Job Astrology: కుజ, రవుల కలయిక.. ఆ రాశుల వారు వృత్తి, ఉద్యోగాల్లో దూసుకుపోవడం ఖాయం..!

మకర రాశిలో కుజ, రవులు కలవడంతో వృత్తి, ఉద్యోగాలపరంగా మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఈ రెండు గ్రహాలు అధికార దాహం ఉన్న గ్రహాలే కనుక వృత్తి, ఉద్యోగాల్లో దూసుకుపోవడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాల కాంబినేషన్ వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందేది మేషం, సింహం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులు. ఫిబ్రవరి 12తో ప్రారంభమయ్యే ఈ రెండు గ్రహాల కలయిక ప్రభావం దాదాపు నెల రోజులకు పైగా కొనసాగే అవకాశం ఉంది.

Job Astrology: కుజ, రవుల కలయిక.. ఆ రాశుల వారు వృత్తి, ఉద్యోగాల్లో దూసుకుపోవడం ఖాయం..!
Job Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 12, 2024 | 6:39 PM

మకర రాశిలో కుజ, రవులు కలవడంతో వృత్తి, ఉద్యోగాలపరంగా మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఈ రెండు గ్రహాలు అధికార దాహం ఉన్న గ్రహాలే కనుక వృత్తి, ఉద్యోగాల్లో దూసుకుపోవడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాల కాంబినేషన్ వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందేది మేషం, సింహం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులు. ఫిబ్రవరి 12తో ప్రారంభమయ్యే ఈ రెండు గ్రహాల కలయిక ప్రభావం దాదాపు నెల రోజులకు పైగా కొనసాగే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి దశమస్థానంలో ఈ రెండు గ్రహాల కాంబినేషన్ ఏర్పడుతున్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. సీనియర్లతోనూ, సహచరులతోనూ పోటీ ఉన్నప్పటికీ అధికారం ఈ రాశివారినే వరించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలపరంగా ఆదాయం, రాబడి అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ప్రభుత్వపరంగా కూడా లబ్ధి పొందడం జరుగుతుంది.
  2. సింహం: ఈ రాశినాథుడైన రవి ఆరవ స్థానంలో ఉండడమే ఒక అదృష్టం కాగా, దానితో ఉచ్ఛ కుజుడు కల వడం ఒక పెద్ద యోగం. వృత్తి, ఉద్యోగాల్లో బాగా దూసుకుపోవడం, ఎటువంటి సమస్యలు, ఆటం కాలనైనా అధిగమించడం జరుగుతుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. నిరు ద్యోగులకు ఆశించిన కంపెనీలో కోరుకున్న ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంటుంది. రావల సిన డబ్బు చేతికి వస్తుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.
  3. తుల: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో రవి, కుజులు కలవడం వల్ల అధికార యోగం పట్టినా పట్టక పోయినా అధికారం చెలాయించే అవకాశం ఏర్పడుతుంది. ఊహించని విధంగా పదోన్నతి లభించే సూచనలున్నాయి. పదోన్నతి ద్వారా ప్రాభవం, ప్రాధాన్యం మరింత పెరుగుతాయి. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో ఆశించిన దానికంటే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. ఆస్తి కలిసి రావడం గానీ, ఆస్తి విలువ పెరగడం గానీ జరుగుతుంది.
  4. వృశ్చికం: ఈ రాశ్యధిపతి కుజుడు ఉచ్ఛస్థితిలోకి రావడంతో పాటు రవి గ్రహంతో కలవడం వల్ల ఈ రాశివారు తప్పకుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. కొందరు అతి ముఖ్యమైన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రభుత్వం నుంచి కూడా కలిసి వస్తుంది.
  5. మకరం: ఈ రాశిలో రవి, కుజులు కలవడం వల్ల ఈ రాశివారికి అన్ని విధాలుగానూ ప్రాభవం పెరుగు తుంది. ప్రభుత్వపరంగా లబ్ధి చేకూరుతుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా శుభవార్తలు వినడం జరుగుతుంది. సామాజికంగా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆశించిన దానికంటే ఎక్కువగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి.
  6. మీనం: ఈ రాశికి లాభ స్థానంలో రవి, కుజులు కలవడం అనేది అనేక విధాలుగా శుభ పరిణామాలకు అవకాశం ఇస్తుంది. ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆరోగ్యం గణనీయంగా మెరు గుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారం లభించడంతో పాటు ప్రాభవం, ప్రాధాన్యం పెరుగు తాయి. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. తలపెట్టిన ప్రతి ప్రయత్నమూ ఫలవంతం అవు తుంది. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది.