Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలో అత్యంత పేద దేశం ఏదో తెలుసా..? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి..

భారతదేశంలో అతిపెద్ద జాతీయ ఉద్యానవనం ఏది?, ప్రపంచంలో అత్యంత పేద దేశం ఏదో తెలుసా? చంద్రునిపైకి మొదట వెళ్ళిన జంతువు ఏది? ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలు వాటికి సమాధానాలను కూడా అందించాం..అవి చదివిన తర్వాత, మీకు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసో చెప్పండి. అంతేకాదు..పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి  ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.. 

ప్రపంచంలో అత్యంత పేద దేశం ఏదో తెలుసా..? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి..
Interesting Questions
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 12, 2024 | 5:12 PM

జీవితంలో నేర్చుకోవడానికి వయస్సుతో సంబంధం లేదు. ఏ వయస్సులోనైనా చదువుకోవచ్చు.. ఆధునీకతకు అనుగుణంగా కావాల్సినది నేర్చుకోవచ్చు. ఈ రోజు మేము మీ కోసం కొన్ని అద్భుతమైన, ఆసక్తికరమైన సందేహాలు, వాటికి సమాధానాలను కూడా తీసుకువచ్చాము. నిజమేనండోయ్.. ఇక్కడ చాలా ప్రశ్నలు మీకు సమాధానం తెలియవు.  భారతదేశంలో అతిపెద్ద జాతీయ ఉద్యానవనం ఏది?, ప్రపంచంలో అత్యంత పేద దేశం ఏదో తెలుసా? చంద్రునిపైకి మొదట వెళ్ళిన జంతువు ఏది? ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలు వాటికి సమాధానాలను కూడా అందించాం..అవి చదివిన తర్వాత, మీకు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసో చెప్పండి. అంతేకాదు..పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి  ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం..

– ప్రశ్న: ప్రపంచంలో అత్యధికంగా రబ్బరు ఉత్పత్తి చేసే దేశం ఏది?

– జవాబు: అతిపెద్ద రబ్బరు ఉత్పత్తి చేసే దేశం థాయిలాండ్.

ఇవి కూడా చదవండి

– ప్రశ్న: భారతదేశంలో అతిపెద్ద జాతీయ ఉద్యానవనం ఏది?

-జవాబు : కజిరంగా నేషనల్ పార్క్, ఇది అస్సాంలో ఉంది.

-ప్రశ్న : అమెరికా వెలుపల మొదటి స్టార్‌బక్స్ ఏ దేశంలో ప్రారంభించబడింది?

– జవాబు : US వెలుపల మొదటి స్టార్‌బక్స్ జపాన్‌లో ప్రారంభించబడింది.

-ప్రశ్న: ‘తెలివి’కి వ్యతిరేకం ‘అవివేకం’ అయితే, ‘నైపుణ్యం’కి వ్యతిరేకం ఏమిటి?

-జవాబు : ‘నైపుణ్యం’ వ్యతిరేక పడం ‘నైపుణ్యం లేదు’

– ప్రశ్న: చంద్రునిపైకి మొదట వెళ్లిన జంతువు ఏదో తెలుసా?

– జవాబు: చంద్రునిపైకి వెళ్ళిన మొదటి జంతువు కుక్క.

-ప్రశ్న: ప్రపంచంలో అత్యంత పేద దేశం ఏది?

-జవాబు: ఆఫ్రికా దేశం దక్షిణ సూడాన్ ప్రపంచంలోనే అత్యంత పేద దేశం కాగా, రెండవ పేద దేశం బురుండి.

-ప్రశ్న: ప్రపంచంలో అత్యంత ధనిక దేశం ఏది?

– జవాబు: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం.

– ప్రశ్న: బీహార్ రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటుంది?

– జవాబు: బీహార్ రాష్ట్రం ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌తో పాటు నేపాల్ దేశంతో సరిహద్దులను పంచుకుంటుంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..