Zodiac Signs: కుంభ రాశిలో రవి సంచారం.. ఆ రాశుల వారికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!

ఈ నెల 14 నుంచి మార్చి నెల 15 వరకూ కుంభ రాశిలో సంచరించబోతున్న రవి వల్ల ఆరు రాశుల వారికి అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరగడం, అధికారం చేపట్టడంతో పాటు, నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు రావడం కూడా జరుగుతుంది. సామాజికంగా మంచి పరిచయాలు ఏర్పడతాయి. అన్ని విధాలుగానూ పలుకుబడి పెరుగుతుంది.

Zodiac Signs: కుంభ రాశిలో రవి సంచారం.. ఆ రాశుల వారికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 12, 2024 | 6:18 AM

ఈ నెల 14 నుంచి మార్చి నెల 15 వరకూ కుంభ రాశిలో సంచరించబోతున్న రవి వల్ల ఆరు రాశుల వారికి అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరగడం, అధికారం చేపట్టడంతో పాటు, నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు రావడం కూడా జరుగుతుంది. సామాజికంగా మంచి పరిచయాలు ఏర్పడతాయి. అన్ని విధాలుగానూ పలుకుబడి పెరుగుతుంది. తండ్రి వైపు నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. తండ్రికి యోగం పడుతుంది. ఈ ఆరు రాశులుః మేషం, వృషభం, మిథునం, తుల, ధనుస్సు, మకరం. ఈ రాశుల వారికి అధికార యోగంతో పాటు, ఆర్థిక లాభం, ఆస్తి లాభం వంటివి కూడా కలిగే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి లాభ స్థానంలో రవి సంచారం వల్ల ఎటువంటి సమస్యలైనా చాలావరకు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగి, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగా రాబడి అంచనాలకు మించి పెరిగే అవ కాశం ఉంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఏ రంగంలోని వారికైనా పురోగతి ఉంటుంది.
  2. వృషభం: ఈ రాశివారికి దశమ స్థానంలో రవి సంచారం జరుగుతుంది. దశమ స్థానంలో రవి సంచారం వల్ల ఈ గ్రహానికి దిగ్బలం ఏర్పడుతుంది. ఫలితంగా ఈ రాశివారికి తప్పకుండా అధికార యోగం పడు తుంది. వీరి సలహాలు, సూచనలతో వీరు పని చేసే కంపెనీ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగం సంపాదిం చడానికి, ఉద్యోగం మారడానికి అవకాశాలు మెరుగుపడతాయి. తండ్రి నుంచి ఆస్తి సంక్రమిస్తుంది.
  3. మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో రవి సంచారం వల్ల విదేశీ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు, అవివాహితులకు విదేశీ సంబంధమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం విశేషంగా పెరుగుతుంది. తండ్రి వైపు వారి నుంచి ఆస్తి లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్లు వెనకడుగు వేస్తారు. రాజకీయ ప్రాధాన్యం పెరుగుతుంది.
  4. తుల: ఈ రాశికి లాభాధిపతి అయిన రవి పంచమంలో సంచారం ప్రారంభించడం వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా ప్రాధాన్యం పెరుగుతుంది. వీరి ఆలోచనలు, అభిప్రాయాలు, సలహాలు, సూచన లకు విలువ ఉంటుంది. అనేక మార్గాలలో ధనార్జనకు అవకాశం ఉంటుంది. ఉద్యోగం మారాలను కుంటున్నవారికి సమయం అనుకూలంగా ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఊహించని విధంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  5. ధనుస్సు: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన రవి తృతీయ స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల కొద్ది ప్రయ త్నంతో ఎటువంటి కార్యాన్నయినా సాధించడం జరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయ త్నాలు తప్పకుండా సఫలం అయ్యే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయా ణాలు లాభిస్తాయి. ఆర్థికపరంగానే కాక, ఆరోగ్యపరంగా కూడా ముందుకు దూసుకుపోవడం జరు గుతుంది. సామాజికంగా ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.
  6. మకరం: ఈ రాశికి అష్టమాధిపతి అయిన రవి ధన స్థానమైన కుంభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వపరంగా కూడా ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కుటుంబపరంగా శుభవార్తలు వింటారు. మాటకు, చేతకు విలువ బాగా పెరుగుతుంది.