Horoscope Today: వారికి శుభవార్తలు అందుతాయి.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 12, 2024): మేష రాశి వారికి ఉద్యోగంలో చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అధికారులు అతిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారికి శుభవార్తలు అందుతాయి.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 12th February 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 12, 2024 | 6:11 AM

దిన ఫలాలు (ఫిబ్రవరి 12, 2024): మేష రాశి వారికి ఉద్యోగంలో చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అధికారులు అతిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగం, వృత్తి,వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. కుటుంబ సభ్యుల నుంచి, బంధువుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభి స్తాయి. శుభ వార్తలు అందుతాయి. విద్యార్థుల చదువుల పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. ప్రేమ వ్యవహారాలు కూడా సాఫీగా సాగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అధికారులు అతిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను వేగంగా పూర్తి చేస్తారు. శ్రమ, తిప్పట, వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి,వ్యాపారాల్లో బిజీ అయిపోతారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. కొద్దిగా డబ్బు నష్టపోవడం జరుగుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఖర్చులు అదుపు తప్పుతాయి. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. చిన్ననాటి స్నేహితు లతో ఎంజాయ్ చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

రోజంగా బాగా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారులకు చేరువవుతారు. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, ముఖ్యమైన ప్రయత్నాలు తేలికగా నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి కానీ, కొన్ని అనవసర స్నేహాలకు కూడా అవకాశం ఉంది. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా మంచి ఫలితాలుంటాయి. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు కానీ, కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. సమీప బంధు వుల నుంచి శుభవార్త అందుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ముఖ్య మైన వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రోజంగా సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరగవచ్చు. స్నేహితుల సహా యంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందు తాయి. జీవితభాగస్వామికి ఉద్యోగపరంగా ప్రాధాన్యం పెరుగుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. మిత్రుల వల్ల ఇబ్బందులుంటాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

గ్రహ బలం కారణంగా సమయం బాగా అనుకూలంగా ఉంది. వీలైనంతగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో సకాలంలో బాధ్యతలను పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. పెండింగు పనులను ఎంతో శ్రమతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచుతారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. ఎంతో ఔదార్యంతో ఇతరులకు బాగా సహాయపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన వ్యవ హారాలు, పనులు పూర్తి చేస్తారు. ఒక శుభకార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో ఒకటి రెండు సమస్యలున్నా వాటిని అధిగమిస్తారు. గ్రహ బలం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాలలో మీ ఆలోచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగానే ఉంటాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో కూడా విజయాలు సాధిస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి లోటుండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టే సూచ నలున్నాయి. కుటుంబపరంగా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అదనపు ఖర్చులు తప్పకపోవచ్చు. ప్రభుత్వపరంగా లబ్ధి పొందే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ప్రాంతాలను సందర్శిస్తారు. కుటుంబ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నవారికి శుభ వార్త అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చులను వీలైనంగా తగ్గించుకోవడం మంచిది. విద్యార్థులకు సమయం బాగానే ఉంది.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్