Horoscope Today: వారికి బంధువులతో అపార్థాలు తలెత్తే అవకాశం.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు..!

దిన ఫలాలు (ఫిబ్రవరి 13, 2024): మేష రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆర్థికపరంగా అభివృద్ధి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలను విస్తరించుకునే ప్రయత్నం చేస్తారు. మిథున రాశి వారికి బంధువుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారికి బంధువులతో అపార్థాలు తలెత్తే అవకాశం.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు..!
Horoscope Today 13th February 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 13, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఫిబ్రవరి 13, 2024): మేష రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆర్థికపరంగా అభివృద్ధి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలను విస్తరించుకునే ప్రయత్నం చేస్తారు. మిథున రాశి వారికి బంధువుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి. వ్యక్తిగత విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. కొందరు స్నేహితుల తీరుతెన్నులు ఆందోళన కలిగి స్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థికపరంగా అభివృద్ధి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలను విస్తరించుకునే ప్రయత్నం చేస్తారు. బంధు మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగంలో అధికారులకు చేరువవుతారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. సర్వత్రా మీ మాట చెల్లుబాటవుతుంది. సోదరులతో వివాదం సమసిపోతుంది. కుటుంబ జీవితంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్యం పరవాలేదు. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆర్థికపరంగా అనుకూల పరిస్థితులుంటాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవు తాయి. ప్రయాణాలలో ఆశించిన ఫలితాలను సాధిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయం అవుతారు. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ఆలయాలను, ప్రాంతాలను సందర్శిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ ఆలోచనలు, సలహాలు అందరికీ నచ్చేవిగా ఉంటాయి. వ్యాపారంలో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. అనుకోని ఖర్చులు మీద పడే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా సంతృప్తికరంగా పూర్తవు తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొందరు బంధువులతో చిన్నపాటి మాట పట్టింపులుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి. ఆరోగ్యం అన్నివిధాలా అనుకూలిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగులకు ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వాహన ప్రమాద సూచనలున్నాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. సోదరుల నుంచి సహకారం ఉంటుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సమ యం బాగా అనుకూలంగా ఉంది. అనుకోకుండా సంపద, సంపాదన కలిసి వస్తాయి.పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధు వర్గంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సహో ద్యోగుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవు తాయి. దీర్థకాలిక రుణాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్ని పెంచుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయ సహకారాలందుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. సర్వత్రా మీ మాట చెల్లుబాటవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. చేపట్టిన పనులు అవరోధాలు లేకుండా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలు మందగిస్తాయి. కొందరు బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో మీ పని తీరుకు అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ఆహార విహారాల్లోనే కాక, ప్రయాణాల్లోనూ జాగ్రత్తలు పాటించడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఇంటా బయటా పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఒక శుభ కార్యం విషయంలో కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి లబ్ధి పొందుతారు. వివాహ ప్రయత్నాలు సానుకూల పడతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయ ప్రయత్నాలు ఫలించి అవసరాలు తీరుతాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అధికారులు అన్నివిధాలుగానూ అండగా నిలబడతారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు బాగా పురోగతి చెందుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరు గుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభసాటి వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. వ్యక్తిగత సమస్య సమసిపోతుంది. ఆరోగ్యం పరవా లేదు.