Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్ధరాత్రి హైవేపై చోరీ.. వేగంగా వెళ్తున్న వాహనంలోంచి ప్రాణాలకు తెగించి.. వణుకు పుట్టించ వీడియో వైరల్‌..

మీలో చాలా మంది పూణె-ముంబై హైవేలో సెలవుల కోసమో, ఏదైనా పని కోసమో ప్రయాణించే ఉంటారు. అయితే,ఈ హైవేలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదాలు జరిగిన సంఘటనలను మీరు తప్పక చూసి ఉంటారు. కానీ, ప్రస్తుతం పూణే-ముంబై హైవేకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది మిమ్మల్ని షాక్ అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే.. ఈ వీడియోలో, ఒక వ్యక్తి వేగంగా వెళ్తున్న ఒక టెంపో వెనుక వేలాడుతూ..టెంపో నుండి దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూణె- ముంబై […]

అర్ధరాత్రి హైవేపై చోరీ.. వేగంగా వెళ్తున్న వాహనంలోంచి ప్రాణాలకు తెగించి.. వణుకు పుట్టించ వీడియో వైరల్‌..
Pune Mumbai Highway
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 12, 2024 | 4:42 PM

మీలో చాలా మంది పూణె-ముంబై హైవేలో సెలవుల కోసమో, ఏదైనా పని కోసమో ప్రయాణించే ఉంటారు. అయితే,ఈ హైవేలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదాలు జరిగిన సంఘటనలను మీరు తప్పక చూసి ఉంటారు. కానీ, ప్రస్తుతం పూణే-ముంబై హైవేకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది మిమ్మల్ని షాక్ అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే.. ఈ వీడియోలో, ఒక వ్యక్తి వేగంగా వెళ్తున్న ఒక టెంపో వెనుక వేలాడుతూ..టెంపో నుండి దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూణె- ముంబై హైవేలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

పూణే-ముంబై హైవేపై రాత్రి వేళల్లో చాలా పెద్ద పెద్ద టెంపోలు, చిన్న కార్లు వేగంగా వెళ్తుండటం ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఆ సమయంలో రోడ్డుపై నడుస్తున్న టెంపో వెనుక ఓ వ్యక్తి నిలబడి కనిపించాడు. ఆ వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టి దొంగతనం చేసేందుకు టెంపో వెనుక వేలాడుతున్నాడు. ఈ వీడియో క్యాప్షన్‌లో పూణె-ముంబై హైవేపై నడిరాత్రి 2.36 గంటల మధ్య దొంగతనం జరిగిందని రాసి ఉంది. డ్రైవర్ మిత్రులందరూ తమ ప్రాణాలను కాపాడుకోవాలని మనవి అంటూ రాశారు..

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా అతడు దొంగతనం కోసమో లేక మరేదైనా టెంపో వెనుక వేలాడుతూ ప్రయాణిస్తున్నాడా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ, మీరు కూడా రాత్రి పూణే-ముంబై హైవేలో ప్రయాణిస్తున్నట్లయితే, జాగ్రత్తగా ఉండండి.

పూణే-ముంబై హైవేపై రాత్రి పూట అనేక ట్రక్కులు, టెంపోలు కార్లు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఈ వాహనాలు ముంబై, ఇతర ప్రాంతాలకు డెలివరీ చేయడానికి వివిధ రకాల వస్తువులను తీసుకువెళతాయి. లేదా వివిధ కంపెనీల వస్తువులు సరఫరా అవుతుంటాయి.. ఇందులో అవకాశాలు వెతుక్కోవడం, సద్వినియోగం చేసుకోవడం, దొంగతనాలు తరచూ జరుగుతుంటాయి. కాబట్టి ట్రక్కు డ్రైవర్లు, టెంపో డ్రైవర్లు పూణె-ముంబై హైవేలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ పలువురు సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..