ్రిల్ నిజంగా జరిగింది.. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కేమన్ ఐలాండ్స్‌లోని ఫిషింగ్ గైడ్ కామెరాన్ కిర్కోన్నెల్ ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇది వారికి జరగలేదు, అయితే ఈ రకమైన షార్క్ దాడులు ఎంత షాకింగ్‌గా ఉంటాయో ఈ వీడియో చూపిస్తుంది. ఒక లక్ష 26 వేల మందికి పైగా ఫాలోవర్లతో షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. క్యాప్షన్ ప్రకారం, ఈ వీడియో మాల్దీవులకు చెందినదిగా తెలిసింది. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, వైరల్‌ వీడియోపై చాలా మంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ షార్క్ తన స్నేహితులతో పందెం వేసి ఒకే రౌండ్‌లో ఎంత మందిపై దాడి చేయగలదో చూపించడానికి సరదాగా ప్రయత్నించిందని కొందరు వ్యాఖ్యానించారు.మరోవైపు, ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 షార్క్ దాడులు జరుగుతున్నాయి. సముద్రంలో ఉన్నప్పుడు అనేకమంది ఈతగాళ్ళు సొరచేపల దాడిలో చనిపోతున్నారని సమాచారం. డిసెంబర్ 2023లో, ఆస్ట్రేలియాలోని బీచ్‌లో షార్క్ దాడిలో ఒక యువకుడు మరణించాడు. ఇన్నెస్ నేషనల్ పార్క్‌లోని ఎథెల్ బీచ్ సమీపంలో జరిగిన దాడి తర్వాత యువకుడి మృతదేహాన్ని నీటి నుండి బయటకు తీశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..